194
0

ఇట్లు కౌసల్య సుబ్రమణ్యం

194

ప్రతి కథకి మొదలు ఎంత అందగా ఉండాలో ముగింపు కూడా అంతే అద్భుతం గా ఉండాలి అప్పుడే కథ కి ఒక అర్థం ఉంటుంది.
అనగణగా అంటు కథ మొదలు పెడితే మన కథలో ఉన్న పాత్రలు ఇద్దరు వ్యక్తులు రెండు జీవుతాలు సమస్య ఒక్కటే పరిష్కారం కూడా ఒక్కటే
ఇద్దరు మనుషులు కలవడానికి 100 కారణాలు ఉండచ్చు కానీ విడిపోవడానికి మనకి ఒక్క కారణం ఉంటే సరిపోతుంది దానికి స్థాయి కావచ్చు కులం కావచ్చు రూపం కావచ్చు కానీ మనం ఓక మనిషిని ఎంత ప్రేమిస్తున్నామో అదే మనిషి వల్ల మనం అంత బాధపడటం జరుగుతుంది కానీ ఇదే ముగింపు అనుకోవడం మన మూరకత్వం సుబ్రమణ్యం కౌసల్య ఇద్దరు వేరు వేరు జీవితాలు ఒకరికి ఒకరు సంబంధం లేదు కాని చివరికి చేరే మజిలీ గొప్ప తోడు ని ఇస్తుంది
రెండు సంవత్సరాలు క్రితం సుబ్రమణ్యం జీవితంలో ఒక వ్యక్తి ఉండే వారు ప్రేమ పుట్టడానికి కొన్ని క్షణాలు చాలు అలా ఒక రోజు సుబ్రమణ్యం చదువుకునే కాలేజీ లో తన స్నేహితుడు మనోహర్ విడిపోయిన ప్రేమని కలిపేకి సుబ్రమణ్యం సహాయం చేసాడు ఒక రోజు మనోహర్ సుబ్రమణ్యం ఒక చోటు కి మనోహర్ ప్రేమించిన అమ్మాయి ని కలిసెకి వెళ్లారు మనోహర్ కి అప్పటికే ఓకరితో పెళ్లి సంబంధం కుదిరింది
ఆఖరి క్షణంలో సుబ్రమణ్యం మనోహర్ ని తాను ప్రేమించిన అమ్మాయి ప్రణీత ని ఇద్దరిని కలిపాడు అప్పుడు మనోహర్ కి సహాయం చేయడానికి వచ్చిన అమ్మాయి ప్రియ ,మొదటి సారి చూడగానే ప్రియ అంటే సుబ్రమణ్యం కి చాలా చాలా నచ్చేసింది జీవితంలో మనకి అంటూ ఒక తోడు కావాలి అని కోరుకునే ఒకే ఒక్క వ్యక్తి ఉంటారు సుబ్రమణ్యంకి ప్రియ ని చూడగానే అదే అనిపించింది ఒక్క సారి చూడగానే మళ్ళీ మళ్ళీ చూడాలి అని ఎందుకు అనిపించిందో తెలీదు మనోహర్ సహాయం తీసుకుని ప్రియ ని మళ్ళీ ఎలా అయినా కలవాలి అనుకున్నాడు సుబ్రమణ్యం అందుకే మనోహర్ దెగ్గర ప్రియ ఫోన్ నెంబర్ తీసుకున్నాడు కానీ మాట్లాడాలి అంటే ఎదో భయం ,ఈ మధ్యలో మనోహర్ కి అర్థమైంది సుబ్రమణ్యం ప్రియని ప్రేమిస్తున్నాడు అని తన ప్రేమ ని కలిపిన సుబ్రమణ్యం ప్రేమ ఎలా అయినా కలపాలి అనుకున్న మనోహర్ సుబ్రమణ్యం గురించి ప్రియ తో ఎంతో గొప్పగా చెప్పాడు సుబ్రమణ్యం కి ఒక రోజు ఒక మెసేజ్ వచ్చింది చూస్తే అది ప్రియ దెగ్గర నుండి అప్పటి నుండి వల్ల ఇద్దరి మధ్య గొప్ప సంభాషణ నడిచింది ఒక రోజు సుబ్రమణ్యం తన ప్రేమని ప్రియకి తెలిపాడు ప్రియ ఒప్పుకుంది
