366
2

ఆర్టికల్

366

అది 1971 అప్పటికి నా వయసు పాతికేళ్లు, భారతదేశంలో రాజకీయ ఆదిపత్యం కోసం జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్,జనసంగ్ పార్టీలు ఒకరిని మించి ఒకరు ఎత్తుగడలు వేస్తున్న సమయమది. ప్రత్యర్థి పార్టీల నినాదాన్ని తిప్పికొడుతూ “గరీభి హఠావో” అనే నినాదాన్ని దేశనలుములల్లో పలికెలా చేసింది ఇందిరా గాంధీ.అప్పటికే బ్యాంకుల జాతీయకరనతో దేశప్రజల్లో వాహ్ అనిపించుకున్న కాంగ్రెస్ పార్టీ కు ఈ నినాదం మరింత బలాన్ని చేకూర్చింది.

మా నాన్న ఒక పత్రికా ప్రింటింగ్ ప్రెస్ లో రోజు జీతగాడు,అన్నీ పేద,మధ్య తరగతి కుటుంబాలు లాగానే మా కూటుంబానికి రాజకీయాలతో సంబంధం లేదు.రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి మాది.ఎన్నికల సమయం కావడంతో మా నాన్నకి పేపర్ ప్రెస్లో మూడు పూట్ల పనుండేది.ఇంట్లో మూడు పూటలా భోజనం ఉండేది.కుటుంభం పరిస్థితి బావుండడంతో మా నాన్న నాకు పెళ్లి చేద్దాం అనుకున్నాడు.ఆరు అడుగుల ఎత్తు ఉండి జర్నలిజం చదివి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న అని తెలియడంతో పిల్ల దొరకడానికి పెద్ద సమయం పట్టలేదు.

ఈలోగా ఎన్నికలు రానే వచ్చాయి అందరు ఊహించినట్టుగానే ఇందిరా కాంగ్రెస్ అబ్బురు పరిచే అంఖ్యలతో ఘనవిజయం సాధించింది. ప్రపంచం మొత్తం ‘ఇందిరా అంటే ఇండియా,ఇండియా అంటే ఇందిరా’ అనే స్ధాయిలో చేరగరాని ముద్రవేసుకొంది.ఇకపోతే సుజాత తో నా పెళ్లి జరిగింది,ఆమే తెచ్చిన అదృష్టమో ఏమో నాకు వెంటనే “ధా టైమ్స్ ఆఫ్ భారత్”అనే పత్రికా సంస్థలో జర్నలిస్ట్ గా ఉద్యోగం వచ్చింది.

ఈస్ట్ పాకిస్థాన్ లో స్వాతంత్రం కోసం బంగ్లాదేశీయుల నిరసనలు తారాస్థాయికి చేరిన రోజులవి.ఎప్పటినుంచో పాకిస్థాన్ పై అంతర్గంగా కోపంతో రగిలిపోతున్న భారత్ ఇదే సరైన సమయం అని పాకిస్థాన్ పై యుద్ధం చేసి చావుదెబ్బకొట్టింది. మాటలు తప్ప చేతల్లో దూకుడు లేని పాక్ సైన్యం తోక ముడిచి భారత్ ముందు మోకాళ్లు వొంచిందు.రోజు ఎదో ఒక ఆశ్చర్యపరిచే ఆర్టికల్ తో జర్నలిస్ట్ గా నేను మంచి పేరు సంపాదించుకున్నాను, నీతిగా నడుచుకునే స్వభావం ఉండటంవల్ల పెరు మాత్రమే సంపాదించుకున్నాను.పార్లిమెంట్ లో విపక్ష నేత అయిన అటల్ బీహారీ వాజ్పై గారు సైతం ఇందిరా ను పొగడ్తలతో ముంచెత్తుతూ ఆమె ఒక ఖాళీకా అవతారమని ప్రసంగించారు.

