310
1

కైలాశ

310

నమస్కారం ‘టివి జె’ కి స్వాగతం,బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈరోజు అర్ధరాత్రి సిందిరాజ్ అనే వ్యక్తి కైలాశ పర్వతం పైకి వెళ్లి ప్రాణాలతో బతికి కిందకి వస్తానాని మీడియా ముఖంగా సవాలు విసురుతున్నారు,ఐతే కైలాశ పర్వతం పైనకు వెళ్లడం ఎంత మాత్రం మంచిది కాదని అలా వెళ్లడం ప్రాణాలకే ప్రమాదం అని ఒక వైపు శాస్త్రవేత్తలు చెప్తుండగా,మరో వైపు ఆ రాయిని తాకి మరల తిరిగి రావడం కేవలం ఆ శివుడి వరప్రసాదకులకే సాధ్యమని సామాన్య మనుషులు దానిని తాకి బ్రతికి బట్టకట్టలేరు అని పండితులు చెప్తున్నారు.ఇంకొందరు విజ్ఞానులు ఐతే ఇది ముమ్మాటికీ ఆత్మాహత్యా ప్రయత్నం లాంటిదే అని అలా చేయడం చట్టరీత్యా నేరం అని చెప్తున్నారు.ఇంతకీ అసలు ఆ కైలాశ పర్వతంలో దాగిన రహస్యం మేమిటి?సిందిరాజ్ ప్రాణాలకు తెగించి తీసుకున్న నిర్ణయానికి వెనుక దాగిన కధనం ఏమిటి?ఆ నూరు అడుగుల కైలాశ రాయికి ఏమైనా శక్తులు ఉన్నాయా? లేక శాస్త్రానికి చిక్కని అద్భుతం ఏమైనా ఉందా? ఇలా ఎన్నో ప్రశ్నలు వేల సంవత్సరాలుగా మనల్ని వెంటాడుతున్నాయి ఐతే ఈరోజు నేను వాటి అన్నిటికి సమాధానం చెప్తానని  85 ఏళ్ల శిల్పి సిందిరాజ్ అంటున్నారు.ఈ విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి కైలాశ పర్వత ప్రాంతంలో టి.వి జె రిపోర్టర్ కల్పన ప్రస్తుతం మనతో లైవ్ లో ఉన్నారు,చెప్పండి కల్పనా ఇంతకీ సిందిరాజ్ ఎవరు? అతను చెప్తున్న మాటలేంటి? అక్కడ ఇప్పుడు పరిస్తులు ఎలా ఉన్నాయి?

‘థాంక్యూ స్నేహ,ఇక్కడ పరిస్థితులు ఐతే చాలా గందరగోళంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఒక వైపు ఎం జరగబోతుందో చూద్దాం అని చాలా ప్రాంతాలనుంచి ప్రజలు ఈ కైలాశ పర్వత ప్రాంతానికి భారీ సంఖ్యలో చేరుకోగా మరోవైపు ప్రభుత్వ ఆర్కియోలజీ శాఖకు సంబంధించిన నిపుణులు ఇప్పటికే ఇక్కడికి చేరుకొని సిందిరాజ్ ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు,ఇకపోతే ఏదేమైనప్పటికి తాను మాత్రం ఈరోజు కైలాశ రాయి పైకి ఎక్కి తీరతానని,కాదని ఎవరైనా అడ్డుకుంటే భారత పౌరుడుగా తన స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తున్నట్టు చట్టపరంగా పోరాటం చేస్తానని సిందిరాజ్ మొండిపట్టు పట్టాడు.అసలింతకీ ఈ కైలాశ పర్వతానికి ఉన్న చరిత్ర ఏంటి? నూటముప్పై అడుగుల పొడవుతో సుమారు నూరు అడుగుల ఎత్తు ఉన్న ఈ భారీ బాండ రాయి దానిని తాకిన ప్రజల ప్రాణాలను ఎందుకు బాలి కోరుతుంది? ఎన్నో ఏళ్లుగా ఈ రాయిని తాకి ప్రాణాలతో తిరిగివచ్చి చరిత్ర సృష్టించాలనుకుకొని ఇక్కడే ఈ ఇసుకలోనే సమాది అయినవాళ్ళ సంఖ్య చిన్నదేమి కాదు.
చుట్టూ ఎడారిలా ఉన్న ఈ ప్రాంతం సుమారు కొన్ని వేల సంవత్సరాలు క్రితం భారీ కొండ ప్రాంతంగా ఉండేదని నిపుణులు చెబుతున్నారు,ఐతే కాలక్రమేణా ప్రకృతి పరిణామాలకు ఆ కొండలు అన్ని శిధిలాలుగా మారి పెద్ద ఎత్తున ఇసుక తయారయ్యి ఇలా ఎడారిలో మారిందని చాలా మంది పండితులు  చెప్పుకొస్తారు.చరిత్ర చూసుకుంటే మాత్రం ఈ ప్రాంతమంతా భగీరథ రాజు పాలనలో సస్యశ్యామలమై సంపదవిరాలమై వెలుగొండ రక్షత్రకుట రాజ్యంగా తెలుస్తుంది.ఇకపోతే ఈరోజు సిందిరాజ్ చరిత్ర సృష్టిస్తాడా లేక ఇదివరకు ప్రయత్నించిన వాళ్ళలానే ఈ కైలాశ పర్వతానికి బలి అవుతాడా అనేది ఇంకొన్ని గంటలు వేచి చూడాలి.

