ఆమె నాకు కనిపించింది
పార్ట్ – 4
రవి భయంతో మంచం కిందకు చూడగా, భయంకరంగా ఉన్న ఒక శవం కనిపించింది. ఆ శవం ఎవరిదని ముందుకు వెళ్లి చూడగా, అది అరుణ అని రవి కి అర్థమైంది. ఆవిడ శవం ఎలా ఉందంటే, రెండు కళ్లు పీకేసి, రెండు చెవులు ఎవరో కొరికేసి, రెండు చేతివేళ్లను వెనక్కి విరిచేసి, పొట్టను చీల్చి, పొట్టలో ఉన్న పేగులు అన్నిటినీ బయటకి లాగేసి ఉన్నాయి. ఆవిడ శరీరమంతా ఎవరో గోళ్లతో రక్కేసినట్టు అంతా గాయాలుతో భయంకరంగా ఉంది . ఆవిడ గొంతును ఎవరో గొడ్డలితో నరికి వేసి నట్టు ఉంది. టెలిఫోన్ వైరు ఆవిడ గొంతుకు బిగించి వేసి ఉంది. రవి కి చాలా భయం వేసి, తను ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకొని ఎంత పప్రయత్నించినా ఇంట్లో ఎటువంటి తలుపులు తెరుచుకోవడం లేదు. రవికి ఎటు వెళ్ళాలో తెలియక, తన గదిలో ఒక మూల భయంతో వణుకుతూ కూర్చుని ఉన్నాడు. ఇక్కడ అలా ఉండగా, వీరభద్రపురం లో ఉన్న రవి అన్నయ్య నరేష్ ఇంటి తలుపు ఎవరో తడుతున్నట్టు అనిపించింది. నరేష్ బయటికి వెళ్లి చూడగా, అక్కడ ఎవరూ లేరు కానీ ఆ ఇంటి పక్కనే ఉన్న పొలాల్లో రవి కనిపించాడు. అది చూసిన నరేష్ ‘రవి ఎప్పుడు వచ్చావ్’..? అని అడుగుతూ రవి దగ్గరగా వెళ్ళాడు. రవికి దగ్గరగా వెళుతూ ఉండేసరికి, రవి ని ఎవరో లాగుకొని వెళ్తున్నట్టు కనిపించింది నరేష్ కు. అది చూసి నరేష్ తమ్ముడు నీకు ఏమైంది రా అని అంటూ పొలాలు లోపలికి వెళ్ళాడు. అంతలో దూరంగా అన్నయ్యా నన్ను కాపాడు…కాపాడు…లేదంటే, ఈ అడవి నక్కల నన్ను చంపేస్తాయి అని అంటూ రవి కనిపించాడు. అది ఆ ఆడివి లోపలికి ప్రవేశించే మార్గం. నరేష్ అది చూసుకోకుండా వెళ్ళిపోయాడు. నరేష్ చాలా దూరం వెళ్ళాడు కానీ రవి ఆచూకీ కనిపించలేదు. నరేష్ పక్కనే ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఒక ఆవిడ కూర్చొని ఏడుస్తూ ఉంది. అది గమనించిన నరేష్ నువ్వు ఎవరమ్మా? ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నావు? అని అడిగాడు. ఇంకా ఏడుస్తూ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావ్ అమ్మ ఇంతకు నువ్వు ఎవరు? అని మళ్లీ నరేష్ అడగగా, ‘నేను నీకు తెలియదా… తెలియదా…’ అంటూ ఆమె నరేష్ మీదకు దూకి నరేష్ గొంతు నొక్క బోయింది. అది చూసిన నరేష్ ఆమెను పక్కకు తోసి భయంతో పరుగుతీశాడు. అలా పరిగెడుతూ ఉండగా, ఒక పొడవాటి చెయ్యవచ్చు నరేష్ కాళ్లను లాక్కొని రవి ఉన్న ఇంటి తలుపు దగ్గర తెచ్చి పడేసింది. ఎవరైనా ఉంటే నన్ను కాపాడండి…నన్ను కాపాడండి…అంటూ నరేష్ గట్టిగా తలుపు తడుతూ అరిచాడు. లోపలున్న రవికి భయం వేసి ఈసారి తలుపు తీస్తే