అది 1973 యుద్ధం ఖర్చుల ప్రభావమో ఇంకేదో గాని ఉన్నటుగ్గా ఒకేసారి చెమురు ధరలు నింగినంటాయి,ఫలితంగా దేశంలో మెల్లగా కరువు వాటిల్లింది,నిరుద్యోగంతో యువకులు రోడ్డేక్కారు,గ్రామాల్లో ప్రజలు తిండికి లేక విలవిలలాడారు.ఈ సమయంలొనే మా నాన్న ఉద్యోగం ఊడిపోగా నా కుటుంబం మొత్తం నా జీతం మీదనే ఆధారపడాల్సి వచ్చింది.ఇల్లు నడవడం కష్టం అవ్వడంతో నెను,సుజాత పిల్లల్ని కనే ఆలోచన వాయిదా వేసుకున్నాం.1975 వ సంవత్సరం లో బీహార్ కి చెందిన కమ్యూనిస్ట్ నేత జయప్రకాష్ నారాయణ, ప్రజల కరువు నినాదాలకి గట్టి గొంతుగా నిలవడం అదే సంవత్సరం జూన్ 12న అలహాబాద్ హైకోర్ట్ ఆనాటి ప్రత్యర్ధి రాజ్ నారాయన్ చేసిన దాఖలకు అనుకూలంగా 1971 ఎలక్షన్ లో ఇందిరా ప్రచార పనులు చట్ట విరుద్ధం అని,ఆమె గెలుపు చెల్లదని తీర్పు ఇవ్వడంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఇందిరా వ్యతిరేక నినాదాలు భగ్గుమన్నాయి.

న్యాయంగా ప్రజాపక్షాన నిలపడే నా కళం రోజుకో విప్లవ రచనతో ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించింది. పరిస్థితులు తలకిందులు అవ్వకముందే ఇందిరా సుప్రీమ్ కోర్ట్ని ఆశ్రయించి స్టే పిటిషన్ తెచ్చుకుంది.ఒకటో రెండో కేకలైతే అనచపడెనేమో కానీ దేశ నలుమూలాల డొక్క కాలిన కోపపు కేకలు,విప్లవ కవాతులు ప్రగలడంతో ఇందిరా కాంగ్రెస్ కి ఊపిరాడని ఉచ్చులో బిగిసినట్టు అయింది.అది జూన్ 23,1975 నేను రోజు లాగానే నా పనికి వెళ్తున్నా ఇంతలో సెంట్రల్ ఇంటలిజెన్స్ లో బాగా తలపండిన నా స్నేహితుడు ఒకడు మా వీదిచివర డబ్బా కొట్టుకి ఫోన్ కలిపాడు,దేశ చరిత్రను కుదిపేసే వార్త ఒకటి నా చెవిలో ఊదాడు.ఇక అంతే నేను వెంటనే జనఘన నగరాలు ఆశ్యర్యంతో నోరెళ్లబెట్టే ఒక హెడ్లైన్ రాసి పక్కనే నేను రాజకీయ టార్గెట్ కాకుండా ఒక ? మార్క్ పెట్టాను.

మరుసటి రోజు అంటే 24 జూన్ 1975 ఉదయం సుమారు 7 గంటల 30 నిమిషాలు కావొస్తుంది అప్పటికె నా హెడ్లైన్ దేశ రాజకీయాలలో కాంగ్రెస్ చెట్టు వ్రేళ్ళలను సైతం కుదిపేసింది,నిప్పు మీద గుగ్గిలంలా ఆ వార్త ప్రజలను సహనం కోల్పోయేలా చేసింది,గంటల వ్యవధిలొనే ఉద్యమాలు తారాస్థాయికి చేరాయి.పోలీసు  బలగాలు ప్రజా చైత్యనం ముందు నిలవలేక వెనుతిరిగాయి.ఒక సామాన్య మధ్య తరగతి పౌరుడినైన రాసిన రాతలవల్ల అగ్గి రాజుకుంది అని  కేంద్రం లో చర్చలు మొదలయ్యాయి.వెంటనే నేను రాసిన హెడ్లైన్ నిరాదారపు రాత అని అవగాహన లేని ఒక జర్నలిస్ట్ పెరు ప్రఖ్యాతలు కోసం చేసిన ఒక విష ప్రయోగం అని కేంద్రం ప్రజలను మబ్బిపెట్టె ప్రయత్నం చేస్తోంది. నిజం గుట్టురట్టు చేసే నలుపు సిరా తప్ప నల్ల ధనం

