249
0

చీకటి సూర్యులు

249

ఐదు సెంటిమీటర్లకు పైగా వర్షం మా పాలెం ప్రాంతం కొండకి పల్లం వైపు ఉండటంతో మా ఇల్లు అన్ని  మెల్లగా నీళ్లలో ములుగుతున్నాయి. అప్పటికే దాదాపు ఆరు,ఏడూ గంటల వాన.చల్లగాలికి నోరు లాగేస్తుందిరా పద పోయి ఒక సుట్టా కాల్చొద్దాం అంటే రంగ మామ తో కలిసి అలా ఆ ఇంటి వెనక మర్రి చెట్టు చాటుకి వెళ్లి అమ్మకు కనపడకుండా ఒక రెండు పీకాలు లాగుతుండగా.పక్కన పెద్ద పల్లెలో దొరగారి రబ్బరు ఫేక్టరీలో పనికి వెళ్లిన మా నాన్న ఇంకా ఇంటికి తిరిగిరాలేదు అని మా అమ్మ కంగారుపడుతూ ‘ఒరే రాఘవా నాన్న ఇంకా ఇంటికి రాలేదు అలా దీపం తీసుకొని ఆ మట్టి రోడ్డు దాకా వేళ్ళు’ అని కేక పెట్టింది. వాన కాస్త తగ్గుముఖం పట్టింది, నేను మా ఇంటి తడక తెరిచి  ఒక కిరసనూనె దీపం పట్టుకొని బయలుదేరాను. అలా ఆ చీకటిలో దీపం పట్టుకొని మట్టి రోడ్డు దాకా వెళ్లి అక్కడ కూర్చొని నాన్న కోసం వేచిచూస్తూ ఉన్నాను, చాలా సేపటి తరువాత మా నాన్న వర్షంలో తడుచుకుంటూ నెత్తిమీద  ఒక సైకిల్ తో ఆ నీళ్లలో నడుచుకుంటూ రావడం చూసాను,వెంటనే వెళ్లి ఆ సైకిల్ని నా భుజాన ఎత్తుకొని నాన్నతో పాటు ఇంటికి వచ్చాను.ఇంటికి రాగానే మా నాన్న ‘ఒరే రాఘవా ఆ సైకిల్ ని ఎండు గుడ్డతో తుడిచి తడవకుండా ఇంట్లో పెట్టు, కొత్త సైకిల్ అసలే తడిచి తుప్పు పడితే పాడు అవుద్ది’ అన్నాడు. నేను ఆ సైకిల్ని తుడుస్తూ ‘ఈ జీవితానికి  తుడుచుకోవడం తప్ప సైకిల్ ఎక్కి తొక్కే అదృష్టం లేదు ఏమో’ అని నాలో నేను గోనుక్గ్కుంటుండగా మా నాన్న విని. అది నీకోసమే,జాగ్రత్తగా వాడుకో అని అన్నాడు. ఒక రెండు మూడు నిమిషాలు నేను నమ్మకపోయిన తరువాత అర్ధమయ్యింది నిజంగానే మా నాన్న అ సైకిల్ నాకోసమే కొన్నాడు అని. సంవత్సరం పైగానే అడుగుతున్న మా నాన్నని నాకు సైకిల్ కోసమని,స్నేహితులతో జల్సా చెయ్యడానికి కాదు పక్క పట్టణంలో చిన్న పిల్లలకి పాఠాలు చెప్తే నెలకు 30 రూపాయిలు సంపాదించొచ్చు. ఈ చుట్టూపక్కల ఊర్లలో డిగ్రీ దాకా చదివిన వాళ్ళు ఎవ్వరు లేరు మరి నేను తప్ప. చెప్తే నేనె చెప్పాలి పాఠాలు, పట్టణానికి వెళ్లి వచ్చే సౌకర్యం లేక ఇన్ని రోజులు ఎంత జీతం పోగొట్టుకున్నానో ఇన్నేళ్లు.రెపటినుంచి పట్నంపోయి పాఠాలు మొదలుపెడతా.

మరుసటిరోజు పొద్దునే లేచి నేను నా కొత్త సైకిల్ మీద పట్టణానికి బయలుదేరా.ఊరిలో అప్పటిదాకా ఎవరి దగ్గరా సైకిల్ లేదు, ఎలా కొన్నాడో మా నాన్న కానీ అంత సులువెంకాదు ఈరోజుల్లో సైకిల్ కొనడం అంటే. అలా మెల్లగా ఊర్లో అందరి కళ్ళు నా సైకిల్ మీద పడేలా ఒక చిన్న గర్వంతో తొక్కుకెళ్లాను. అలా ఆ మట్టి రోడ్డు దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ ఎందుకో మా పాలెం జనం కొంతమంది గుంపుగా చేరి ఎదో మాట్లాడుకుంటున్నారు, నేను ఒకవైపు అలని చూస్తూ అనుకోకుండా రోడ్డుకి అద్దంగా ఉన్న దొరగారి పెద్ద మనవరాళ్ళని గుద్దేసాను. నిద్రలేచి ఎవరి మొఖం చూసానోగాని ఈరోజు న ఘడియలు అస్సలు బాలేవు అని అర్థం అయ్యింది లేకపోతే పోయి పోయి దొరగారి మనవరాళ్ళని గుద్దడం ఏమిటి, ఇక ఈరోజు నాకు మూడిందే.పేరుకే ఆమె అడపిల్లగాని కరుడుగట్టిన రక్షతత్వానికి నిలువెత్తు రూపం ఆవిడ. ఒంటి మీద వయసు పద్దెనిమిదే అయిన ఒంట్లో డబ్బు గర్వం, బలగం మదం మాత్రం తలపండిన ఆవిడ తాత దొరగారి కన్నా ఎక్కువే. ఈవిడితో మనకి గోడవెందుకు అసలే పాఠాలు చెప్పడానికి టైం అవుతుంది అని వేంటంటే కిందకి దిగి అమ్మగారు క్షమించండి అనుకోకుండా జరిగింది అని చెప్పాను. అంత సులువుగా క్షమించేస్తే ఆవిడ అభలారాణి ఎందుకు అవుద్ది. ఇక అందుకుంది తిట్ల దండకం,ఐనా చేసేది ఏముంది ప్రతి కూలోడి బ్రతుకులాగే నాది కూడా పెద్ద దొరలు తిడితే మాత్రం ఏం చేయ్యగలం.