ప్రియ సుబ్రమణ్యం ప్రేమ ఎంతో సంతోషంగా చాలా కాలం నడిచింది ఒకరు మీద ఒకరి నమ్మకం తోడు ప్రియ కోసం సుబ్రమణ్యం చాలా ప్రేమని చూపించాడు కానీ అంటారు కదా పెద్దలు కడుపుకి మించిన ఆహారం అవసరానికి మించిన డబ్బు అతిగా వచ్చే సంతోషం ఎప్పటికి నిలకడగా నిలవవు అని అంతా బాగున్నా సరే ప్రియ సుబ్రమణ్యం మధ్య ఏదో ఎదో గొడవలు మొదలు ఆయాయ్ కారణం తెలీదు సుబ్రమణ్యం ని ప్రియ రోజు రోజు కి దూరం పెట్టడం చేసింది దాని కారణం ప్రియ చుట్టూ ఉన్న అహంకారమ్ నిండిన స్నేహితులు నువ్వు ప్రేమించే వాడు అలా ఉండాలి ఇలా ఉండాలి అని ప్రేమ కి మనిషి రూపానికి ముడి కట్టారు అది ప్రియ మనసులో బలంగా నాటుకుంద సుబ్రమణ్యం మనిషి రంగు. తక్కువ మొహం అందంగా లేదు అని మొహం మీద అనకపోయిన ఎవరినో అన్నట్టు చెప్తూ ఉండేది అది తననే అంటున్నారు అని సుబ్రమణ్యం కీ అర్థం అయినా సరే తాను ప్రేమించిన అమ్మాయి కదా ఏముందిలే అనుకుని తనలో తాను బాధపడ్డాడు కానీ ఏయ్ రోజు ప్రియని అవమానించలేదు ఏమి చేసినా సుబ్రమణ్యం ప్రియని వదలడం లేదు అని ఒక రోజు మొహం మీద నిన్ను వదిలేస్తున్నా అని చెప్పి సుబ్రమణ్యం జీవితం నుండి వెళ్ళిపోయింది ప్రియా ఆ బాధలో సుబ్రమణ్యం తెరుకోవడానికి ఎన్నో బాధలు పడ్డాడు తన జీవితంలో ఇంకో అమ్మాయికి స్థానం ఇవ్వలేకపోయాడు తన జీవితం కోసం ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టలేక ఇంటి కోసం ఎదో ఒకటి చేయాలి అని కోరుకొని ఉద్యోగం కోసం వెళ్లి కష్టపడి ఒక పని సాదించించాడు కానీ సుబ్రమణ్యం జీవితంలో ఎదో ఒక అసంతృప్తి మిగిలిపోయింది మనం ప్రేమించే సమయం లో పోషించే స్థోమత ఉండదు సంపాదించే సమయానికి ప్రేమించే అమ్మాయి ఉండదు , అలా సాగిపోతున్న జీవితంలో వచ్చిన ఒక వ్యక్తి కౌసల్య కథ మొత్తం అయ్యే సరికి ఆకరిలో వచ్చిన పాత్ర కాని ఎంతో ముఖ్యమైన పాత్ర కౌసల్య రెండు సంవత్సరాలు ముందు ఒక పెళ్లి సంబంధం వచ్చింది అంత అనుకున్న సమయం ఆఖరి క్షణం లో పెళ్ళికొడుకు ప్రేమించిన అమ్మాయితో వెళ్ళిపోయాడు అతను ఎవరో కాదు మనోహర్ కౌసల్య తండ్రి మనోహర్ తల్లి కి సొంత అన్నయ్య కూతురు ని వేరే ఇంటికి ఇవ్వలేక సొంత అల్లుడుకి ఇస్తే కళ్ళ ఎదురుగా ఉంటుంది అనుకున్నాడు కౌసల్య తండ్రి మనోహర్ చేసిన పనికి కౌసల్య తండ్రి పక్షవాతం వచ్చి శరీరంలో స్పర్శ లేక మంచాన పడిపోయాడు ఆ సంఘటన జరిగాక కౌసల్య జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అనుకునింది కుటుంభం పోషించేకి ఎదో ఒక ఉద్యోగం కోసం తిరుగుతుండగా సుబ్రమణ్యం పరిచయం అయ్యింది ఇద్దరికి ఒకే అభిప్రాయం ఉంది అని అర్థమైంది సుబ్రమణ్య కౌసల్య ఇద్దరి వాళ్ల జీవితాల్లో కావలసినవి కోల్పోయారు అప్ఫడు సుబ్రమణ్యం కౌసల్య ఒకే చోటులో