209
0

పెళ్ళిచూపులు

209
గత రెండు రోజుల నుండి ఒకే ఆలోచన మనసంతా తొలిచేస్తోంది హేమని… అదేనండీ మన జీవితాన్ని మార్చే ఘట్టం ” పెళ్ళి”… అనడానికి రెండు అక్షరాలే అయినా రెండు జీవితాలను మార్చగల , రెండు కుటుంబాలను కలపగల శక్తి ఉంది పెళ్ళికి. ఇక అమ్మాయి విషయంలో అయితే చెప్పక్కర్లేదు. రేపు హేమకి పెళ్ళి చూపులు. ” నీ పిచ్చికి హద్దులు లేకుండా పోతుంది..” ఇంట్లోకి వస్తూ అంది గాయత్రి.

“ఇప్పుడు ఏమైంది అని అమ్మ అలా అంటున్నావు.” అని చిరు కోపంతో అంది హేమ

“ఇంకా ఏం కాలేదు. ఏం అవుతుందో అనే మా భయం అంతా “
“అమ్మ ఇపుడు నేను ఎం చేశానని నీకు అంత భయం”
“రేపు ఉదయం అబ్బాయ్ వాళ్లు వస్తారు. నీ ప్రశ్నలతో, సందేహాలతో వారిని విసిగిస్తే, ముందులా వాళ్ళు వెళ్ళిపోవటమే కాక అందరికీ ఏం చెప్తారో అనే నా భయం.” అంది గాయత్రి.

“అమ్మా పెళ్లి అమ్మాయి జీవితాన్ని ఎంతగా మారుస్తుందో నీకు తెలుసుగా మరి అలాంటప్పుడు మనం సరైన వ్యక్తిని ఎంచుకోవాలి అంటే మన సందేహాలను తీర్చు కోవటం తప్పంటారా” “నువ్వు చెప్పేది నిజమే తల్లి కానీ అమ్మాయి మాట్లాడితే నోరు ఎక్కువ అంటారు ఈ పిల్లతో వేగడం కష్టం అనుకుంటారు అమ్మా”

“అమ్మా అలా అనుకునే వాళ్లైతే నన్ను వాళ్లు వద్ద నడం కాదు నాకే వాళ్లు వద్దు ఎవరో చెప్పిన మాటలు వినో లేక చిన్న సందర్భం చూసో గుడ్డిగా నమ్మే వాళ్ళు నాకొద్దు అమ్మ”

“మరైతే నువ్వు చేసేదేంటి..కొన్ని ప్రశ్నలతో మనిషి గురించి తేల్చటం కరెక్టా..” అడిగింది కొంచం వెటకారంగా. “నేనడిగే ప్రశ్నలే నా భాగస్వామిని నిర్ణయిస్తాయని చెప్పను, కానీ నా సందేహ నివృత్తిలో అలాగే ఎంపికలో సహకరిస్తాయని చెప్పగలను” అంది హేమ తన ఆలోచన వ్యక్తం చేస్తూ..

“ఇక మీ మాటలు ఐపోతే వెళ్ళి నిద్రపోదాం” అంటూ లోపలికి వచ్చారు శ్రీనుగారు తల్లీకూతుళ్ళ మాటలకు అడ్డుకట్ట వేస్తూ.

“రేపు ఉదయాన్నే అబ్బాయ్ వాళ్ళు చూసుకోవటానికి వస్తారు. దీని పిచ్చి చూసికూడా మీరిలా కూల్గా ఎలా ఉంటున్నారండి.” “ఇంకెలా ఉండమంటావ్..అది ఏం చిన్నపిల్ల కాదు, దానికి అన్నీ తెలుసు నువ్వు ఎక్కువ ఆలోచించకు.” “నాన్నా నా ఆలోచన సబభే అంటారా..??” అని అడిగింది తండ్రి ఒడిలో ఒదిగిపోతూ. ” నువ్వు ఏం చేసినా కరెక్టేరా చిట్టితల్లి, నీ నిర్ణయంపై నాకు పూర్తి నమ్మకం వుంది.” అన్నారు హేమ తల నిమురుతూ..

“మీరే దీన్నిలా తయారుచేశారండి” అంది తండ్రీకూతుళ్ళ అనుబందం చూసి.