ఈ మగ రాయుడు చాలా సేపు శాంతించలేదు,నేను బ్రతిమాలక తప్పలేదు,ఒక వైపు నాకేమో సమయం గడిచిపోతుంది ఇంక వేరే త్రోవ లేక అమ్మగారు మీరు ఎం చేయమంటే అది చేస్తా నన్ను క్షమించండి అని విన్నపించుకున్నాను.పండగ రోజు ఈమెని మించిన కొత్త ఎర్ర జబ్బా వేసాడని పాలెం జనం అందరి మధ్యలో  కేశవుడి ఒళ్ళంతా ఎరుపెక్కేలా కొరడాలతో కొట్టింది ఈ మహా తల్లి, అలాంటిది నేను ఎం కావాలన్న చేస్తా నన్ను వదిలేయండి అంటే ఇంకేం చేస్తాదో అని గుండెలోపల రైళ్లు పరిగెట్టాయి. ‘ఈ సైకిల్ ఎవరిది ?’ అని ఆమె కోపంగా అడగగా నేను కాస్త జంకుతూ ‘నాదే అమ్మ,కొత్తది నిన్ననే మా నాన్న కొనిచ్చాడు’ అని సమాధానం ఇచ్చాను. పాలెంలొనే కాదు మా దొరగారి మనవరాళ్ళకి కూడా ఇలాంటి సైకిల్ లేదు అందుకే ఆమె నా సైకిల్ ని చూస్తూ ‘సరే గాని ఆ సైకిల్ అక్కడ పెట్టి వేళ్ళు’ అని ఒకరకంగా చెప్పింది. నేను వెంటనే అమ్మా అమ్మా ఇప్పటికే చాలా ఆలస్యం అయింది అమ్మా,పైగా ఈ సమయంలో పట్టణంవైపు పోయే జట్కాలు కూడా ఏమి ఉండవు అని బ్రతిమాలగా ఆమె ‘కాళ్ళకి ఎంటవి,మీ నాన్న మా ఫేక్టరీలో దొంగిలించుకోచ్చిన రబ్బరు ముక్కలేనా? మీ దొంగ బ్రతుకులకి సైకిల్ కావాల్సొచ్చిందా’ అని నా కొత్త సైకిల్ ని కాలితో తన్నింది.అదే పని మా పాలెంలో ఎవరైనా చేసుంటే వల్ల పేగులుతీసి పందిరేసే వాడిని కానీ అవతల ఉన్నది దొరలు, గోరుతో పోయెడనికి గొడ్డలిదాకా తెచ్చుకోవడం ఎందుకని ‘క్షమించండి అమ్మ,ఇదిగో ఇప్పుడే ఈ రబ్బరు ముక్కలు తీసేస్తాను’ అని చెప్పి మా నాన్న నాకు ఎంతో ప్రేమగా కుట్టిచ్చిన చెప్పులను తీసి పక్కన పడేసాను.

బాధతో వచ్చిన కోపాన్ని ఆపొచ్చు ఏమోకానీ గర్వంతో వచ్చిన కోపాన్ని ఎవరు అపగలరు, నేను ఎంత విన్నపించుకుంటున్నా వినకుండా ఆమె నన్ను క్షమించడంలేదు. నాకు ఓపిక నశించడంతో పక్కన పడిపోయిన నా సైకిల్ ని తీసుకొని బయలుదేరబోయాను. ‘కూలి నా యాల ఒకవైపు నేను మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళడానికి ఎన్ని గుండెలురా నీకు’ అంటూ వీధి రౌడీలా చీరలేపి నా గుండెలమీద కాళ్లతో తన్నింది,నేను వెళ్లి పక్కనే ఇదంతా ప్రేక్షకుల్లా చూస్తున్న మా స్నేహితుల మీద పడ్డాను. కోపం కంచెలు దాటింది,చేతిలో గొడ్డలంటే పదును పోయేదాకా నరుకుతూనే ఉండేవాడిని.కూలోడైతే సైకిల్ తొక్కకూడద,చెప్పులు ఏసుకోకూడదా. కోపంతో నా ఒళ్ళు వణికిపోతోంది, దొరల మీద భయం పోవడమో లేక నా ఆత్మాభిమానమో తెలీదుకానీ తిరిగి రాణిగారి గుండెల మీద తన్నమని రక్తం ఉరుకెత్తుతుంది. ఇంతలో అక్కడికి పోలీసు వారు వచ్చారు, వచ్చింది మా గొడవకోసం కాదు కాని వాళ్ళ రాకతో కాస్త నా మంట మీద నీళ్లు చల్లినట్టు అయింది. పోలీసులు అక్కడ గుంపులుగా ఉన్న పాలెం జనాన్ని చెదరగొడుతుండగా నేను రాణి గారి వైపు కోపంగా చూసుకుంటూ నా సైకిల్ తీసుకొని బయలుదేరాను.