పని చేసే వాళ్లు కొన్నాళ్ళుకి పరిచయం మంచి బంధంగా మారింది మంచి స్నేహితులు అయ్యారు సుబ్రమణ్యం గొప్పగా వంట చేయగలడు కౌసల్య చక్కగా లెక్కలు వేయగలదు సరిగ్గా కుర్చుని ఆదా చేయగలడు ఇద్దరు కలిసి వ్యాపారం పెట్టాలి అనుకున్నారు సుబ్రమణ్యం మీద ఉన్న నమ్మకంతో కౌసల్య తనకి అంటూ ఉన్న నగలు తాకట్టు పెట్టి సుబ్రహ్మణ్యంకి ఇచ్చింది సుబ్రమణ్యం కూడా వ్యాపారం కౌసల్య పెరు మీద మొదలు పెట్టాడు ఇద్దరు కలిసి ఉన్న చోటులో రెస్టారెంటు మొదలు పెట్టారు మొదలు పెట్టిన అతి తక్కువ సమయంలో ఎంతో గొప్పగా సంపాదించారు ఒక రోజు కౌసల్య ఇంటికి తీసుకెళ్లి సుబ్రమణ్యంకి తన తండ్రిని చూపించి తన తండ్రి ఎందుకు అలా అయ్యాడు అని చెప్పింది అది విన్నాక సుబ్రమణ్యం చాలా పెద్ద తప్పు చేసా అని బాధతో కుమిలిపోయాడు నా వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాసినం అయింది అని తన మీద తనకే అసహ్యం వేసింది. జరిగిన విషియం అంత కౌసల్యకి చెప్పి నన్ను క్షమించు అని అడగాలి అని అనుకున్నాడు కానీ ఆ విషియం చెప్పాక కౌసల్య సుబ్రమణ్యంని తన జీవితం నుండి వెళ్లిపో అని అంటే సుబ్రమణ్యం తట్టుకోలేడు . ఒక రోజు తన రెస్టారెంట్ కి ఒక అమ్మాయి వచ్చింది తన జీవితం లో అమ్మాయి వల్ల సుబ్రమణ్యం
ఎక్కువ బాధపడ్డాడో ప్రియ అదే అమ్మాయి ఇప్పుడు
సుబ్రహ్మణ్యం కలవాలని వచ్చింది ప్రియ సుబ్రమణ్యం విడిపోవడం కారణం ప్రియ అందరికి తపుగా చెప్పిన సుబ్రమణ్యం ఒక్క మాట కూడా తిరిగి అడగలేదు ప్రేమించిన అమ్మాయి కదా అని వదిలేసాడు అది తనకు అర్థమైంది ఆ బరువు మోయలేక సుబ్రమణ్యం క్షమించు అని ఆడిగేకి వచింది ఇది అంత దూరం నుండి చూస్తున్న కౌసల్య సుబ్రమణ్యం స్నేహితుడు నిఖిల్ ని అడిగింది ఎవరు ఆ అమ్మాయి అని నిఖిల్ జరిగిన కథ అంతా కౌసల్య కి చెప్పాడు సుబ్రమణ్యం కథ విన్నాక కౌసల్య కి సుబ్రమణ్యం మీద ఇష్టం కలిగింది తన జీవితం లో ఇన్ని బాధలు ఉన్న ఒక్క రోజు బాధని పంచుకోలేదు ఒక రోజు సయింత్రం సముద్రం తీరాలు దెగ్గర కూర్చుని చూస్తున్న సుబ్రమణ్యం పక్కన కూర్చుని కౌసల్య అడుగుతుంది . ఏంటి సుబ్బు గారు రోజు ఇంటికి వెళ్లే ముందు బీచ్ దెగ్గర వచ్చి కూర్చుంటారు ఏదయినా విశేషామా లేదా ఏదయినా జ్ఞాపకమా అని అడుగుతుంది మనం ఒకప్పుడు అనుకున్న విశేషాలు ప్రస్తుతం మనకి మిగిలిమ జ్ఞాపకాలు అవుతాయి కౌసల్య నాకు రెండు ఒక్కటే ఈ సముద్రం చూసావా అలలు ముందుకి వాస్తు పోతుంటాయి అన్ని మనకి దెగ్గర అయినట్టే ఉంటాయి కానీ మళ్ళీ వెన్నకి వెళ్లిపోతాయ్ , దానికి కౌసల్య పిచ్చి సుబ్రమణ్యం తీరం ఉన్న అలలు ప్రేమని చూసి ఆధార్ శాశ్వతం అనుకుంటే సముద్రం అంత ప్రేమని చూడలేవు అయ్యా సుబ్రమణ్యం. మనకి జరిగిన వాటిని మార్చలేనప్పుడు మిగిలిన జీవితంలో ఎదో జరిగుతుంది అని ఆశించాలి ఇదే జీవితం అనుకుని ఆగిపోకూడదు అని చెప్పి వెళ్ళిపోతుంది .