“సరే సరే ఇక నిద్రపోండి ఉదయాన్నే చాలా పనులున్నాయ్.”

★★★★★

“ఏంట్రా వరుణ్ ఏదో లోకంలో వున్నావు అంతగా ఏం ఆలోచిస్తున్నావు.”

“రేయ్ మామా రేపు మనోడికి పెళ్ళి చూపులు కదా.. దాని గురించే అనుకుంటా అయ్యగారి ఆలోచనలు..”
“రేయ్ మీరింక ఆపుతారా అసలే నాకు ఏంచేయాలో అర్థం కాకుంటే పక్కన మీ సెటైర్లు ఏంటి రా..”
“ఇందులో అర్థం అయ్యేది ఏముందిరా, రేపు ఉదయం వాల్ల ఇంటికి వెళ్తావు, వాళ్ళు పెట్టినవి తిని అమ్మాయిని చూసి నచ్చితే నచ్చిందనో లేకుంటే లేదనో చెప్పు ఏం అర్థం కాలేదనుకో ఇంటికి వెళ్ళి కబురంపుతాం అని చెప్పిరా..”

“రేయ్ అమ్మాయిని చూసిన వెంటనే నచ్చిందా లేదా అని చెప్పటానికి అది టైంపాస్ కోసం కాదురా జీవితాంతం ఒకరికి ఒకరై జంటగా జీవించాల్సిన బంధం.”

“అది తెలుసుకోవటం కోసం ఇంట్లోవాళ్ళు ఉన్నారుగా..” “అవును కదరా మనం ఎన్ని సినిమాలలో చూడలేదూ… అమ్మాయి నీకు వంట వచ్చా, ఏంఏం పనులు చేస్తావు, ఒక పాట పాడు, ఒకసారి నడిచి చూపీ అని ఎన్ని ప్రశ్నలు వేస్తారూ.. అన్నీ అమ్మాయి ఎలాంటిదో తెలుసుకోవటం కోసమే కదా.”

“నువ్వు చెప్పింది నిజమేరా కానీ వాళ్ళు అదిగేవన్నీ తమకు కోడలిగా రాబోతున్న అమ్మాయి ఎలా ఉండాలి అని చెప్తాయి
కానీ నాకు తగిన అమ్మాయిని సూచించలేవు కదా..”

“మరి ఎలా తెలుసుకోవాలి అంటావు..?”

“అదే కదా నేను కూడా ఆలోచించేది.”

“ఇదే మొదటిసారి కాబట్టి అంత ఆలోచిస్తున్నావ్, అదే రేపు వచ్చి నీ థాట్స్ ఎలా వున్నాయో చెప్పు,

ఇక పోయి పాలుతాగి పడుకోమ్మ” అన్నాడు వేణు వ్యంగంగా..

★★★★★ అబ్బాయ్ వాళ్ళు వచ్చే టైం అవుతోంది, ఇంట్లో హడావిడి మొదలైంది.

“ఏమే గాయత్రి హేమ ఏదే కనిపించట్లేదు..?”

“రూంలో ఉంటుంది చూడండి అక్క..”

“హ సరేలే నువ్వేదో పనిలో వున్నట్లున్నావు, నేను వెళ్తాను. నువ్వు వెళ్ళి పని చూసుకో..”

“సరే అక్క మీరు దాన్ని కొంచం రెడీ చేయండి.”

విజయ గారు కూతుర్ని వెతుక్కుంటూ రూంలోకి వెళ్ళారు.

“ఏంటే హేమ ఇంకా ఇలానే వున్నావు. వెళ్ళి రడీ అవ్వు.”

” హాయ్ 👋 పెద్దమ్మ ఎలా ఉన్నారు. ఇప్పుడేనా రావటం.” అంటూ దగ్గరకు వచ్చింది విజయను చూసిన ఆనందంలో..

“హ అవును, అది సరే కానీ నువ్వు ఏంటీ ఇంకా ఇలానే వున్నావు. ఈ సంబంధం ఇష్టం లేదా ఏంటి. ” అంటూ ఆరాతీసింది విషయం ఏంటా అని..

