322
0

ఆర్టికల్-4

322

నా పేరు కృనాల్ సింగ్,కృష్ణయ్యన్ హత్య అనంతరం ప్రభుత్వంపై తీవ్రఆరోపనలు నిరసనలు వెల్లువెత్తాయి, అతడి చావు వెనుకాల అసలు నిజాలు ఏంటో తేల్చిచెప్పాలని ప్రజలు ప్రభుత్వాలని ప్రశ్నించారు.నిజానికి సహజంగా జైలల్లో ఖైదీల హత్యలు మన దేశంలో కొత్తేమి కాదు ప్రతి ఏడాది హత్యలవలనో,అనారోగ్యంవలనో,ప్రమాదాలవలనో వొందల సంఖ్యలో ఖైదీలు చనిపోతుంటారు కానీ ఈసారి జరిగిన హత్యకు దాదాపు దక్షణ భారత దేశం మొత్తం ఒక్క గొంతై పోలీసు వ్యవస్తని అనుమానిస్తు ఒక పటిష్టమైన దర్యాప్తు ఈ హత్యపై జరపాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది.దానికి తలవంచిన ప్రభుత్వం ఆ హత్య వెనుకాల దాగిన నిందితులని త్వరలోనే ప్రజలముందు పెట్టమని నన్ను ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా నియమించింది.ఇకపోతే నా దర్యాప్తులో ఉన్న కృష్ణయ్యన్ అనే వ్యక్తి నాకు తెలియని మనిషికాడు,చాలా ఏళ్ళ క్రితం మద్రాస్ ప్రాంతంలో ప్రజా సమస్యలను ఆయుధంగా చేసుకొని ప్రభుత్వాలపై ప్రజా సైన్యంతో దండయాత్ర చేసిన నిర్భయ యోధుడు అతడు.అప్పుడే కొత్తగా పోలీస్ శేఖలో చేరి మద్రాస్ ప్రాంతములో విధులు నిర్వహిస్తున్న నాకు అతడి ఉద్యమాలు ఎన్నో నిద్రలేని రాత్రులని మిగిల్చాయి. ఒక సామాన్య వ్యక్తిగా కృష్ణయ్యన్ ఆలోచనా విధానానికి అతడి పోరాట స్వభావానికి నేను కూడా అభిమానినే కానీ తన గమ్యాన్ని చేరుకోవడానికి తాను ఎంచుకున్న హింసా మార్గానికి ఒక పోలీసుగా నేను వ్యతిరేకిని.

సామాన్య జనం అనుకున్నట్టుగానే నేను కూడా ఈ హత్య వెనుకాల ప్రభుత్వానికి సంబంధించిగా పెద్ద హస్తాలు ఉన్నాయి అని నమ్ముతున్నాను ఎందుకంటే కృష్ణయ్యన్ దక్షణ భారత దేశంలో కేవలం ఒక ఉద్యమకారుడే కాదు అతడు ఒక్కడే ఒక ప్రభుత్వంతో సమానం,అతడి మాటకి ప్రజలు బ్రహ్మరధం పట్టేవాళ్ళు,ఒక్క మాటలో చెప్పాలంటే అతడు వేలెత్తి చూపిన పార్టీ జెండా భారీ ఓట్ల ఆధిక్యంతో గెలవడం తథ్యం. చాలా సార్లు ఉత్తరాది ప్రాంతం మొత్తం తన గుప్పిట్లో పెట్టుకున్న జాతీయ పార్టీలు కృష్ణయ్యన్ మద్దత్తు కోసం ప్రయత్నించాయి కానీ నిధులు పంపకాలలో ఉత్తరాదితో సమానంగా దక్షిణాది ప్రాంతాలకు న్యాయం జరిగేంత వరకు తాను ఏ జాతీయ పార్టీకి కొమ్ముకాయనని స్పష్టంగా తేల్చిచెప్పడంతో వాళ్ల ప్రయత్నాలు విఫలమయ్యాయి.ఈ కారణంగా కృష్ణయ్యన్ పెద్ద పార్టీలకు ముఖ్య విరోధిగా మారాడు,బదులుగా చాలా సార్లు గుర్తుతెలియని దుండగుల చేతిలో హత్యా ప్రయత్నాలకు లోనయ్యాడు.ఇదంతా తెలిసాక అతడి హత్య వెనుక ప్రభుత్వ హస్తం ఉందని భావించడంలో ఏమాత్రం తప్పులేదు.అంతే కాకుండా స్వీయ రక్షణ కళల్లో ఆరితేరిన కృష్ణయ్యన్ అంత సులువుగా శత్రువులకు తనని మట్టుపెట్టే అవకాశం ఇవ్వడు అదికూడా ఎటువంటి అన్యవ్యక్తులు చొరపడలేని జైలు గోడల మధ్య.కనుక ఇది ముమ్మాటికి ఇంటి దొంగల పనే అని నేను గట్టిగా నమ్ముతున్నాను,పోలీసు రికార్డుల ప్రకారం కృష్ణయ్యన్ ను ఎవరో గొంతు కోసి మట్టుపెట్టారు.సాధారణంగా జైల్లో ఖైదీలకు ఒక్క గుండు సూది దొరికే అవకాశం కాడా ఉండదు అలాంటిది పీక కోసి హత్య చేశారంటే కచ్చితంగా హంతకుడికి బయట వ్యక్తులు ఎవరో సహాయం చేసుండాలి.