ఒక రోజు రాత్రి కౌసల్య నాన్న కి ఆరోగ్యం బాలేక శ్వాస ఆడక ఇబ్బంది పడుతున్నాడు కౌసల్య ఆ సమయం లో ఇంట్లో లేకపోవడం అదే సమయం లో సుబ్రమణ్యం ఇంటికి రావడం కష్టపడి కౌసల్య తండ్రిని సుబ్రమణ్యం బ్రతికించడం . కౌసల్య కి ఈ విషియం లో సుబ్రమణ్యం చాలా దెగ్గర అయ్యాడు తన మీద ఉండే ఇష్టం ప్రేమగా మారింది కౌసల్య సుబ్రహ్మణ్యంకి దెగ్గర అవుతుంది ఇలా ఉన్నపుడు సుబ్రమణ్యం రెస్టారెంట్ కి ఒక పెద్ద ఆర్డర్ వస్తుంది చేయగలమో లేదో అనే ఆందోళనలో ఉన్నపుడు చేయగలం అని సుబ్రమణ్యం అందరిని ధైర్యం చెప్పి కష్టపడి మరి అద్భుతంగా వంట చేసి తన హోటల్ పేరుని స్థాయిని పెంచేసాడు దాని వల్ల ఎన్నో లాభాలు వచ్చాయి అంత సంతోషకరమైన సందర్భంలో కౌసల్య సుబ్రమణ్యం తో తన మనసులోని మాట చెప్పాలి అనుకునింది సుబ్రమణ్యం ఒక మాట చెప్పాలి అనుకున్నాడు . ఇద్దరు ఒకరికి ఒకరు చెప్పాలి అనుకునే సమయానికి మణిహార్ ప్రణీత సుబ్రమణ్యం ని కలవడానికి వచ్చారు దూరం నుండి అది కౌసల్య చూసి షాక్ అవుతుంది ప్రణీత పక్కకి వచ్చినపుడు పిలిచినప్పుడు అడుగుతుంది సుబ్రమణ్యం మీకు ఎలా తెలుసు అని మా అన్నయ్య అవుతాడు మా పెళ్లి చేసింది తానే దెగ్గర ఉంది మరి అన్ని చెసురు ఇంట్లో ఒప్పుకోకపోతే తోడుగా ఉండి అన్ని తానే చేసాడు ఈరోజు అన్నయ్య పుట్టినరోజు తనకి జరుపుకోవడం ఇష్టం లేకపోయినా మాకు కలవాలి అనిపించి వచ్చాము అని చెప్పి వెళ్లిపోతుంది. ఇది అంతా జరిగాక సుబ్రమణ్యం కౌసల్య ని చూసి ఎమ్ మాట్లాడాలో తెలియక నిజం చెప్పాలి అనుకుంటాడు . దానికి కౌసల్య వద్దు సుబ్రమణ్యం నేను ఒక్కటే అడుగుతాను దానికి మాత్రం సమాధానం ఇవ్వు నా దెగ్గర నిజం దాచవా లేదా మనోహర్ కి సహాయం చేశావ్ మరి నా జీవితం ఎందుకు ఇలా చేశావ్ నువ్వు చేసిన పని వల్ల 3 సంవత్సరాలుగా మా నాన్న ప్రాణం ఉన్న జీవత్సవంలా పడి ఉన్నాడు ఇంకెప్పుడు ని మొహం నాకు చూపించకు గుడ్ బై అండ్ హ్యాపీ బర్త్ డే సుబ్రమణ్యం ఇంకా నుండి ఈ హోటల్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు అని కౌసల్య వెళ్లిపోతుంది . కొన్ని రోజులుకి తన మావయ్య ఒక పెళ్లి సంబంధం తీసుకుని వస్తాడు 7 రోజులలో కౌసల్య పెళ్లి రెస్టారెంట్లో సగం డబ్బు కౌసల్య పెళ్లికి అని కౌసల్య మావయ్య కి ఇచ్చాడు ఈ డబ్బు