“అలాంటిది ఏం లేదు పెద్దమ్మ. అంతగా రెడీ అవ్వాల్సిన అవసరం ఏం ఉంది.
రేపు పెళ్ళయ్యాక నేను రోజు ఇలానే వుంటాను. రోజూ అల తయారై కూర్చోను కదా. రోజూ నన్ను ఇలానే చూడాల్సి ఉంటుంది.
మరి ఇప్పుడు ఎందుకు ఈ పై పై మెరుగులు. నేను ఇలానే కనిపిస్తా. నన్ను నన్నుగా పరిచయం చేసుకుంటా.”

“అలాగే మరి నీ ఇష్టం.” “గాయత్రి వాసు గారు వాళ్ళు వచ్చేసారు అంతా సిద్ధమే కదా. అమ్మాయెక్కడ ” అంటూ లోనికి వచ్చారు శ్రీను గారు హడావిడిగా.

“హా అంతా సిద్ధమే అండి అమ్మాయి లోపల ఉంది అక్క కూడా అక్కడే ఉంది.”

“హేమ అబ్బాయి వాళ్ళు వచ్చారు. అబ్బాయి చూడచక్కగా వున్నాడే..”అంది విజయ అబ్బాయి వైపు తొంగి చూస్తూ..

“పెద్దమ్మ ఎలాగో వెళ్లి చూస్తాం కదా నాకు లేని తొందర మీకు ఎందుకు.” అంది హేమ విజయని వెనక్కి లాగుతూ..

“నువ్వు ఎలాగో చూడట్లేదు కదా నేనైనా చూద్దాం అని..”అంది వ్యంగాయంగా.

” 🙏 నమస్తే వాసు గారూ. మా ఇంటితో మీరు సంబంధం కలుపుకోవాలి అనుకోవడం మా అదృష్టం.”

“అలా అయితే మేమే మీ కంటే ఎక్కువ అదృష్టవంతులం, లక్ష్మీదేవీ లాంటి కుందనపు బొమ్మ, తెలివి, ఓర్పు అన్నిటికీ చిహ్నం లాంటి మీ ఇంటి వెలుగు మా ఇంట్లో దీపం పెడుతుంది అంటే ఇంకేం కావాలి మాకు.”
వాళ్ళ నాన్న మాటలు విని వరుణ్ షాక్ 😳 అయ్యా డు ఎన్టీ ఈయన ఆ అమ్మాయిని చిన్నప్పటి నుండి చూస్తున్నట్లు చెప్తున్నారు, అని తనలో తానే అనుకున్నాడు 🙄 .

“మా ప్రథమ పుత్రుడు 🧑 వరుణ్, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి, పెద్ద IT కంపెనీలో జాబ్ చేసాడు. ఇల్లు వదిలి ఎక్కడో ఉండి సంపాదించేది ఇష్టం లేక ఇక్కడే ఓ చిన్న కంపెనీ పెట్టుకోవాలి అని చూస్తున్నాడు.

మా అమ్మాయికి పెళ్లై ఒక పాప ఉంది.”

“నమస్తే 🙏 అండి అని గౌరవంగా” పలకరించాడు కాబోయే మామగారిని.

“వరుణ్ గురించి నేను విన్నానండి. అందుకే కోరి మరీ మీ సంబంధాన్ని ఎంచుకున్నాం.
సరే మరి మా అమ్మాయిని చూసి మీ అభిప్రాయం ఎంటో చెప్తే.” . అంటున్న శ్రీను గారూ మాటల మధ్యలోనే వాసు వరు అందుకుని..

“మనం ఇరు కుటుంబాల పెద్దలం కావాలి అనుకుంటున్నాం, మనదేం ఉంది జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళు, వాల్లేమంటారో మరి..”

“అవునండీ మా అమ్మాయిని కూడా మేం ఏం ఇబ్బంది పెట్టం తన అభిప్రాయాన్ని మేము ఎప్పుడు కాదనలేదు, ఇప్పుడు కూడా అంతే.
హేమా మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఏ విషయంలోనైనా ఆచి తూచి నిర్ణయం తీసుకుంటుంది.”