కృష్ణయ్యన్ జైలు లో ఉన్న సమయంలో తనకి సంబంధించిన వివరాలు ఇంకా ఆ జైలులో జరిగిన విషయాలు తెలుసుకోవడానికి ఆ జైలు లో పనిచేసిన జైలర్ వీరభద్రయ్యని విచారణకు పిలిపించాను.జైలులో జరిగిన తిరుగుబాట్లు, అక్కడ జరిగిన సమావేశాల్లో కృష్ణయ్యన్ పాత్రేమిటో ఇలా అనేక విషయాలపై వీరభద్రయ్యను ప్రశ్నించి జరిగిన సంఘటనల సారాంశం అంతా తెలుసుకున్నాను.ఎంత తిప్పి చూసినా ఒక్క అనుమానస్పద దారి కూడా కనబడలేదు,పోనీ జైలులో కృష్ణయ్యన్ కి వ్యతిరేకంగా ఎవరైనా శత్రువులు ఉన్నారేమో అని ఆరాతిస్తే అలా కూడా ఎవ్వరు లేరు అని తేలింది.ఎటు చూసినా తెగిన త్రోవలు తప్ప ముందుకి నడిచే ఒక్క ఆధారం కూడా దొరకలేదు.ఇక వేరే కోణం ప్రయత్నించడం తప్ప ఇంకో మార్గంలేదని ఆర్ధమయ్యి వీరభద్రయ్యను బయలుదేరమన్నాను.అతడు వెళ్లిపోతు వెళ్లిపోతూ ‘సార్ చెప్పడం మరిచా జైలులో ఉన్నప్పుడు కృష్ణయ్యన్ తో ఉన్న రిపోర్టర్ ను కలవడానికి ఒకటి రెండు సార్లు ఒక కుర్రాడు వచ్చాడు’అని చెప్పి వెళ్ళాడు.అంతే నాకు వెంటనే ఎడారిలో నీళ్ళ చేరువు దొరికినట్టు అనిపించింది.తెలిసో తెలియకో వీరభద్రయ్య ఈ హత్య విచారణను ముందుకి తీసుకెల్లే ఒక పెద్ద ఆధారాన్నే చెప్పి వెళ్ళాడు.వెంటనే ఏమాత్రం ఆలష్యం చెయ్యకుండా జైలు రిజిస్టర్లను తెప్పించి ఆ నెలల్లో జైలుకి విచ్చేసిన సందర్శకుల జాబితా సంపాదించాను.సుమారు రెండు వందల మంది ఆ జైలుని సందర్శించగా,దాదాపు అందరు పదే పదే జైలుకి వచ్చినట్టు గమనించాను అంటే దాని అర్ధం వాళ్ళు ఖైదీల దగ్గర కుటుంబ సభ్యులు అయ్యుండొచ్చు,కాకపోవచ్చు కూడా కానీ ఏదో ఒక మార్గాన్ని నమ్మి ముందుకు సాగాలి కదా.