నేను నిజంగానే చస్తాను అనుకొని తను కూర్చున్న ప్రదేశం నుంచి లెగ లేదు. ఇంకా తలుపు అలానే తడుతూనే సరికి, రవి కిటికీ అద్దం నుంచి మరో సారి తొంగి చూడగా, బయట నిజంగానే రవి అన్నయ్య నరేష్ భయం తో కేకలు వేస్తున్నాడు. అది చూసిన రవి వెంటనే తలుపు దగ్గరికి వెళ్లి తలుపు తీశాడు. నరేష్ రవిని చూసి తమ్ముడు అంటూ కౌగిలించుకొని ఒరేయ్ రవి ఇక్కడ ఎవరో నన్ను చంపాలని చూస్తున్నారు అని చెప్పగా, అవును అన్నయ్యా నన్ను కూడా ఈ ఇంట్లో ఎవరో నన్ను భయపెడుతున్నారు. నాకు ఈ రాత్రి ఇక్కడ ఆశ్రమం ఇచ్చినా ఆవిడను చంపేసి, ఆవిడ శవం నా మంచం కింద ఉంచారు. తమ్ముడు ఈ అడవి మధ్యలో నీకు ఆశ్రయం ఇచ్చింది ఎవరు..? అని నరేష్ అడగగా, రా అన్నయ్య! నీకు ఆవిడ ను చూపిస్తా. ఆవిడ శవం నా మంచం కింద ఉంది. రవి నరేష్ ఇద్దరూ మంచం పక్కకు వెళ్లి క్రిందకి చూడగా…..
అక్కడ ఎవరూ లేరు. అన్నయ్య ఇక్కడ ఏదో వింత వింత గా జరుగుతుంది అని రవి చెప్పాడు. సరే తమ్ముడు ముందు ఇంటి నుంచి బయట పడదాం. నేను తరువాత ఈ ఇంటి గురించి నీకు మొత్తం వివరంగా చెబుతాను అని చెప్పి, ఇద్దరూ ఆ ఇంటి నుంచి బయటకు పరుగు తీసి అడవి నుంచి రోడ్డు ఉన్న మార్గం వైపు గా పరుగెత్తుతుండగా, రోడ్డు కొద్దిదూరంలో కనిపించింది. వాళ్లకు ఆ రోడ్డు మీద ఒక కారు ఆగి ఉండడం కనిపించడంతో, వాళ్ళిద్దరూ ఆ కారు దగ్గరకు వెళ్లి అందులో ఎవరైనా ఉంటే వాళ్లను సహాయం అడుగుదామని అనుకున్నారు. కానీ అక్కడ ఎవరూ లేరు కానీ ఆ కారు తాళాలు కారు కే ఉన్నాయి. అది చూసిన నరేష్ రవి తో ఇలా చెప్పాడు, తమ్ముడు మనం ఇక్కడి నుంచి ముందు ప్రాణాలతో బయట పడాలి తొందరగా కార్ స్టార్ట్ చెయ్యు అని. రవి, నరేష్ ఇద్దరు కారులో వెళ్తుండగా, ఆ పక్కగా ఒక లారీ వచ్చి వీళ్ళ కారును గుద్దుకొని వెళ్ళిపోయింది. అది చూసి నరేష్ కార్ తీస్తున్న రవి తో, తమ్ముడు మనల్ని ఆ లారీ వాడు గుద్దుకొని ఆగకుండా వెళ్ళిపోతాడ నువ్వు ఆ లారీ పక్కగా వెళ్ళు నేను ఆ లారీ డ్రైవర్ ను పక్కకు ఆప మంటాను అని నరేష్ అన్నాడు. రవి కారును ఫాస్ట్గా నడిపి, ఆ లారీకి పక్కగా తీసుకెళ్లాడు. అన్నయ్య ఆ లారీ డ్రైవర్ ను పక్కకు ఆపమని చెప్పు అని రవి చెప్పాడు. సరే, అని నరేష్ ఆ లారీ డ్రైవర్ వైపుగా చూస్తూ ఉండిపోయాడు. రవి అన్నయ్య, అన్నయ్య అని నరేష్ కు ఎంత పిలిచినా, నరేష్ పట్టించుకోకుండా తీక్షణంగా ఆ లారీ డ్రైవర్ వైపు అలానే చూస్తూ ఉండిపోయాడు. అన్నయ్య ఎవర్ని చూస్తున్నావ్, అని గట్టిగా అరుస్తూ నరేష్ భుజం మీద తట్టాడు రవి. దానితో నరేష్ “ఆమె నాకు కనిపించింది” అని అన్నాడు. “ఆమె” నా..? ఎవరు ఆ ఆమె..? అని అన్నాడు