…… కొన్ని గడియల తరువాత …….

స్నేహా మనం ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాం సిందిరాజ్ కైలాశ పర్వతంపైకి నడక మొదలువులెట్టాడు,ఇప్పటికే ఇక్కడికి చేరుకున్న జనం అంతా ఎం జరుతుందో అని కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారు,ఇక చూస్తే సిందిరాజ్ ఏమాత్రం తడపడకుండా పర్వతం పైకి చేరుకుంటున్నాడు,మనం జాగ్రత్తగా గమనించినట్టు అయితే అతడు తనతో పాటు ఒక కాషాయ రంగు మూటని తీసుకెళ్తున్నట్టు కనిపిస్తుంది,ఆ మూటలో ఎదో రహశ్యం దాగి ఉంది అన్న మాటలు కూడా విన్పిస్తున్నాయి.మనం చూస్తున్నాం స్నేహ అతడు పర్వత శిఖరానికి చాలా దగ్గరలో ఉన్నాడు,మరికొద్ది క్షణాల్లో అతడు ఆ శిఖరంపైకి చేరుకుంటాడు.ఐతే ఇప్పటికే సూర్యోదయం సమయం దగ్గర పడింది,మనం చూసుకునట్టు ఐతే కరెక్టుగా సిందిరాజ్ శిఖరం చేరుకునే సమయానికి సూర్యోదయం జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.విచ్చేసిన ప్రజలంతా శివ నామ ఉచ్ఛరణ చేస్తుండడంతో ఈ ప్రదేశంలో వాతావరణం అంతా శివ భక్తి పరమైంది.లైవ్ లో చూస్తున్నాం స్నేహ సిందిరాజ్ శిఖరం చేరుకున్నాడు,సుమారు నూరు ఆడిగులు ఎత్తు ఉన్న ఈ కైలాశ పర్వత శిఖరం పైకి అతడు చాలా సునాయాసంగా చేరుకోవడం మనం గమనిస్తున్నాం,మనం అనుకున్నట్టు గానే ఇప్పుడే సూర్యోదయం మోదలయింది,అతడు తూర్పుకి ఎదురుగా వొంటికాళ్ల మీద నిలపడి శివ నామ జపం చెయ్యడం ప్రజలందరూ తమ కళ్ళతో చూస్తున్నారు.ఇప్పటిదాకా ఎవరు సాధించని ఘణత సిందిరాజ్ ఈ సాహసంతో సాదింఛాడాని చెప్పుకోవచ్చు,ఇక ఇప్పుడు అతడు ప్రాణాలతో కిందికి వస్తే ప్రపంచ దేశాలకు దిక్కుతోచని ఒక చిక్కుముడికి తాను సమాదానం చెప్పినవాడు అవుతాడు.మనం చూస్తున్నాం స్నేహ అతడు ఆ కాషాయ రంగు మూటలోనుంచి ఎదో తీసి ప్రార్ధనలు మొదలు పెట్టాడు,చూస్తుంటే అవి ఎదో పురాతన కాలానికి చెందిన తలపాత్రగ్రంధాలులా కనిపిస్తున్నాయి.శికరంపైకి చేరుకునే రహస్యం అందులోనే దాగిఉందా లేక ఇంకేమైనా ఉందా అనేది సిందిరాజ్ ప్రాణాలతో కిందకి వస్తేనే తెలుస్తుంది.అతడు తన ప్రార్ధన ముగించుకొని ఆ పాత్రలతో పర్వతం కిందకి దిగడం మొదలుపెట్టాడు,మరి కొద్ది క్షణాలలో అతడు కిందకి చేరుకునే అవకాశం ఉంది.అతడు ప్రాణాలతో కిందకి చేరుకుంటే మాత్రం ఇది ఒక అద్భుతం గానే చెప్పుకోవచ్చు,ఐతే ఇప్పటిదాకా ఎవరి తరం కాని ఓ చీకటి గది తలుపుల్ని తెరిచినవాడుగా సిందిరాజ్ చరిత్ర సృష్టిస్తాడు అని చెప్పుకోవడంలో అతిసెయోక్తి లేదు స్నేహ.చూస్తున్నట్లైతే సిందిరాజ్ దాదాపు కిందికి చేరుకున్నాడు,అతడు కిందకి చేరుకున్న మరుక్షణం ఆ తలపత్రాలలో ఎం దాగిఉందో మనకి తెలిసే అవకాశముంది.ఇది సాక్షాత్తు తమ కళ్ళతో చూసిన ప్రజలంతా సిందిరాజ్ శివ పుత్రుడు అని ఇప్పటికే తమలోతాము చెప్పుకుంటున్నారు.కిందకి చేరకనే చేరుకున్నాడు సిందిరాజ్.