ఇకపోతే ఆ జాబితాల్లో మిగిలిన ఒక పది పదిహేను మంది మాత్రం ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తమ వాళ్ళని కలిసేందుకు జైలుకి వచ్చారు,అంటే ఏదైనా పని మీద లేక ఏదో అత్యవసరం పరిస్థితుల్లో మాత్రమే వచ్చి ఉంటారు అని అంచనా వేసాను.అంటె వాళ్లలో ఎవరో ఒకరు ఈ హత్యకు వెనక పాములు కదిపారు అని అనిపించింది.పరుగు పరుగున ఆ కొద్ది మందిని వెతికి పట్టుకునే పని మొదలు పెట్టాను,ఐతే ముందుగా ఒక్క సారి మాత్రమే జైలుకి విచ్చేసిన వారిపైన కన్ను పెట్టాను.దాదాపు ఇరవై రోజులపాటు అనేక రాష్ట్రాలు తిరిగి అందరిని విచారించగా కేసుని ముందుకు తీసుకెళ్లే ఒక్క చిన్న ఆధారం కూడా దొరకలేదు.బదులుగా తిరిగి తిరిగి ఈ కేసుని చేదించలేననే భయంతో కూడిన నీరసం మొదలయింది.రెండో సారి మళ్ళీ ఈ మార్గం తప్పు ఏమో అన్న భావం నాకు కలిగింది,వదిలేసి ఇంకొక్కసారి వేరే విధంగా ప్రయతించాలి అని అనుకున్నాను.కానీ ఎందుకో మనసు ఒప్పుకోలేదు ఒడిపోతున్నా పోటీ ముగిసేదాక పరుగు అపవొద్దని చెప్పుకొచ్చింది.ఇక మళ్ళీ జైలుకి రెండు సార్లు విచ్చేసిన వ్యక్తులను వెతకడం మొదలుపెట్టాను,పనిలో సులువు తెలియడంతో ఈసారి కాస్త త్వరగానే నెట్టుకెల్లాను.అనుమానాస్పద వ్యక్తులలో దాదాపు అందరు దొరకగా ఒక ఇద్దరు మాత్రం నా చేతికి చిక్కలేదు.

చాలా ప్రయత్నాలు తరువాత అందులో ఒక వ్యక్తి మరణించాడని తెలియగా మరో వ్యక్తి రాజస్థాన్ లో ఉన్నట్టు సమాచారం అందింది.ఉత్తరాదిలో ఉన్న రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ జైలులో ఉన్న ఖైదీని కలిసాడంటే కచ్చితంగా ఈ కుట్రలో భాగం అతడు అయ్యుంటాడని అనుకున్నాను.వెంటనే రాజస్థాన్ పోలీసు శేఖని రంగంలో దింపి అతడి ఆచూకీ కోసం గాలింపు మొదలుపెట్టాను.మేము వెతుకుతున్న విషయం అతనికి తెలియకుండా జాగ్రత్తపడుతూ ఒక కచ్చితమైన పన్నాగాన్ని సిద్ధం చేసి రాష్ట్రంలో అన్ని ప్రదేశాల్లో పోలీసు సమాచారకులని పెట్టి గాలింపును చర్యలు ముమ్మరం చేసాం.ఒక రోజు రాజస్థాన్ లో ఎక్కువగా వలస కార్మికులు పనిచేసే సుల్తాన్పూర్ అనే గ్రామంలో గత కొన్ని ఏళ్లుగా తమిళనాడు నుంచి వలస వచ్చి,కుటుంభం,బంధువులు ఎవరు లేకుండా ఒక వ్యక్తి మిఠాయి దుకాణంలో పని చేస్తున్నాడని సమాచారం అందింది.ఆగమేఘాలమీద నేను సుల్తాన్పూర్ చేరుకుని,గుట్టుచప్పుడు కాకుండా ఆ కుర్రాడిని నా అదుపులోకి తీసుకున్నాను.నాకున్న పోలీసు అనుభవంతో చూడగా అతడు ఎందుకో నాకు ఎక్కువ పని చెప్పకుండానే నిజం బయటపెడతాడు అనిపించింది.ఆలస్యం చెయ్యకుండా విచారణ మొదలుపెట్టాను,మొదట కాస్త సమయం అతడు నిజం చెప్పడానికి భయపడి మొండి చేసినా తరువాత కాసేపటికే నా పోలీస్ పద్దతి ద్వారా అతడు గాడిలో పడ్డాడు.మెల్లగా నిజాలు చెప్పడం మొదలు పెట్టాడు.