పాఠాలు చెప్పడం ముగిసాక కొత్త సైకిల్ మీద కాస్త పట్టణం తిరిగి వచ్చేసరికి సాయంత్రం చీకటి పడింది.మా పాలెం మట్టి రోడ్డు దాటుతుండగా సైకిల్ ముందు చక్రానికి  ఒక్కసారిగా ఎదో అడ్డంపడి నేను అలా ముందుకి తృల్లిపడ్డాను. అక్కడక్కడా చర్మం చెక్కుకు పోవడంతో మంటకి అబ్బా అమ్మా అనుకుంటూ లేచి ఎం అడ్డం పడిందో చూద్దాం అని సైకిల్ ని లేపుతుండగా, ఎవరో ఒక అడుగు గట్టిగా సైకిల్ చక్రం పుల్లలు విరిగేలా వేసి తొక్కిపట్టుకున్నారు. చిమ్మ చీకటి అది అక్కడ ఎవరున్నారో కూడా నాకు కనపడట్లే, నేను వెంటనే రేయ్ రేయ్ ఎవర్రా అది అని అరిచాను. మిణుగుడు పురుగుల శబ్దం తప్ప ఇంకేమి సమాధానంగా రాలేదు. నేను అలా ఆ మనిషి దగ్గరకు వెళ్లి గట్టిగా అతడి చాటి మీద నెట్టబోయాను.అప్పుడే అర్ధమయింది అది ఎవరో మగ వాడి ఛాతి కాదని ఇంతలోనే ‘ ఆడంగి నాకొడకా ఎంత ధైర్యం ఉంటే నా ఒంటి మీదే చెయ్యి వేస్తావ్రా’ అని ఒక ఆడగొంతు వినిపించింది.అప్పుడు నాకు పరిస్థితి పూర్తిగా పూస గుచ్చినట్టు అర్థం అయ్యింది, ఇదంతా రాణి గారి పన్నాగమని.

నా రెండు చేతులు ఆమెకి నమస్కరించే లోపల వెనకనుంచి గట్టిగా నా తల మీద ఒక కొబ్బరి మట్ట దెబ్బ పడింది. అంతే అంతా సూణ్యం, కళ్ళముందు ఒక నలుగురు కదులుతున్నారు కానీ వాళ్ళు ఎవరో గుర్తుపట్టలేకపోతున్నా. ‘కూలి నా కొడుక్కి ఊర్లో సైకిల్ ఏసుకు తిరిగే అంత ధైర్యం ఎప్పుడొచ్చిందిరా’ అని ఒక గొంతు ఉక్రోశంతో గట్టిగా చించుకుంటుంది. మనిషైతే మసకగా కనపడటంలేదు కానీ నూటికి నూరుపాళ్లు అది మా దొరగారి గొంతే. విరిగిన చెట్టు కొమ్మతో ఒకడు న మోకాళ్ళు మీద గట్టిగా కొట్టాడు, ఆ క్షణం ఆ నొప్పికి నిజాంగా సైకిల్ కొని మా నాన్న తప్పు చేసాడు అనిపించింది. వంటి మీద ఈగ వాలే సందు కూడా లేకుండా ఒంటిని కుల్లబొడిచారు. ఆక్రోశం ఆకాశమంతవున్నా వాళ్ళ పది చేతులు ముందు నా రెండు చేతులు కట్టుకోక తప్పలేదు. చివరిగా నా సైకిల్ తీసుకొని వెళ్ళిపోతు రాణి గారు ‘తాతా! వీళ్ళమ్మ ఉందే పార్వతమ్మ వయసు వరస కూడా లేకుండా ఈడి మామ రంగడితో మాంచి..’ అని కూసి నవ్వుతుండగా. రాణి జుట్టు పట్టుకుని ఒక వెనక్కి ఈడ్చుకొచ్చి ‘దొరా…! ఈ బజారు లంజ నీ ముసలి సుఖానికి బాగా అలవాటు పడినట్టు ఉంది,ఒక అరగంట పంపు కూలోడికి కోపం వస్తే ఎలా ఉంటదో చూపిస్తా’ అని ఆగని ఉక్రోశంతో ఏమి ఆలోచించకుండా అరిచేసా. ఇక దొర ఎరుపురంగు చూసిన గంగిరెద్దుల రంకెలేస్తూ నా మీదకు జనాన్ని పంపాడు. నేను తిరిగిదాడి చేసినా నా బలం సరిపోలేదు,ఇక వాళ్ళని తప్పించుకుంటూ నా సైకిల్ తీసుకొని అలా కొండ అడవుల్లోకి పారిపోయాను.చాలా దూరం వరకు దొరగారి మనుషులు నన్ను తరుముతూనే ఉన్నారు, కొంత దూరం వెళ్ళాక నేను వాళ్ళకి దొరకకుండా సైకిల్ శబ్దం ఏ మాత్రం వాళ్ళకి వినపడకుండా సైకిల్ని నా తల మీద పెట్టుకొని నెమ్మదిగా అడవిలోకి వెళ్ళిపోయాను. కారు చీకటి ఎటువైపు ఎం జంతువస్తుందో దేనికి ఆహారంగా మారి చేస్తానో తెలీదు కానీ ఎప్పుడు అడవి బయటకు వెళ్తే మాత్రం కచ్చితంగా ఆ రాక్షసుల చేతిలో చేస్తాను.ఇక చేసేది ఏమి లేక ఒక చెట్టు నీడన ఆ రాత్రంతా గడిపాను.