“ఇంకెందుకు ఆలస్యం అమ్మాయి కూడా చూసి తన ఒపీనియన్ ఎంటో చెప్తే మిగిలిన కార్యక్రమాలు చూసుకోవచ్చు కదా. మా అబ్బాయ్ మీద కూడా మాకు అంతే నమ్మకం ఉంది అన్నారు మాధవి గారు వరుణ్ వైపు చూస్తూ..” అమ్మాయి వచ్చి కూర్చుంది. పైకి కామ్ గా వున్నా, గాయత్రి లోలోపల భయపడుతుంది. ఇప్పటి వరకూ బానే ఉంది. ఇప్పుడు ఈ పిల్ల ఏం చేస్తుందో, వాళ్ళు ఏం అనుకుంటారో అని. ఈ సంబంధం కాయం కావాలని దేవుళ్ళు అందరినీ మొక్కుతుంది.

. అటు వైపు మాధవి గారిది కూడా అదే తంట.

” వరుణ్ హేమని చూసిన వెంటనే ఏదో ఒక రాగం వినిపిస్తుంది చెవిలో. నా తొలి చూపులోనే…అంటూ.🎶🎶 ( ఇంకేముంది మన హీరో గారికి హీరోయిన్ బాగా నచ్చింది అన్నమాట..) అంతవరకు ఉన్న సైలెన్స్ ని తొలగించాలి అన్నట్లుగా “మా అమ్మాయి ఎలా ఉంది “అంటూ శ్రీను గారు వరుణ్ వైపు చూసారు. ఆ మాటలు 🗣️ విని వేరే ఎదో లోకంలో ఉన్న వరుణ్ ఈ లోకంలో లోకి వచ్చాడు. ఒకసారి హేమ వైపు చూసి, తనేదో సంగ్ధిగ్ధతలో ఉన్నట్లు అర్థమై ” నేను అమ్మాయితో కొంచెం మాట్లాడాలి అన్నాడు.” “అలాగే బాబు మరి మీరు మాట్లాడండి మేము బయట ఉంటాం ” అన్నారు శ్రీను గారు. వరుణ్ ఇలా అడుగుతాడు అని ఊహించని తన పరెంట్స్ ఆశ్చర్యంగా వరుణ్నే చూస్తున్నారు. “అయ్యో అంత పెర్సొనల్ ఏం కాదు అంకుల్. మీరు కూడా ఇక్కడే ఉండొచ్చు.”

“సరే బాబు” అని, ఏం మాట్లాడతాడా అని అందరూ ఆలకిస్తున్నారు.

“హేమగారు మన జీవితంలో హాస్యం అనేది మన ఆరోగ్యానికి, సంతోషానికి చాలా ముఖ్యం” అని నేను అంటాను మరి మీరేం అంటారు అన్నాడు. అవును అన్నట్లుగా హేమ తలూపింది. మరోవైపు ఆ మాట విన్న వెంటనే, చీ ఇదా వీడు రాత్రంతా ఆలోచించింది. వీడికి అస్సలు సందర్భానుసారం మాట్లాడటం రాదు అనుకున్నాడు వేణు. ” సరే నేనొక ప్రశ్న అడుగుతాను దానికి సరైన సమాధానం చెప్పాలి మీరు. ‌

“”మీ ఊరిలో మొత్తం ఎన్ని చీమలు ఉంటాయి.””

ఏంటి ఇది కూడా ప్రశ్నేనా 😳..వీడు మారడు ఇంక అనుకున్నాడు వేణు.

అందరూ అది విని విస్తుపోయినా..హేమ సమాధానం కోసం ఆసక్తిగా చూస్తున్నారు 👀

హేమ బాగా ఆలోచించి ,ఇలా చెప్పింది సమాధానం
“మీ తలలో మొత్తం ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మా ఊరిలో అన్ని చీమలు ఉంటాయి.”

అది చూసిన అందరూ అమ్మాయి కూడా మంచి గడుసుదే అనుకున్నారు. వేణు మాత్రం “సరిపోయింది గంతకు తగ్గ బొంత.” అన్నాడు.

అందరూ నవ్వుకున్నారు.

“”సరే ఇది చెప్పండి, మనకి పెళ్లయ్యాక, ఇద్దరం ఎవరి పనుల్లో వాళ్ళం బిజీగా ఉంటాం కాబట్టి మా పేరెంట్స్ని వృద్ధాశ్రమంలో ఉంచుదాం అనుకుంటున్న మీరు ఏం అంటారు..??””