‘నా పేరు సిద్ధమురుగన్ నేను తమిళనాడు ప్రాంతంలో కడలడై అడివి పక్కనే ఉన్న పార్వతీఅమలై అనే పల్లెలో జన్మించాను.నాకు ఊహ తెలియని వయసులోనే మా నాన్న చనిపోవడంతో నా పెంపకం బాధ్యత అంతా మా అమ్మ మీదనే పడింది.నాకు ఐదేళ్ల వయసులో మా అమ్మ నాతో పాటు మా ఊరిని వదిలి బొంబాయి ప్రాంతానికి వలస వెళ్ళింది,అక్కడికి కొద్ది నెలల్లోనే మళ్ళీ ఎదో కారణంగా తాను వేరే ప్రాంతానికి వెళ్లానని నాతో చెప్పింది,ఐతే ఈసారి నన్ను తనతో తీసుకుపోనని,నన్ను బొంబాయి లొనే ఒక బట్టల కొట్టు సేటు దగ్గర పనిలో పెట్టి తన పని అవ్వగానే మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది.ఆ తరువాత కొన్ని ఏళ్ళు గడిచినా ఎప్పటికీ తాను తిరిగిరాలేదు.ఏరోజుకైనా తాను తిరిగి వస్తుందని ఆశతో చాలా సంవత్సరాలు వేచి చూసాను,ఈ క్రమంలో పొట్ట కూటి కోసం అనేక ప్రాంతాలకి వలస వెళ్లి ఎదో ఒక పని చేసుకొని బ్రతికే వాడిని.అలా కొన్ని సంవత్సరాలు గడవగా ఒక రోజు నేను రాజస్థాన్ లో మిఠాయి దుకాణంలో పని చేస్తుండగా నాకు ఒక ఉత్తరం వచ్చింది.ఒక స్థిరమైన చిరునామా లేని నాకు ఉత్తరం రావడం ఆశ్చర్యం కలిగించింది.ఆ ఉత్తరంలో ఏముంది అని తెరిచి చూడగా నాకు నమ్మశక్యం కాలేదు అది అమ్మ రాసిన ఉత్తరం,కొన్ని ఏళ్ల ముందు నన్ను వదిలేసి వెళ్లిన నా అమ్మ ఇన్నాళ్ల తరువాత నాకు మళ్ళీ ఉత్తరం రాసింది.ఆ ఉత్తరంలో చిన్నతనంలో తాను చెప్పినట్టుగా నా తండ్రి చనిపోలేదని కొన్ని అనివార్య కారణాలవల్ల మా నుంచి దూరంగా వెళ్లిపోయాడని ఇప్పుడు నేను నా తండ్రిని కలిసే సమయం వచింది అని చెప్పుకొచ్చింది.నా తండ్రి హైదరాబాద్ ప్రాంతం లో జైలులో ఖైదీగా ఉన్నాడని, అతడికి ఇప్పుడు నేను సహాయపడే సమయం వచింది అని,కుదిరినంత తొందరగా నేను వెళ్లి నా తండ్రిని కలవాలని ఆమె ఆ ఉత్తరంలో పేర్కొంది.