పొద్దున్నే లేచి ఇంటికి వెళ్దాం అని మెల్లగా అడవినుంచి బయటకు వచ్చాను, కాస్త దూరం నుంచి మర్రి చెట్టు చాటుగా చూస్తే మా ఇంటి చుట్టూ మనుషులు చుట్టుముట్టి ఉన్నారు, కచ్చితంగా దొరగారి మనుషులే నాకోసం కపుకాసారని నాకు అర్థమయింది.’ఆ రాఘవ గాడు వచ్చే వరకు ఈ ఇంటి వైపు ఎవడైనా వచ్చాడో వాడి పేగులుతీసి వాటితోనే ఉరేస్తా’ అని దొరగారి గొంతు నాకు వినిపిస్తుంది. ఇంతలో ఎవరో నా భుజం మీద చెయ్యి వేశారు.నా గుండె ఆగిపోయింది, వాళ్ళకి దొరికిపోయానని ఇక నాకు చావే దిక్కని కళ్ళుమూసుకుని వెనక్కి తిరిగాను,తిరిగి చూస్తే రంగ మామ.ఒళ్ళంతా దెబ్బలు తగిలి, మోహమంతా రక్తంతో మాట్లాడలేని పరిస్థితుల్లో నాకు ఎదో చెప్తున్నాడు.మామ మామా ఎంజరిగింది మామా అని ఎంత అడిగినా అతడు సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేడు. ‘ఒరే రాఘవ వాళ్ళ కంట పడకురా వెళ్లి ఎర్ర..ఎర్ర’ అంటూ ఎదో చెప్పబోయి కన్నుమూసాడు.మా మాటల శబ్దానికి దూరంగా ఉన్న దొర మనిషికి అనుమానం వచ్చింది,వెంటనే తన చేతిలో ఉన్న బల్లెం అలా చాచి ఆ పొదల్లోకి విసరగా అది వచ్చి నా ఎడమ కాళి పిక్కలోకి బెత్తెడు లోతు గుచ్చుకుంది. నొప్పికి గట్టిగా అమ్మా అని కూడా అరవలేని పరిస్థితి నాది, అరిస్తే వాళ్ళు నేను కనురెప్ప ఆర్పే సమయంలో నా ముందుకు వచ్చి నన్ను నరికేస్తారు. నా చేతుల్లో చచ్చిన నా మామ సెవాన్ని చూసి ఏడ్చే సమయంకూడా లేకుండా నన్ను తరమడం మొదలు పెట్టారు, రక్తం కారుతున్న కాళ్లతో నేను మళ్ళీ నా సైకిల్ తోసుకుంటూ అడవిలోపలికి తప్పించుకున్నాను. ఆ కుంటి కాళ్ళతోనే రెండు రోజులు ఆ అడవిలో నరకం అనుభవించాను, ఒక వైపు ఒంట్లో రక్తం కోపంతో ఉరకలుపెడుతుంది,మరోవైపు గాయంనుంచి రక్తం దారకడుతుంది. ఒక పేదవాడు సైకిల్ మీద తిరిగితే అది వాడి చావు కోరుకుంటుందా అని నాలో ఎన్నో లక్షల ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. ఆ రాత్రి నొప్పిని మర్చిపోడం అని కళ్ళు మూస్తే ఏవో తెలియని పీడ కలలు, ఎవరో చీకట్లో చేతికి ఎర్ర గుడ్డ కట్టుకొని పిడికిలి బిగించినట్టు, రంగ మామ నన్ను రా రా ఎర్ర.. రాఘవ అంటునట్టు. ఇంక నిద్రపట్టక లేచి కూర్చున్న నాకు  తిందిలేక దొక్కమాడింది,పూర్తిగా నీరసం వచ్చింది, ఎలాగోలా తిండితినకపోతే వాళ్ళు నన్ను పట్టుకొని చంపేలోపల ఆకలితో నేనె చచ్చేలా ఉన్నానని ఇక ధైర్యం చేసి ఒక రాతిరి గుట్టు చప్పుడుకాకుండా ఇంటికి బయలుదేరాను. అర్ధరాత్రి కావడంతో ఇంటి చుట్టూ ఉన్న దొర మనుషులు కాస్త కునుకువేసారు. తెల్లరేలోపు వెల్లి నా అమ్మా నాన్నకు మొఖం చూపించి,ఒక పిడికెడు అన్నం తిని వెళ్లిపోదాం అనుకున్నాను.మా ఇంటి పెరట్లో ఉన్న తడిక మెల్లగా పక్కకు జరిపి ఇంటి లోపలికి వెళ్ళాను. ఇంట్లో ఎదో తెలియని దుర్వాసన రావడంతో అటు ఇటు చూసుకుంటూ మా అమ్మని వేతకసాగాను. గుడిసెలో ఒక మూల మా నాన్న నిద్రపోయుండటం గమనించి, నాన్నని నిద్రలేపుడమని దగ్గరకి వెళ్ళాను. దగ్గరకి వెళ్లే కొద్దీ దుర్వాసన మరీ ఎక్కువగా వచ్చింది. మొదట మెల్లగా నాన్నని తడిమి నిద్ర లేపినా ఆయన లెవకపోవడంతో బోల్తా పడుకున్న అతనిని చెయ్యి పట్టుకొని తిప్పి చూసాను. విశ్వసముద్రాలు నాలోనే అనాథలై దిక్కులేక ఎగసి ఎగసి అళల్లా ఆ ఒడ్డున పడుతున్నాయి.