పర్వతం దిగి ఇప్పుడే ఆ ఇసుక మీదిగా ఎటువైపు నడవడం మనం చూస్తున్నాం.ఇక్కడ చూసుకున్నటైతే సడన్ గా పెద్ద గాలి మొదలయింది స్నేహ! ఎం జరుగుతుంది అంతుచిక్కడం లేదు,మొత్తం ప్రాంతం అంతా ఇసుక గలితో నిండిపోయింది,కనుచూపు మేరలో ఎం కనిపించడంలేదు.పరిణామాలు చూస్తుంటే నిజాగానే ఇక్కడ ఆ ఎదో శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది.స్నేహ దూరంగా చూస్తున్నాం సిందిరాజ్ ఇసుకలో ఇరుకునట్టు మనకి కనిపిస్తుంది,ఇది నమ్మలేని నిజంగా అనిపిస్తుంది ప్రజలు అందరు చూస్తున్నారు సిందిరాజ్ మెల్లగా ఇసుకలో పాటుకుపోతున్నాడు,అతడు కదాలదనికి ఎటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు మనకి కనిపించడం లేదు.ఆ నేల కింద ఎదో ఊబి ఉన్నట్టుగా ఇసుక సరాసరి సిందిరాజ్ ను తనలోకి తగుతునట్టు మనం లైవ్ లో చూస్తున్నాం,భారీ వేగంతో గాలి కమ్ముకోవడం వల్ల రక్షక బలగాలు కూడా అతన్ని కాపాడే రాయత్నం చెయ్య లేకపోతున్నాయి.అందరూ ఆశ్చర్యపోయే సంఘటన ఇక్కడ చోటు చేసుకుంటుంది వేల మంది వీక్షకుల ముందే సిందిరాజ్ ఈ కైలాశ పర్వతానికి బలి కావడం చూస్తున్నాం.పర్వతం పైకి చేరుకొని క్షేమంగా కిందకి చేరుకుంటున్నాడు అనుకునే లోపలే ఈ నమ్మలేని ఘటన చోటుచేసుకుంది.మెల్లగా గాలి తగ్గుతుండడం మనం గమనిస్తున్నాం,ఐతే సిందిరాజ్ ఆచూకీ మాత్రం తెలియడం లేదు,భద్రత బలగాలు కష్టంగా లోపలికి చేరుకున్నాయి.అతడి జాడ కోసం వెతికే ప్రయత్నం చేస్తున్నట్టూ మనకి తెలుస్తుంది. వాళ్ల ఓరాయత్నం ప్రజలందరికీ నిరాసనే  మిగిల్చింది అని చెప్పుకోవచ్చు, సిందిరాజ్ ఆచూకి ఏ మాత్రం తెలియలేదు అని అధికారులు చెపుతున్నారు.ఇకపోతే జరిగిన ఈ అవాంఛనీయ సంఘటనలో మనకి కాస్త ఊరట కజలిగించే విషయం ఏంటంటే,సిందిరాజే తనతో పాటు తీసుకువెళ్లిన కషాయరంగు మూట ఆనవాళ్లు దొరికొనట్టు ఇప్పుడే రెస్క్యూ సిబ్బంది వెల్లడించారు.మనం ఇదివరకే చూసాం ఆ మూటలో ఎవో తాళపత్ర గ్రంధాలు ఉండటం.ఇక్కడే ఉన్న ఆర్కియాలజీ శేఖ నిపుణులు మూటలో ఉన్న ఆ తాళపత్రాలను పరిశీలిస్తున్నారు.అందులో దాగిన మాత్రమేంటో వారినే అడిగి తెలుసుకుందాం,సార్ చెప్పండి ఇంతకీ ఆ తాళపత్రాలలో ఏముంది?అవి ఏ కాలానికి సంభందించినవిగా గుర్తించారు?ఈ కైలాశ పర్వత రాహశ్యాలకి సంభందించి అందులో ఏమైనా సమాధానం దొర్తికే అవకాశంవుందా?