మరక పడని నా పెరు మీద, దేశ ద్రోహి ముద్రపడుతుంటే చూస్తూ ఊరుకోలేక నా హెడ్లైన్ కి వెనుక దాగిన ఆధారాలను,నా రాతలకు దన్నుగా ఎన్నో సాక్ష్యాలను సేకరించాను. ఐతే ఇంతలో నాకు తెలియకుండా జరిగిన విషయం ఏంటంటే పోలీసులు నాపై,నా ఇంటిపై నిఘా పెట్టారు.25జూన్ 1975 టైం వేకుజావున 5 గంటలు కావొస్తుంది, నేను నిద్రలో లేచి మా ఇంటి పెరతిలోకి వెళ్ళాను,ఎవో చప్పుడ్లు నా చెవుళ్ళని తడిమాయి అవి ఖాకి గుర్రాల అడుగులు అని నాకు తెలుస్తుంది,ఇంకొద్ది సేపట్లో మా ఇంటి చుట్టూ పోలీసులు మోహరించబోతున్నారు అని అర్ధమైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నానని నన్ను కటకటాల వెనక్కి పంపబోతున్నారు అని ఒక జర్నలిస్ట్ గా ఊహించగలిగాను. ఇక నా రాతలు కేవలం ప్రభుత్వం మీద బురదచల్లే ప్రయత్నం అని నా నోటితో చెప్పేదాక నా బతుకు వేధింపులపాలు అవ్వబోతుంది.నేను చచ్చినా నిజం నాతో చావకూడదు అని నిశ్చయించుకున్నాను.నా దగ్గర సమయం లేదు పోలీసు బృందాలు అప్పటికే మా ఇంటి దగ్గరకు చేరుకున్నాయి. వెంటనే సేకరించిన సాక్ష్యాధారాలు అన్ని ఒక మూటలో కట్టి మా ఇంటి పెరదులో ఉన్న ఇంకుడు గోతిలో పూడ్చిపెట్టాను. ఈ విషయం కానీసం మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు.పోలీసులు రానే వచ్చారు కట్టుబట్టలతో నన్ను ఇంట్లో నుంచి లాకెళ్తున్నారు, పాపం నా సుజాతా కి ఎంజరుగుతుందో అర్ధంకాక కేకలేస్తూ ఏడుస్తుంది.

నేను వెళ్లేముందు సుజాత చెవుల్లో ‘ఇంకుడు గోయ్య మన జీవితాలని మారుస్తుంది’ అని చెప్పి వెళ్ళాను.అది ఆమెకు వినిపించిందా,వినిపించినా అర్ధమయ్యిందా అన్న ప్రశ్నలకు సమాధానం ఆలోచించేలోపలే నన్ను లాఠీలతో సత్కరిస్తూ,రోడ్ల పైకి ఈడ్చుకెళ్లారు.ఆ దెబ్బలకి నా ఒళ్ళు హూనమై మూర్ఛపోయాను.కళ్ళు తెరిచి చూసేసరికి ఒంటి నిండా గాయాలతో,ఖైదీలా కటకటాలలో పడివున్నా.నన్ను అరెస్టు చేసిన తీరు జర్నలిజం స్వతంత్ర హక్కులపై దాడి అంటూ దేశంలో అన్ని మీడియా సంస్థలు ప్రచురణలు మొదలుపెట్టాయి. ఇది చూసిన సామాన్య జనం’ఇందిరా డౌన్ డౌన్’ అంటూ రోడ్లెక్కారు.