ఆయన పొట్ట లోపల నుంచి ఎలుకలు ప్రేగులు పీకుంటూ బయటకి వస్తున్నాయి. ఆ దృశ్యాలు చూసి నా గుండె పాతికేళ్ల ప్రేమ బరువు ఒక్కసారి మోసినట్టు ఉక్కిరిబిక్కిరయింది.అదే నిస్పృహలో నేను మా అమ్మని వేతకగా, ఎండిన రక్తపు మడుగులో పురుగులు వాళుతూ మా అమ్మ గొంతు తెగి పడివుంది.కన్నీరు అప్పటికే ఎండిపోగా కార్చడానికి కంటికి రక్తపు బొట్లయిన నా ఒంట్లో కారువయ్యాయి.ఆ క్షణం నాకు అర్థంమయింది నేను అడవిలోకి వెళ్లి తప్పించుకున్న మరుక్షణం ఆ దొరలు ఏపాపం తెలియని మా అమ్మానాన్నను అతి కిరాతకంగా చంపేశారు. ఇంకా కసి తీరక వాళ్ళ సేవాలను అడ్డంపెట్టుకొని నన్ను చంపడానికి కాసుకు కూర్చున్నారు. అంత కోపం దేనికి, ఒక రబ్బరు ఫేక్టరీ కూలోడి కొడుకు ఊర్లో నవ్వుతూ సైకిల్ తొక్కినందుకా లేక ఒక ఆడపిల్ల సాటి అడదైన మా అమ్మని నోటీకొచ్చినట్టు మాట్లాడితే ఎదురు చెప్పినందుకా.ఇది కోపంగా లేక దొరల పొగరుకి మేము చెల్లించాల్సిన రుణమా, ఒక్క క్షమాపణతో పోయెడనికి నా కుటుంభం మొత్తాన్ని బలిస్తారా.దొరంటే ప్రాణం అంత సులువుగా తీసే యముడా. గర్జించే ఉరుముకైనా ఏముంది తోడు తన మదిలో దాగిన మంచు ముక్క తప్ప. నా బలం,నా బలగం ఇవేమీ ఆక్షణం నాకు గుర్తురాలేదు నా గుండెలో మెలిగింది అంతా ఒక్కటే దొర కళ్ళలో ఒక కూలోడు పుట్టించే చావు భయం చూడాలన్న కోరిక. ఆ క్షణంమే నా ప్రాణం నా దేహాన్ని విడిచి వెళ్ళిపోయింది ఇక మిగిలింది కేవలం దొర చావు కోరే ఒక మాంసపు ముద్ద. అదే ఆవేశంతో నా కూలి నాన్న నాకు కొనిపెట్టిన సైకిల్ మీద దొర ఇంటికి వెళ్ళాను. మెల్లగా గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించాను, అందరూ మంచి నిద్రలో ఉండగా దొర నిద్రపోతున్న గదిలోకి వెళ్తుండగా, నా కాళి గాయంనుంచి కారిన రక్తపు బొట్ల వాసన పసిగట్టి దొర పెంపుడు కుక్క గట్టిగా మొరగడం మొదలుపెట్టింది. వెంటనే ఇంట్లో అందరూ లేచారు, ఒక్క క్షణం ఆలశ్యం చేసిన వాళ్ళ చేతికి చిక్కుతానని తెలిసినా.అక్కడినుంచి వెళ్లేముందు నా చేతితో దొర నోరు గట్టిగా మూసి పట్టుకొని  కసితీరా కత్తితో వాడి వీపు మీద రెండు చక్రాలు సైకిల్ చెక్కాను. నేను చచ్చినా,నా గుర్తుగా వాడి బ్రతుకంతా ఈ కూలోడంటే భయంతో ఆ వెన్ను వనకాల. నొప్పి తట్టుకోలేక దొర గట్టిగా అరవడం మొదలుపెట్టాడు,ఇంటి జనం ఆ గదికి రాబోతుండగా నేను వారి నుంచి తప్పించుకుని ఇంటి వెనకకు పరుగుపెట్టి,నా సైకిల్ మీద తప్పించుకోబోయాను. ఇది ఆ ఆడ పిశాచి రాణి కళ్ళలో పడడంతో ‘బసవలు రబ్బరు సంచులు కొట్టండిరా’ అని వాళ్ళ మనుషులకు ఎదో చెప్పుకొచ్చింది. వాళ్ళు వెంటనే ఏవో నీరు నిండిన రబ్బరు బుడగలతో నన్ను కొట్టడం మొదలు పెట్టారు, నేను మాత్రం వాళ్ళకి ఏ మాత్రం చిక్కకుండా నా కుంటి కాళ్లతో కుదిరినంత వేగంగా సైకిల్ తొక్కుతున్నాను. వెంటపడుతున్నారేమో అని వెనక్కి తిరిగి చూడగా.