ఇది విన్న వాసూ గారికి వరుణ్ని కొట్టాలి అన్నంత కోపం 😠 వచ్చినా, అక్కడ బాగోదని సైలెంట్ గా హేమ సమాధానం కోసం ఆగారు. “”లేదండీ నాకు అలా చేయటం ఇష్టం లేదు. నాకు మంచి చెప్పటానికి, సలహాలు, సూచనలు అన్నిట్లోనూ వాళ్ళ తోడు కావాలి నాకు. మనకు ఓ అండ అనే ధైర్యం కావాలి. నేను పుట్టినింటికి కోడలిగాను, మెట్టినింటికి కుతురుగాను ఉండాలి అనుకుంటున్నాను.”” అంది హేమ. హేమ ఏం చెప్పిందో అర్థం కాక అందరూ హేమనే ఆలకించసాగారు. “” ఇక్కడే పుట్టి, పెరిగి వేరే ఇంట్లో అడుగిడుతాం, ఇక ఇక్కడ వాళ్ళతో ఉండే బంధం, ఎప్పుడో పండగలకి పబ్బాలకి తప్ప ఏం ఉండదు. కోడలిగా మెట్టింటికి వెళ్లి కొత్త బంధాలు, బంధుత్వాలు చిగురిస్తాయి. నా ప్రవర్తన మెట్టినింటికి ఎటువంటి పేరైనా (మంచిగా కానీ చెడుగా కానీ ) తేవొచ్చు. జీవితాంతం అదే నా లోకంగా మారుతుంది. మెట్టింటి వాళ్ళు కూడా తమ బిడ్డను వేరే ఇంటికి పంపి కూతురు లేని లోటుతో ఉంటారు అందుకే మెట్టింట అత్తమామలకు కూతురిగా ఉంటాను. తమ కూతురిని వెరేయింటికి పంపి బాధలో ఉండే మా తల్లితండ్రులను ఒక కొడలిలా జీవితాంతం బాధ్యతలు తీసుకుంటాను. నాకు ఇరువురు ముఖ్యమే. నా వలన అటు పుట్టింటికి కానీ, ఇటు మెట్టినింటికి కానీ ఎటువంటి మచ్చ రాకుండ చూసుకుంటూ, ఒక మంచి ఇల్లాలిగా ఉండాలి అనుకుంటున్నాను”” అంది హేమ. హేమ మాటలు విన్న అందరూ ఒక్కసారిగా చప్పట్లు 👏👏 కొట్టసాగారు. వరుణ్ మీద కోపంతో ఊగుతున్న వాసు గారు ఇంత మంచి అమ్మాయి కోడలిగా వస్తున్నందుకు సంతోషించారు. గాయత్రి గారు ఎప్పుడూ అల్లరి చేస్తూ ఉండే నా చిట్టి తల్లేనా ఇలా మాట్లాడింది. అని తనలో తానే ఆనందపడింది. వరుణ్ శ్రీను గారిని పిలిచి “”అంకుల్ హేమని నాకిస్తారా “” అని అడిగాడు హేమ వైపు చూస్తూ.

హేమ ముఖంలోని సిగ్గుని చూస్తూ “”అంతకన్నాన అల్లుడు గారు”” అని కౌగిలించుకున్నారు 🤗 వరుణ్ ని.
“అన్నట్లు మీ అమ్మాయి నా మొదటి ప్రశ్నకి సమాధానం ఇవ్వనే లేదు”😇 అన్నాడు నవ్వుతూ.

“నీకు కరెక్ట్ కౌంట్ కావాలి అంటే నీ తల హేమకి అప్పగించరా తమ్ముడు ” అంది వరం జోక్ చేస్తూ. “ఇంకేంటి బావగారు మా కోడలిని మా ఇంటికి ఎప్పుడు పంపిస్తారు.” అన్నారు వాసు గారు. _రేపే ముహూర్తాలు పెట్టిద్దాం బావగారు.”

సరే అయితే ఇక మేం వెళ్ళొస్తాం.
సంతోషంతో వరుణ్ వాళ్ళు అందరు సెలవు తీసుకున్నారు.