కాంగ్రెస్ కి పరిస్థితుల్లో క్లిష్టత అర్ధమయింది,ప్రజలను అడ్డుకోవాలంటే ఒక్కటే మార్గం ఉందని ఆనాటి వెస్ట్ బెంగాల్ సీ.ఎం ఇందిరా చెవిలో ఓ రాజ్యాంగ లొసుగును ఊదాడు. అంతే 25 జూన్ 1975 అర్ధరాత్రి 12 గంటలకు ఇందిరా మాట మేరకు ఆనాటి ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దేశంలో అంతర్గత అల్లర్లు దేశ భద్రతకు ముప్పు అని లొసుగు చూపి ఆర్టికల్ 352(1) అంటే ‘స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ’ ని దేశంలో విదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఎమర్జెన్సీ అంటే ఒక దేశపౌరిడికి పీడకల లాంటిది.ప్రశ్నించే ప్రతి గొంతును నులిపేయడానికి పోలీసు వ్యవస్థకు పూర్తి అధికారాలు ఇచ్చారు.దీక్షలు,నినాదాలు చేసే ప్రతి పౌరుడుని నిర్దాక్షిణ్యంగా అరెస్టులు చేశారు. భారత రాజ్యాంగం లో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేలా కాంగ్రెస్ ప్రభుతం దేశంలో క్రూర రాజపాలన కొనసాగించింది.ఎంతో మంది సామాన్య ప్రజలను,జర్నలిస్టులను తీహార్ జైళ్ళకి పంపింది.పత్రికా స్వేచ్ఛను పూర్తిగా కట్టడి చేస్తూ ‘సమాచార మరియు ప్రచార శేఖ'(ఇన్ఫర్మేషన్ ఎండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ) గుప్పిట్లోకి తీసుకుంది.దేశంలో కాంగ్రెస్ అరాచకాలకు నిండిన కారాగారాలే సాక్ష్యాలు.ఇందిరా తనయుడు సంజీవ్ గాంధి కీచకుడిలా అధికార మత్తులో విర్రవీగుతూ కనిపించిన వాళ్ళందరికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు చేయించాడు.లక్షలాది కొత్త జంటల పిల్లలు కలల్ని చిదిమేసిన పాపం మూటకట్టుకున్నాడు.ఆ రాక్షస ప్రక్రియకి నేను ఓ బడితుడినే.

కొన్ని సంవత్సరాల తరువాత..

21 మార్చ్ 1977 నేను విడుదలయ్యాను,నేను లేని ఈ రెండు సంవత్సరాలు తిండికి కూడా ఎన్నీ కష్టాలు పడిందో నా సుజాత అని తలచుకుంటూ ఆమెని చూసేందుకు ఆగమేఘాలమీద మా ఊరు చేరుకున్నాను.వెళ్లి చూస్తే అక్కడ మా గుడిసెకు బదులుగా ఓ పెద్ద భవనం ఉంది ఆ భవన బాల్కనీలో నా సుజాత నిండా నగలతో మహారాణిలా తిరుగుతుంది.అది చూసిన నేను బ్రమా,నిజమా అర్థంకాక ఆశ్చర్యపోయాను.

ఇంకుడు గొయ్య తన జీవితాన్నీ ఇంతలా మార్చిందా? ఇంతకీ దేశాన్ని కుదిపేసిన ఆ హెడ్లైన్ ఏంటి?

Leave a Reply

Your email address will not be published.

2 thoughts on “ఆర్టికల్

  1. ‘Garibi hatao’ ani first Indira Gandhi ninadam icharu. Tarvatha opposition vallu Indira hatao ani against ga ninadincharu