ఆ రాణి చేతిలో ఒక అగ్గిపుల్ల, ఆ అగ్గిపుల్ల వెలుగులో  ఆమె కళ్ళలో ఒక రకమైన ఓటమి భయం నేను చూసాను. ఆమె ఆ అగ్గిపుల్ల వెలిగించి వెంటనే నా మీదకు విసిరింది. అవి నీటి బుగ్గలు కావు, కిరసనాయిలు నింపిన బుగ్గలని నాకు అప్పుడే అర్ధమయింది. నా వెనక అగ్గి మంట నన్ను తరమడం మొదలు పెట్టింది, సెకండ్ల వ్యవధిలోనే ఆ మంటలు నా సైకిల్ టైర్లకి అంటుకొని నా కాళ్ళకి కూడా వ్యాపించాయి. ఛస్తే ఆ అగ్గిలో భూడిదయ్యి చస్తానే తప్ప వల్ల చేతికి మాత్రం చిక్కకూడదు అని నిశ్చయించుకున్నాను. ఆ మంటలు అంటుకున్న సైకిల్ తోనే అడవిలోకి దూసుకెళ్లను. కొంత దూరం వెళ్ళాక మంటలు చల్లారాయి, వెనక చూస్తే ఎవ్వరు లేరు. నా నాన్న కొన్న సైకిల్ ఆ మంటల్లో సగంకాలి నన్ను కాపాడింది.ఆ రాత్రికి ఆ అడవిలోని నిద్రపోయాను.లేచి చూస్తే దూరంగా ఎవరో చీకట్లో చేతికి ఎర్ర గుడ్డ కట్టుకొని, రంగ మామ పక్కనుంచి రా రా ఎర్ర రాఘవ అని పిలుస్తున్నాడు.వెంటనే నిద్రలేచాను.మెల్లగా తెల్లారింది. మళ్ళీ ఆ దొరకి చావు భయం చూపించాలన్న ఆలోచన తప్ప న మెదడులో ఇంకేమి లేదు.ఉన్న అన్ని మార్గాలని పరిశీలించను,అన్ని అవకాశాలని గుర్తుచేసుకున్నాను, ఎలాగైనా మళ్ళీ ఆ దొర గోతు మీద కత్తి పెట్టి ఇది కూలోడు నీకు బిచ్చమేస్తున్న ప్రాణంరా అని చెప్పాలనుకున్న.దానికి కావాల్సిన వ్యూహంతా సిద్ధంచేసుకొని పొద్దు పొడవగానే మళ్ళీ దొర మీదకు వెళ్దాం అని నిశ్చయించుకున్నా. అలా ఆలోచిస్తూ పక్కన వాగులో నీరు తగుతుండగా ఎండుకర్ర విరగకుండా నా చుట్టూ పోలీసులు మోహరించారు. ‘రాఘవా నీ చుట్టూ రెండు వందల మంది పోలీసులు ఉన్నారు, తప్పించుకోవడానికి ప్రయత్నించాను.నా మాట విని లొంగిపో’ అని ఒక పోలీసు అధికారి చెప్పుకొచ్చాడు.నేను అది విని పాలెంలో పేదోడికి కష్టం వస్తే ఏరోజైన ఒక్క పొలిసొడు వచ్చాడయ్యా? ఈరోజు దొరకు పంతం వచ్చేసరికి ఏకంగా రెండు వందలమంది వచ్చారె మీరు ఏమి పోలీసులయ్య అని అన్నాను. ‘తెలివిగా మాట్లాడకు రాఘవా నీ మీద ఉన్నది హత్య కేసు, వారం రోజుల క్రితం వర్షం పడుతున్న రాత్రి పాలెం మట్టి రోడ్డు దగ్గరలో నువ్వు జమీందారు కృష్ణదాసు గారిని హత్యచేసిన సంగతి ఇప్పుడు మాకు తెలిసిపోయింది దానికి రుజువు ఆ మృతదేహం పక్కన ఉన్న నీ రబ్బరు చెప్పుల గుర్తులే,కనుక నువ్ ఆలస్యం చేయకుండా తొందరగా లొంచిపోతే మంచిది’ అని చెప్పాడు. ఆ మాటలకి నాకు ముచ్చెమటలు పట్టాయి,ఎం మాట్లాడాలో అర్థంకాలేదు. ‘అయ్యా! ఆ హత్యకు నాకు ఎటువంటి సంబంధంలేదు,నాకు అసలు ఆ హత్య జరిగినట్టే తెలీదు’ అని చెప్పసాగాను. దానికి పోలీసు అధికారి ‘ నువ్వేం చెప్పలనుకున్నా ముందు పోలీసు స్టేషన్ కి వచ్చి చెప్పు’ అని అన్నాడు. చుట్టూ రెండు వందల మంది పోలీసులు అసలు పరారయ్యే అవకాశమే లేదు,పొరపాటున తప్పించుకున్నా బయట దొర మనుషులు నాకోసం కాపు కాసి ఉంటారు. ఎటు వెళ్లినా నాకు చావు తప్పదని తెలిసాక లొంగిపోయాను. పోలీసులు నన్ను స్టేషన్ కి తరలించారు.

నువ్వు చెప్పాలనుకున్నది అంతా వివరంగా చెప్పు అని పెద్ద అధికారి నన్ను అడగగా. ‘అయ్యా! నాకు నిజంగా ఈ హత్యతో ఎలాంటి సంబంధంలేదు.మా నాన్న ఒక రబ్బరు ఫ్యాక్టరీ కూలి,నేను మా అమ్మ మా నాన్న తెచ్చిన జీతంతోమే బ్రతుకుతాం మాకు ఈ హత్యాలతో ఎప్పుడు ఎలాంటి సంబంధం లేదు’ అని చెప్పసాగను. నిజం నింగంతైనా ఎవరు నమ్మరు గాని అబ్బద్దం ఆవగింజంత అయినా అందరూ నమ్ముతారు. ఊర్లో అప్పటిదాకా నేను మంచివాడిని అని నమ్మిన నా స్నేహితులు,చుట్టాలు అంతా ఒక్కసారిగా నన్ను హాంతకుడని నమ్మారు. నేను నిజం ఎంత గట్టిగా అరిచి గీపెట్టినా అది పోలీసు ప్రశ్నల ముందు నిలపడలేదు.ఇదే సందుగా చూసుకొని దొర నన్ను ఊరందరి ముందు హాంతకుడినని నిరూపించడానికి ఊర్లో బహిరంగంగా పంచాయితీ పెట్టాడు. పంచాయతీలో వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడిగినా నా సమాధానం మాత్రం ఒక్కటే ‘నాకు ఈ హత్యకు ఎటువంటి సంబంధంలేదు’ అని. ఏ సంభందం లేకపోతే నీ రబ్బరు చెప్పుల గుర్తులు ఆ మృతదేహం పక్కన ఎందుకు ఉన్నాయి అని దొర నన్ను ఇరికించడానికి అందరి ముందు అడిగాడు.ఆ ప్రశ్నకి న దగ్గర సమాధానం లేదు. నా మోనానికి ఊరి జనమంతా ఆ హత్య నేనె చేశానని నమ్మరు, నా స్నేహితులు నావైపు ఒక కిరాయి గుండాని చూసినట్టు చూసారు. ఆ చూపులు,నిందలు తట్టుకోలేక