◆◆◆◆◆ ” అవును హేమా నువ్వు ఏమేమో చేయాలి అనుకున్నావు కదా, మరి అస్సలు ఏం మాట్లాడలేదు ఏమైంది.??” అడిగింది గాయత్రి. “నువ్వు ఒకలా ఆలోచిస్తుంటే, అబ్బాయి ఆలోచనలు మరోలా ఉన్నాయి అయినా ఈ పెళ్లికి ఎలా ఒప్పుకున్నావు.??”

“అమ్మా వరుణ్ ఇంట్లోకి వచ్చినప్పటి నుండీ గమనించాను, నా ఊహలకు తగ్గట్లుగానే వున్నాడు అనిపించింది.
నేను టెన్షన్తో ఉన్నానని నన్ను నవ్వించటానికే ముందు ఆ ప్రశ్న అడిగాడు.”

“అది సరే మరి మళ్లీ అడిగింది ఏంటి వాళ్ళ పేరెంట్స్ని బయట వుంచాలి అన్నాడు, అలాంటిది మమ్మల్ని చూస్తాడు అని నీకు ఎందుకు అనిపించింది.??”

“నేను వాళ్ళ పేరెంట్స్ని ఎలా చూసుకుంటాను అని తెలుసుకోవాలనే అలా అడిగాడు అమ్మా. తను మీ అమ్మాయిని నాకు ఇచ్చేయండి మామగారు అని అడిగిన తర్వాత, తను తొందర పడి, పేరెంట్స్ అభిప్రాయం తెలుసుకోకుండా నిర్ణయం తీసుకున్నాడేమో అని వాళ్ళ నాన్న గారి వైపు చూసాడు. మామయ్య గారు ఒకే అని సైగ చేశాకే నాన్నని హత్తుకున్నాడు అమ్మా..
అప్పుడే అర్థం అయింది వరుణ్ బంధానికి ఎంత విలువ ఇస్తాడో అని.
ఇంటికి దూరంగా వుడటం కంటే దగ్గరగా వుంటూ చిన్నపనైనా చేసుకుందాం అనుకున్నాడు అని తెలిసినప్పుడు, మనీకి కాకుండా మనుషులకి విలువ ఇస్తాడు అని అర్థమైంది. అందుకే వరుణ్ నాకు తగిన వాడే అనిపించింది.

★★★★★

” అవును రా మామ, అమ్మయ్ చెప్పిన ఒక్క సమాధానానికి వెంటనే ఎస్ చెప్పావు.. అందరూ ముందు అలా చెప్పే వాళ్ళే ఆఫ్టర్ మ్యారేజ్ మారిపోతారు అది తెలియదా,?” అడిగాడు వేణు.

“”నేను ఒప్పుకుంది తను చెప్పిన జవాబు విని కాదు రా, నేనూ తనని బాగా గమనించాను.
బయటికి వెళ్లాలంటేనే మేకప్ వేసుకి వెళ్లే ఈ రోజుల్లో, పెళ్లి చూపుల్లో కూడా ఎటువంటి మేకప్ లేకుండా వచ్చింది. తనని తానుగా పరిచయం చేసుకోవాలి అనుకుంటుంది అనిపించింది.
అంతే కాదు తనకి ఎదో మాట్లాడాలి అనిపించినా వాళ్ళ అమ్మ పడుతున్న కంగారు చూసి సైలెంట్గా ఉండిపోయింది.
నేను ముందు అంతగా నవ్వించి, కంగారు పెట్టినా, నేనడిగిన రెండో ప్రశ్నకి తడబడకుండా సమాధానం చెప్పింది.
మనమిద్దరం మనకిద్దరు అనుకునే జనరేషన్ లో నాకు అందరూ కావాలి అని అంది.
వరం కూతురు అత్తమ్మా అంటూ దగ్గరకు వెళ్ళినప్పుడు, హేమ చూపించిన ఆప్యాయతా ఇవన్నీ చూసే నేనీ నిర్ణయం తీసుకున్నాను. “”అని చెప్పాడు వరుణ్ తన నిర్ణయం తప్పు కాదని సమర్థిస్తూ..

“అరె మామ నువ్వు ఎదిగి పోయావురా..
నిజంగానే మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ రా..””

Leave a Reply

Your email address will not be published.