మా అమ్మ మాట మేరకు నేను కొన్ని ఏళ్ల తరువాత మా తండ్రిని కలవడానికి జైలుకి వెళ్ళాను.మొదటి సారి కలిసినప్పుడు అతడు నాతో తన పరిస్థితులు బాగాలేవని,తనకు నా సహాయం అవసరం అని చెప్పుకొచ్చాడు.నేను నా తండ్రి మీద ప్రేమతో వెంటానే ఎటువంటి సాహాయానికైనా నేను సిద్ధమని చెప్పాను బదులుగా నా తండ్రి తాను త్వరలోనే ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లే ఆలోచనల్లో ఉన్నట్టు దానికోసం తనకి ఎటువంటి పనైనా చేసి పెట్టేలా, జైల్లో ఉండే ఖైదీలల్లో ఒక ఇద్దరు నమ్మకస్తులను తయారుచేయడానికి తగిన డబ్బు ఇంకా వాళ్ళకి కావాల్సిన కొన్ని చిన్న చిన్న ఆయుధాలు మూడో కంటికి తెలియుకుండా సమకూర్చి గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళకి అవి చేర్చేలా ఒక వ్యూహం సిద్ధం చెయ్యమన్నారు.ఇంతకీ తను ఎం చెయ్యాలి అనుకుంటున్నడో కన్కుందాం అని నేను అడగగా,ఆ వ్యూహానికి సంభందించిన విషయాలు చాలా రహస్యమని,ఎంత మాత్రం విషయం బయటకి ప్రాకినా మొత్తం కష్టం వృధా అవుతుందని,అది కేవలం తన స్నేహితుడుకి మాత్రమే తెలుసని,సమయం వచ్చినప్పుడు తన స్నేహితుడే ఆ ఖైదీలతో చర్చింది అమలుచేసే భాద్యత తీసుకుంటాడాని చెప్పాడు.ఆ తరువాత కొద్దీ రోజులకే నేను నా తండ్రి చెప్పినట్టుగా ఖైదీల కుతంబాలకి సొమ్ములు ఇచ్చి వారితోనే చిన్న చిన్న ఆయుధాలను ఖైదీలకు చేరేలా చేసి అంతా సిద్ధం చేసివుంచాను.ఇది తెలుపుదామని రెండో సారి మా తండ్రిని కలిసేందుకు జైలుకి వెళ్ళాను,ఐతే ఈసారి నా తండ్రి,వ్యూహ రచనంతా తన స్నేహితుడే చేస్తాడని,సిద్ధం చేసిన ఖదనమంతా తన స్నేహితుడికె వివరించాలని కోరాడు,తన కోరిక మేరకు ఖైదీల్లో ఎవరెవరు తమకు పనిచేస్తారో,ఎలాంటి ఆయుధాలు వాళ్ళకి చేరాయో అంతా పుసాగుచ్చినట్టు నా తండ్రి స్నేహితుడికి వివరించాను.అక్కడితో నా పని ముగిసిందని ఇక ఈ విషయానికి సంభందించిన వివరాలు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ బయటకు రనివ్వకూడదని నా తండ్రి నాతో చెప్పగా నేను దానికి అనుగుణంగానే వెంటనే ఆ ప్రాంతం వదిలి మళ్ళీ రాజస్థాన్ వెళ్ళిపోయాను’

ఇదంతా విన్న నాకు విషయం పూర్తిగా అర్ధమయింది.ఇప్పటిదాకా ఎటు వెళ్తుందో తెలియని ఈ హత్య కేసు దాదాపు ఒక కొలువుకి చేరింది.ఈ కథలో ఇప్పటిదాకా మంచోడి పాత్ర పోషిస్తున్న కృష్ణయ్యన్ ఏ కథను నడిపిస్తున్న అసలు సూత్రధారి అని నేను నమ్మాను.జర్నలిస్ట్ కి మంచి స్నేహితుడిగా నటించిన కృష్ణయ్యన్ తన చేతికి ఏమాత్రం మట్టి అంటకుండా ఆ జర్నలిస్ట్ కొడుకుని వాడుకొని ఎవరినో హత్య చేయాలనుకున్నాడు.తెలివిగా ఎవరిని హత్య చెయించాలనుకున్నాడో,ఎలా చేయించాలనుకున్నాడో పక్కనే ఉన్న తన జర్నలిస్ట్ స్నేహితుడికి కూడా తెలియకుండా వ్యూహం సిద్ధం చేసాడు.కానీ మధ్యలో ఎక్కడో అతడి వ్యూహం దారితప్పింది,ఎదో పెద్ద సంఘటనే జరిగింది బదులుగా అతడే హ్యతకు గురయ్యాడు.బహుశా ఇతడి హత్యా పన్నాగం ఎక్కడో బయటకి ప్రాకింది దాని ఫలితంగా ప్రత్యర్థి వర్గం రగిలిపోయి కృష్ణయ్యన్ ను మూడో కంటికి తెలియకుండా తన గదిలోనే మట్టుపెట్టుంటారు.అలానే జరిగుంటే కృష్ణయ్యన్ ను హత్య చేసిన ఆ ప్రత్యర్థి బృందం ఎవరు? ఇంతకీ కృష్ణయ్యన్ వాళ్ళను హత్యచేయించాలని ఎందుకు అనుకున్నాడు? అన్న ప్రశ్నలకు సమాధానం నేను వేతకాల్సి ఉంది.

అది తెలుసుకోవడానికి మరొక్కసారి ఆ జైలులో ఉన్న ఖైదీల వివరాలు ఇంకా వాల్ల కుటుంబ వివరాలు పరిశీలించడం మొదలు పెట్టాను.సిద్దమురుగన్ అందించిన సమాచారాన్నిబట్టి కృష్ణయ్యన్ ఆదేశాల మేరకు హత్య చేసేందుకు సిద్ధమైన ఆ ఖైదీలను వారికి సహాయపడిన వాళ్ల కుటుంబాలను గుర్తించాను.వాళ్ళని పట్టుకొని అసలు తమకు ఆదేశాలు జారీ చేసిన కృష్ణయ్యన్ ఏ హత్యకు ఎలా గురయ్యాడు?వాళ్లలో ఎవరైనా కృష్ణయ్యన్ హత్యా వ్యూహాన్ని బయటకు తెలిపారా? అన్న విషయాలను తెలుసుకునేందుకు వాళ్ళని విచారించాలని నిర్ణయించుకున్నాను.