‘అవును ఆ హత్యకు నాకు సంభందం ఉంది,ఆ రోజు వర్షం పడి మా నాన్న ఇంటికి రావడం ఆలశ్యం అవ్వడంతో నేను మా నాన్న కోసం మట్టి రోడ్డు దాకా వెళ్లి కపుకాసాను.మా నాన్న రావడానికి కొంత సమయం ముందు నాకు కాస్త దూరంగా రోడ్డుకి అటువైపు ఎవరో ఒక మనిషి చేతికి ఎర్ర గుడ్డ కట్టుకొని తన చేతులతో ఇంకో మనిషిని హత్య చేయడం చూసాను.వెంటనే కేకలు వేస్తూ ఆ మనిషి దగ్గరకు వెళ్ళాను తీరా నేను వెళ్ళేసరికి అతను తప్పించుకొని అడవిలోకి పారిపోయాడు.నిర్జీవంగా పడివున్న వ్యక్తి ఎవరా అని చూస్తే మన జమీందారు గారు. నేను వెళ్ళేసరికి ఆయన ప్రాణాలతో లేడు,ఇక ఈ విషయం ఎవరికైనా చెప్తే నేను ఇర్రుకుంటానని ఎవరికి చెప్పకుండా ఎన్ని రోజులు దాచుంచాను, హత్య జరిగిన మరుసటిరోజు నేను రాణి గారితో మాట్లాడుతున్నప్పుడు పోలీసులు రాగా అప్పుడే నేను చూసింది చెప్పేద్దం అనుకున్నాను కానీ రాణి గారితో గొడవ వల్ల తొందరలో అక్కడి నుంచి వెళ్ళిపోయాను’ అని ఆ రోజు జరిగిన కథ చెప్పాను. ఇది విన్న దొర వెంటనే ‘చూసారా చూసారా,వీడి నాటకాలు ఇప్పటిదాకా హత్యకు తనకు ఎటువంటి సంబంధంలేదు అన్నాడు ఇప్పుడేమో హత్యాని తన కళ్లారా తానే చూసాను కానీ ఎవ్వరికీ చెప్పలేదు అంటున్నాడు,ఇంకో రెండు తగిలిస్తే ఆ హత్య వీడే చేసాడని ఒప్పుకుంటాడు’ అని అన్నాడు. నిజమో అబ్బధమో నేను చెప్పిన విషయం కన్నా దొర చెప్పిన విషయంలో స్పష్టత ఎక్కువ ఉండటంతో ఊరి జనంతో పాటు పోలీసులు కూడా ఆ హత్య నేనె చేశానని నమ్మారు. నన్ను స్టేషన్లో ఖైదీగా తరలించారు. ఆ రోజు రాత్రి దొర పోలీసు స్టేషన్ కి వచ్చి పోలీసులతో నన్ను చంపేయమని,నేను పరరావుతుంటే చంపకతప్పలేదని చెప్పి కేసుని మూసేయమని తన డబ్బు బలంతో ఒప్పించాడు. ప్రజల ఉప్పు తిన్న పోలీసులకు దొర ఉచ్చ అంత వంటపడుతుంది అనుకోలేదు. దొర విషయం చెప్పగానే నాకు ముసుగు కప్పి అర్ధరాత్రి అడవిమధ్యలోకి తీసుకెళ్లారు. ఇక చావుకు కొద్దీ క్షణాలు దూరంలో ఉన్న నాకు మా అమ్మా,నాన్న అన్ని ఆ చివరి క్షణాల్లో గుర్తొచ్చాయి. నా ముసుగు తీయబోతుండగా మళ్ళీ ఎందుకో నన్ను ఎత్తుకొని ఎక్కడికో తీసుకెళ్లారు. ఈసారి ప్రయాణం చాలా సేపే జరిగింది. బహుశా జనాలకి నా సేవం దొరకకుండా ఇంకా దూరంగా తీసుకెళ్లి చంపుతారేమో అను అనుకుంటుండగా. నన్ను కిందకి దింపి నా ముసుగు తెరిచారు.మసకబారిన నా కళ్ళ ముందు చేతికి ఎర్ర గుడ్డ కట్టుకున్న ఒక వ్యక్తి నించొనిఉన్నాడు. ఆ వ్యక్తి మొహం నాకు కొత్తేమో గాని ఆ ఎర్ర గుడ్డ నాకు ఎన్నో నిద్రలేని రాత్రుల్ని మిగిల్చింది. అతనితో పాటు చాలా మంది అలానే చేతికి ఎర్ర గుడ్డలు కట్టుకొని నా చెట్టు నిలుచున్నారు. వాళ్ళని చూసి నేను ‘పోలీసులు నేరుగా చంపలేక మీకు సుఫారీ ఇచ్చారా?’ అని నవ్వుతూ అడిగాను. దానికి సమాధానంగా ఆ వ్యక్తి ‘నిన్ను చంపాలనుకుంటే పోలీసుల చేతినుంచి నిన్ను తప్పించాల్సిన పని మాకు లేదు రాఘవా, మేము ఉన్నాడు నీ బాగు కోసం’ అని అన్నాడు. నేను నవ్వుతూ ‘నా బాగా.. మనుషుల్ని చంపుకు తిరిగే మీరు మనుషుల బాగోగుల గురించి మాట్లాడుతుంటే హాస్యంగా ఉంది’ అని చెప్పాను.వెంటనే అంతను ‘అబ్బద్దం ఎందుకు చెప్పావ్ రాఘవా?’ అని ప్రశ్నించాడు. నేను ఆ ప్రశ్నకు తిరిగి ప్రశ్నగా ‘ఎం అబ్బద్దం? ఏది అబ్బద్దం?’ అని అడిగాను. ‘ఆ హత్యకి నీకు సంబంధంలేదు అని ఎందుకు చెప్పావు రాఘవా?’ అని అతడు మళ్ళీ అదే ప్రశను కాస్త వివరించి అడిగాడు. ‘నేనేమి అబ్బద్దం చెప్పలేదు, ఆ రోజు నిజాంగానే చేతికి ఎర్ర గుడ్డ కట్టుకున్న ఒక వ్యక్తి నేను చూస్తుండగా హత్య చేశాడు’ అని సమాధానమిచ్చాను.: అవును నిజమే ఆ హత్య చేసింది చేతికి ఎర్ర గుడ్డ కట్టుకున్న వ్యక్తే కానీ ఆ ఎర్రగడ్డ కట్టుకుంది నీ నాన్న సాంబయ్యా అని ఎందుకు చెప్పలేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఎర్ర కార్మికుడికి తెలుసు ఆ రోజు జమీందారుని గర్వంగా హత్య చేసింది మాలో ఒకడైన మా ఎర్ర సాంబయ్య అని. కానీ నువ్వు పంచాయతీలో అందరి ముందు మీ నాన్న వీరత్వాన్ని నీ అబ్బద్దంతో చంపేసావ్’ అని ఆ వ్యక్తి ఆవేశంగా నాతో వాదిస్తున్నారు. బ్రతికినంత కాలం మా నాన్న పాలెంలో మంచి పేరుతో బ్రతికాడు,అలాంటిది చచ్చాక ఆయనిని ప్రజలు హాంతకుడిగా గుర్తుపెట్టుకోవడం నాకు ఇష్టం లేదు అందుకే అలా చెప్పాను.