తాను ఇచ్చాడు అని కౌసల్యకి చెప్పకండి అని మాట తీసుకున్నాడు . తెల్లవారితే కౌసల్య పెళ్లి సమయం మనకోసం ఎప్పుడు ఆగదు కదా ఇట్టే గడుచిపోతుంది ఇంకో గెంటలో ముహూర్తం కౌసల్య ఇంకొకరికి భార్య అవుతుంది అనుకుంటూ బాధపడతాడు. అదే సమయానికి కౌసల్య వచ్చి సుబ్రమణ్యం పక్కన కూర్చుని ఏవండోయ్ సుబ్రమణ్యం ముహూర్తానికి ఇంకా అరగంట మాత్రమే ఉంది పెళ్ళి చేసుకుందామా అని కౌసల్య అడుగుతుంది . ఆ క్షణంలో కౌసల్యని చూసి సుబ్రమణ్యం ఆనందం లో ఆశ్చర్యపోతాడు . అస్సలు ఏమి జరిగింది అని అడుగుతాడు , 2 రోజులు క్రితం పెళ్లి కోసం బట్టలు కొనేకి వెళ్ళినపుడు ప్రియని కలుసుకున్నాను తను నన్ను చూసి నువ్వు కౌసల్య కదా సుబ్రమణ్యం ప్రేమిస్తున్న అమ్మాయివి అని అంటుంది కౌసల్యకి అర్థం కాలేదు కూర్చుని చెప్తుంది ఆరోజు నేను మీ రెస్టారెంట్ వచ్చినప్పుడు సుబ్రమణ్యం నాకు అన్ని చెప్పాడు తన జీవితంలో దొరికిన గొప్ప ప్రేమ కౌసల్య ఒక్కటే అని కౌసల్య వచ్చాక తను ఒంటరివాడు కాదు నేను ఉన్నాను అని ఒక తోడుగా నువ్వు ఉన్నావ్ అని చెప్పాడు త్వరలో మీ పెళ్లి అని కూడా చెప్పాడు నిజంగా కౌసల్య నువ్వు చాలా చాలా అదృష్టవంతురాలివి నేను చేసిన పేద తప్పు సుబ్రమణ్యం అర్థం చేసుకోకుండా వదిలేసాను కాని నువ్వు అలా కాదు మీరు ఇప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి అనుకుంటున్న అని చెప్పి వెళ్లిపోతుంది . అది విన్నాక కౌసల్య ఎమ్ నిర్ణయం తీసుకోలేని పరోస్థితి వచ్చింది తన తండ్రి దెగ్గర కూర్చుని జరిగినది అంతా చెప్పు ఏడుస్తూ కూర్చుంది అదే సమయానికి అది అంత వినిన కౌసల్యని పెళ్లి చేసుకోపోయే పెళ్ళికొడుకు కౌసల్య కి చెవుతాడు . కౌసల్య మనం జీవితంలో ఎంతో మందిని కలుస్తాం కానీ ఒక్కరిహా మన జీవితాన్ని పంచుకుంటాం అక్కడ తప్పు జరిగితే జీవితం అంత ఇష్టం ప్రేమ లేకపోయినా ఉన్నట్టు నటిస్తూ బ్రతకాలి నువ్వు నా లైఫ్ లో ఒక తోడు అవ్వాలి కానీ కారణం కాకూడదు నువ్వు సుబ్రమణ్యం పెళ్లి చేసుకోడం సరైన నిర్ణయం అని చెప్పి పంపిస్తాడు. అది జరిగిన విషయం కథ కంచికి చేరే సరికి సుబ్రమణ్యం జీవితానికి శుభం కార్డ్ పడుతుంది . కౌసల్యకి సుబ్రమణ్యం మీద ఎటువంటి కోపాలు లేవు అంత కన్నా ఎక్కువ ప్రేమ ఉంది ఇంకా సుబ్రమణ్యంకి తన జీవితం లో పోయిన వాటికి అన్నిటికి దేవుడు వడ్డీ వేసి కౌసల్యగా ఒక మంచి తోడుని ఇచ్చేసాడు మొత్తానికి.
ఇట్లు కౌసల్య సుబ్రమణ్యం కాకుండా
“ మిస్టర్ అండ్ మిస్సెస్ . కౌసల్య సుబ్రమణ్యం ”

Leave a Reply

Your email address will not be published.