ఇంతలో ఆ ఖైదీల కుటుంబ జాబితాల్లో నాకు కృష్ణయ్యన్ స్నేహితుడు జర్నలిస్ట్ జాబితా కనిపించింది.ఒక్క సారిగా నేను నిర్మించుకోస్తున్న ఈ కేసు విచారణ పేక మేడలా కూలిపోయింది.ఆ జర్నలిస్ట్ కుటుంబ జాబితాలో అతడికి అసలు పిల్లలే లేరని,జైలుకి వచ్చే కొద్దీ నెలల ముందే తనకు కొత్తగా పెళ్లి అయిందని అందులో పొందుపరిచి ఉంది.పోనీ అది తప్పుడు సమాచారం అనుకుందామన్నా,ప్రభుత్వం ఆమోదించిన పెళ్లి ధ్రువీకరణ పట్టంలో తేదీతో పాటు తాను జైలుకి వచ్చిన తేదీ కూడా చాలా స్పష్టంగా అతడికి కొత్తగా పెళ్ళి అయిందని తెలిపాయి.ఇది చూసిన నాకు ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చింది.ఇప్పటిదాకా సిద్ధమురుగన్ చెప్పిన సమాచారం నిజమని నమ్మి ఇక ముందస్తు దర్యాప్తు మొదలుపెట్టాలి అనుకుంటున్న నాకు ఈ కొత్త మలుపు ఉక్కిరిబిక్కిరి చేసింది.అసలు పిల్లలే లేని జర్నలిస్ట్ కి కొడుకునని సిద్ధమురుగన్ చెప్పిన కట్టుకధని నమ్మి పూర్తిగా మోసపోయానన్న నిజం నన్ను రగిల్చేసింది.

వెంటనే అదుపులో ఉన్న సిద్దమురుగన్ ని తోళ్లు ఊడేలా చితక బాదాను,ఎంత చిత్రహింస పెట్టిన తన నోటినుంచి వచ్చిన మాట ఒక్కటే ‘నా తల్లి సాక్షిగా నేను అంతా నిజమే చెప్పాను సర్’ అని.కొట్టి కొట్టి నా చేతులు కాయలు కాసాయి సిద్దమురుగన్ మాత్రం ఒక్క కొత్త విషయం కూడా చెప్పలేదు,తాను చెప్పింది నిజమే అన్న మాటను పదే పదే చెప్పుకొచ్చాడు.విచారణతో విసుగు చెందిన నేను అతడు చెప్పింది నిజమో లేక అబ్బాధమో తేల్చుకోవాలని సిద్దమురుగన్ ని జైలులో ఉన్న తన తండ్రిని కలవమని చెప్పిన తన తల్లి ఎవరో చెప్పమని ఆరాతీసాను.అప్పుడు సిద్దమురుగన్ తన జేబులో ఉన్న తన తల్లి ఫోటోను తీసి నాకు చూపించాడు.

వంద రైళ్ల వేగంతో నా గుండె పరుగులు పెట్టింది.హోరు గాలి మొగుతునట్టు నా చెవులకు ఏవో వింత శబ్దాలు వినిపించాయి.మండు సూర్యుడు నెత్తి మీదనున్నట్టు నా ఒంటి నిండా మూడు చెరువుల చెమటలు కారాయి.అప్పటిదాకా ఎప్పుడూ పెద్దగా భయపడని నాకు,ఆ ఫొటోలో ఉన్న వ్యక్తిని చూడగా చేతులు వణికాయి.నా నోట మాట రావడంలేదు.ఏవేవో పాత చిత్రాలు నా కళ్ళ ముందు మెదులుతున్నాయి.ఆమె…ఆమె… కాటు కోమగల్ ‘కొప్పెరుందేవి’,,,ఆమె  “కొప్పెరుందేవి”

ఎవరా కొప్పెరుందేవి?

ఈ హత్యకు ఆమెకు సంభందం ఏంటి?

part-5

Leave a Reply

Your email address will not be published.