‘హాంతకుడా, మీ నాన్న,మామా రంగా మా ఎర్ర సైన్యంలో త్యాగమూర్తులు.పేద ప్రజల కష్టాలను చూసి ఈ దొరల రాజ్యం అంతు ముగించాలని కంకనంకట్టుకొని తమ జీవితమంతా సాధారణ కూలి ముసుగు కప్పుకు తిరిగిన ఎర్ర సైన్య ధీరులు’ అని మా నాన్న, రంగ మామా గురించి చెప్పుకొచ్చాడు. అతడు ఎంత గర్వంగా చెప్పినా నాకు మాత్రం మనిషిని చంపడం ఎదో తెలియని తప్పుగా అనిపించి ‘ఏముంది మీ ఎర్ర సైన్యంలో మనుషుల్ని చంపడం, లూఠీలు చెయ్యడమా?’ అన్నాను. రాఘవా ‘మీ నాన్న ఒక రబ్బరు ఫ్యాక్టరీ కూలి ఆ ఫ్యాక్టరీలో తయారయ్యే రబ్బరుతో పాటు మీ నాన్న శ్రమ,చెమట కూడా సరుకే ఆ పెట్టుబడిదారులకి.మీ నాన్నదే కాదు మనలాంటి ఎంతోమంది కూలోళ్ళ కష్టం ఆ పెట్టుబడిదారులకు కేవలం సరుకు మాత్రమే.ఎమ్మన్నావ్ లూఠీలా? ఎదిరా లూఠీ? ఎవరిదిరా లూఠీ? రెక్కలు ముక్కలు చేసుకు సచ్చే కూలోడి కష్టాన్ని సొమ్ము చేసుకోమే వాళ్ళదిరా లూఠీ, ఒక కూలోడి కొడుకు నవ్వుతూ సైకిల్ తొక్కితే తట్టుకోలేక మొత్తం కుటుంబానినే మట్టిలోకలపడంరా ప్రాణం లూఠీ అంటే. నడి రోడ్డులో ,ఊరందరి ముందు ఒక ఆడపిల్ల నీ తప్పు లేకుండా నీ గుండెలమీద తన్నదంరా నీ అతభిమానం లూఠీ అంటే. గుర్తుగుపెట్టుకో రాఘవా నీచమైన ఈ డబ్బుకు బానిసలైన పెట్టుబడిదారులకు నీ పుట్టుక,నీ బ్రతుకు,నీ కష్టం,నీ రక్తం చివరికి నీ చావు అంతా సరుకేరా..సరుకే! ఇప్పటిదాకా నువ్వు విన్న డబ్బు విలువ అంతా అబ్బద్దం రాఘవా, మనమన్నట్టు సూర్యుడు తూర్పున ఉదయించాడు,పశ్చిమాన అస్తమించడు అది కేవలం భూమిపై మనం పుట్టించిన నమ్మకం.డబ్బు కూడా అంతే దానికి మనం అనుకునే అంత విలువ,చలనం రెండు ఉండవు ఇప్పుడు ప్రస్తుతం డబ్బుకి ఉన్న విలువ కేవలం ఈ పెట్టుబడిదారులు పుట్టించిన నమ్మకం.దేశంలో అసలు పేద రైతు అనేవాడికి కడుపుకి పిడికెడు బియ్యం కూడా లేకుండా అంతా ననాశనం చేస్తుంది ఈ పెట్టుబడిదారులే. అలంటి పెట్టుబడుదారులపై తిరుగుబాటు చెయ్యడమే ఈ ఎర్రగుడ్డ ద్యేయం.

ఇది అంతా విన్నాక నేను వాళ్ళని అడిగింది ఒక్కటే ప్రశ్న ‘ దేశంలో రైతుల కోసం,పేద కార్మికులకోసం మీరు చేస్తున్న ఈ న్యాయమైన పొరతమైతే,ఈ చీకట్లో ఎందుకు,వెళ్లి ఆ వెలుగులో అందరికి కనిపించేలా యొద్దం చేయరెందుకు?’ దానికి అతడు  ‘నిప్పులా భగభగమండే సూర్యుడికి పగలేంటి, రాత్రెంటి. నిజం కోసం పోరాడే మాకు వెలుగెంటి ,చీకటేంటి. సూర్యులం మేము, నిపై మండే సూర్యులం మేము,చీకటిలో వెలుగుకోసం యుద్ధం చేసే మా ఎర్ర సైనికులు ‘చీకటి సూర్యులు’’

Leave a Reply

Your email address will not be published.