‘యాజ్ ఆఫ్ నౌ వి ర్ ఆన్ఏబుల్ టు డిస్క్లోస్ ఎనీథింగ్ (as of now we are unable to disclose anything),తాళ పాత్రలలో ఉన్న విషయం అంతా పురాతన గ్రంధికా భాషలో పొందుపరిచి ఉండటంవల్ల మనం ఆ బాష కోడ్ ని ట్రేస్ ఔట్ చేసి దాని మూలంగా విషయాన్ని తెలుసుకోవాలి, వి నీడ్ సమ్ టైమ్ ఎండ్ ఎక్స్పర్ట్స్ టీమ్ టు ఫిగర్ఔట్ ధిస్ (we need some time and experts team to figure out this),ఇప్పటికైతే మనం దీన్నీ గురించి ఏంమాట్లాడలేం,థాంక్యూ!’

అది విషయం స్నేహ! నిపుణుల మాటలు క్లుప్తంగా చెప్పుకున్నట్టు ఐతే ఆ తాళపత్రాల్లో బాష పురాతన గ్రాంధిక సూత్రాలు వాడి రచించినట్టుగా తెలుస్తోంది,దాన్ని అర్ధంచేసుకొని విడమరిచి చడవగలిగితే తప్ప అందులో ఉన్న విషయం తెలిసె అవకాశం లేదని చెప్తున్నారు.ఆ తాళపత్రాల్లో ఉన్న విషయం చడవగలిగే వరకు మనకు ఈ పర్వతం చరిత్ర గురించి తెలిసే అవకాశం లేనట్టే.అంటే ఈ కైలాశ పర్వతం వెనుకన దాగివున్న రహశ్యం తెలియలాంటె ఇంకొన్ని రోజులు మనం వేచి చూడాల్సిందే అని తెలుస్తోంది స్నేహ!
కెమెరా మ్యాన్ అక్బర్ తో,రిపోర్ట్ కల్పనా,టివి జె, ఓవర్ టూ స్టూడియో’

థాంక్యూ కల్పనా,ఇవి ఈనాటి ముఖ్యాంశాలు,ఇప్పటిదాకా కైలాశ పర్వతం సంఘటన మీద బ్రేకింగ్ న్యూస్ లైవ్ లో చూసాం,ఇకపోతే ఆ పర్వతం తనని తాకిన వాళ్ళను ఎందుకు బలి కోరుతుంది? ఆ కైలాశ పర్వతానికి ఉన్న చరిత్రెంటి? ఆ మరణాల వెనుక దాగిన రహశ్యమేంటి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలియాలంటే ఆ తాళపత్రాల్లో విషయం తెలిసేంత వరకు వేచిచూడాల్సిందే.

స్టే ట్యూన్డ్ టూ ‘టివి జె’

———- పార్ట్ -2 ———-

Leave a Reply

Your email address will not be published.

One thought on “కైలాశ

  1. రెండవ కథ ఎప్పుడు వస్తుంది ? ఆ తాళపత్ర గ్రంధాల్లో ఏముంటుంది ?