రవి. అదే రవి ది ఆఖరిమాట. దానితో రవి చూస్తుండగానే పక్కనే ఉన్న లారీ కారును గుద్దింది. ఒక్కసారిగా కారు బోల్తా పడి రవి అక్కడికక్కడే చనిపోయాడు. నరేష్ కి తన ఎడమ కాలు విరిగిపోయి ఒళ్లంతా గాయాలతో ఆ కారు నుండి బయటకు తుళ్ళిపోయాడు. నరేష్ కుంటుకుంటూ తన తమ్ముడు దగ్గరకు వెళ్లి బోరున ఏడ్చాడు. మళ్లీ ఆ లారీ రవి ఉన్న కారును గుద్దింది. అది గమనించిన నరేష్ పక్కకు జరగడంతో, ఆ కారు లోయలోకి జారిపోయింది. నరేష్ బాధతో ఏడుస్తూ, భయంతో కుంటుకుంటూ పరుగెత్తసాగాడు. అలా పరిగెడుతూ ఉండగా నరేష్ కు ఒక గుడిసె కనిపించింది. ఆ గుడిసెలో ఒక ఆవిడ కనిపించింది. ఆవిడకు కొద్దిగా మంచినీళ్లు ఉంటే ఇవ్వమని అడిగాడు నరేష్. దానితో ఆవిడా గ్లాసుతో మంచి నీళ్ళు తెచ్చి నరేష్ చేతికి ఇస్తుండగా, ఆమె చేతి వేళ్లను చూసి నరేష్ కు భయం వేసి, అమ్మ మీ ఉంగరం వేణి ఏమయ్యింది అని అడిగాడు నరేష్. ఆవిడ ఒక్కసారిగా ‘నువ్వేగా…నువ్వేగా…’ అని భయంకరంగా అరుస్తూ నరేష్ గొంతు కొరికి చంపేసింది…
ఇంతకూ “ఆమె” ఎవరు….? నరేష్ ను, అరుణను, రవి ని ఎందుకు చంపింది….?ఇది అంతా తెలుసుకోవాలంటే మనం ఒక సంవత్సరం వెనక్కి వెళ్లాలి……..
వీరభద్రపురం లో నరేష్ కి ఒక భార్య వాళ్లకు ఒక ఐదేళ్ళ పాప కూడా ఉండేది. వాళ్లు సంతోషంగా ఉండేవారు. ఒకరోజు నరేష్ పట్టణం మొత్తం తిరిగి వద్దాం అని చెప్పి భార్యా పిల్లలతో వీరభద్రపురం అడవుల మధ్యనుండి వెళ్తుండగా, వాళ్లకు ఒక ఇల్లు కనిపించింది. ఆ ఇల్లు నరేష్ కి తెలిసిన ఆవిడదే అని సునీత తో చెప్పాడు. వాళ్లందరూ ఆ ఇంటికి వెళ్లి ఆవిడ ను కలిశారు. ఆవిడ పేరు అరుణ. ఆవిడ వీళ్ళను భోజనం చేసి వెళ్ళండి అని బాగా ప్రాధేయపడ్డారు. నరేష్ తన కుటుంబం భోజనం అయ్యాక కాసేపు ఆవిడతో మాట్లాడి బయటకు వస్తుండగా, నరేష్ వాళ్ళ పాప కడుపు నొప్పి అంటూ కళ్ళు మూసుకొని కిందపడిపోయింది. అది చూసిన నరేష్, సునీత చాలా కంగారు అయ్యారు. ఇదంతా చూసిన అరుణ నవ్వుతూ ఉంది. మీరు మా బిడ్డను చూసి ఎందుకు నవ్వుతున్నారు అని అంది సునీత. అంతలో సునీత కూడా కడుపు నొప్పి మొదలయ్యింది. సునీత ని చూసిన నరేష్ నవ్వ సాగాడు. సునీత కి ఏమీ అర్థం కాలేదు. కొద్ది సమయం తర్వాత నరేష్ వాళ్ళ పాప రక్తం కక్కుకుని చనిపోయింది. ఏమండీ ఏం జరుగుతోంది నాకు చెప్పండి అని అడిగింది సునీత. నీ ఆస్తి కోసం నిన్ను నీ కూతురు ని విషమిచ్చి చంపేయడానికి ఇదంతా చేయాల్సి వచ్చింది అని నరేష్ చెప్తుండగానే సునీత రక్తం కక్కుకుని చనిపోయింది. కొద్దిసేపటి తర్వాత అదే అడవిలో వాళ్ళిద్దరి శవాలను పూడ్చి పెట్టేసాడు. అలా పూడ్చి పెడుతున్న సమయంలో నరేష్ తవ్వుతుండగా గుణపాము తగిలి సునీత ఉంగరం వేణి తెగిపోయింది. ఆ వేణిని కూడా తను తీసిన గొయ్య లోనే పాతి పెట్టేసాడు. ఆ రెండు శవాలను పాతిపెట్టిన తరువాత నరేష్ అరుణ ఇద్దరు కలిసి అరుణ వాళ్ళ ఇంటికి వెళ్లారు. అరుణ నరేష్ వాళ్ళ భార్య నుంచి వస్తున్న ఆస్తిలో 25% అడగగా దానికి నరేష్ సరే అన్నాడు. నరేష్ పట్టణం కు వెళ్లి తమ్ముడు కానిస్టేబుల్ అయిన రవి కి పిలిచి జరిగిందంతా చెప్పాడు. దానికి రవి నువ్వేం కంగారు పడకు అన్నయ్య నేను పోలీస్ స్టేషన్ లో ఎటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవకుండా చూసుకొని, నీ మీద ఎటువంటి కేసు పడకుండా చూసుకుంటాను. నరేష్ వాళ్ళ భార్య సునీత ఆస్తి మొత్తం వాళ్ళిద్దరు పేరుమీద రాయించుకుని అందులో 25 శాతం అరుణకి ఇచ్చేశారు. ఇదంతా చూస్తున్న సునీత ఆత్మ, ప్రేతాత్మ గా మారి వీళ్ల ముగ్గురిని చంపేయాలని అనుకుంది. దానితో అరుణ ని వాళ్ళ ఇంట్లోనే అతి భయంకరంగా చంపేసి, రవి నీ లారీ తో యాక్సిడెంట్ చేసి చంపేసి, నరేష్ ని అతి దారుణంగా గొంతు కొరికి చంపేసింది. నరేష్ కారులో ఉన్నప్పుడు “ఆమె నాకు కనిపించింది” అని అంటాడు రవి తో. అక్కడ “ఆమె” ఎవరో కాదు అది సునీత ఆత్మే. ఆ ఇంట్లో అరుణను చంపింది నరేష్ వాళ్ళ కూతురే. రవి ని, నరేష్ ని చంపింది సునీత ఏ, సునీత ఆత్మశాంతి చి, ఆ అడవి నుంచి సునీత, సునీత వాళ్ళ పాప ఇద్దరూ వెళ్లిపోయారు.
—*కథ సుఖాంతం*—
Highlight undhi story 👌👌👌👌👌👌👌
Superb ending
Wonderful
Katthiiii inko story eppudu start chestav annayaaaa
Superb annayya
Full Story Superbb Shivam I really like it
Story Madhyalo Andhuku champuthundhi valani anipinchindhi but ending lo Clear ga mention Cheydam Chala bagundhi Super Asalu
Keep it up 😉🙂 Have a Bright Future ☺️
Wow super 👌 nice story 👏
I really really love this story ❤❤very excited…. Thanks for the story…. I hope you will write more n more……
Bongula undi
Amazing Shivam really
Superb
Chaalaaa baaagaa raaasaavu shivam story asalaa…grt job 👍👍
Really amazing Shivam.It was such a thrilling story. Definite ga
doctor plus pedha story writer ayipothav nvu💯.Hope u will write more n more…
Amazing story and what a twist in story.
It is thrilling horror story.
Asalu chaduvutunna time Edo Oka movie chustunna feel vachindi.
Ending Chala clarity ga vundi with out any bugs
You have a good writing skill keep it up🙂
Thank you bro❤️💝…