313
1

ఆర్టికల్-3

313

నేను నా సుజాత ని ఆ అద్దాల భవనంలో లో చూసి ఆశ్చర్యపోతూ మెల్లగా లోపలికి నడిచాను.రెండేళ్ల పడిగాపులు తరువాత నన్ను చూసిన నా భార్యామని ఎంతో సంబరంగా పరుగులు తీస్తూ వచ్చి నన్ను హత్తుకుంది, పిచ్చి తల్లికి పాపం నేనంటే ఎంత ప్రేమో!మదిలో ఎన్నో సందేహాలు ఉన్న ఆ నిమిషంలో ప్రాణానికి హాయి కలిగించే కొన్ని ముచ్చట్లు తప్ప నేను నా భార్యతో ఏమి మాట్లాడలేదు.జైలు కూడుకి అలవాటు పడ్డ నా ప్రేగు హఠాత్తుగా పరమాన్నాల వాసనలకు ఆనంద కేకల తేన్పులు పెట్టాయి. ఆరోజు రాత్రి  నాలో ఎన్నో జవాబు తేలని ప్రశ్నలు,ఎన్నో విడదీయలేని చిక్కుముడులు,పొద్దుకాస్తే నిద్రలేచి వెంటనే నా సుజాతను ఎం జరిగిందో అడిగి అంతా తెలుసుకోవాలని నేను సిద్ధపడ్డాను.

భానుడు నిద్రలేచాడు,నేను నిద్రపట్టని కళ్ళని పులుముకుంటూ లేచి నా సుజాత కోసం ఇల్లంతా వేతుకుతున్నాను,అక్కడే మా ఇంటి గుమ్మం ముందు ఆ రోజు వార్తా పత్రిక పడివుంది.అలవాటు ప్రకారం అది చేతుకందుకొని పైపైన ముఖ్యాంశాలు చదువుతున్నాను,తిప్పి చూస్తే రెండో పేజీలో 

‘సీనియర్ జర్నలిస్ట్ అయిన పట్టాభి రామయ్య గారు తన రాజకీయా రంగప్రవేశం ఉద్దేశం ఎంటో తెలియజేయడానికి ఈనాడు మన గ్రామంలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు’ అన్న విషయం చదివాను.ఎందుకో అసలు చిక్కుముడి పటేల్ చుట్టూ బిగిసి ఉందని అది విప్పితే మొత్తం విషయం బయటపడింది అని నాకు అర్ధమయింది.వెంటనే బయలుదేరి పటేల్ నిర్వహిస్తున్న సమావేశం జరిగే చోటుకి చేరుకున్నాను,జాతీయ స్థాయిలో సీనియర్ జర్నలిస్ట్ గా మంచి పేరు ప్రఖ్యాతలు పొందటం వలనేమో పటేల్ సభకు జనం నేను ఊహించని సంఖ్యల్లో హాజరయ్యారు.అక్కడ పరిస్థితులు చూస్తుంటే ప్రజలు ఎంతో ఆశగా తమ కష్టాలని పట్టించుకునే కోత్త నాయకుడు వస్తున్నాడని వేచిచూస్తున్నట్టు అనిపించింది.ఇంతలో రానే వచ్చాడు నా పాత స్నేహితుడు పట్టాభి రామయ్య అలియాస్ పటేల్,అతడు అప్పటికి సమాజంలో ఒక ప్రముఖ వ్యక్తే కానీ రాజకీయ నాయకుడు కాదు,కాని ప్రజల్లో తాను పుట్టించిన మాటల నమ్మకం అతనికి జనం నీరాజనాలు పట్టేలా చేసింది.వేదిక అలంకరించిన పటేల్ తాను ఎందుకు రాజకీయ రంగప్రవేశం చేద్దాం అనుకుంటున్నాడో చెప్పసాగడు.

‘కుమ్మరి కులం లో పుట్టిన నేను పొట్ట కూటి కోసం జాలరి పని చేసాను,నేతల పని చేసాను,నిజానికి పిడికెడు అన్నం కోసం ఇదే ఊరి రోడ్ల మీద చెప్పులు కుట్టుకుంటూ పెరిగాను.నేను ఓ అనాథని కష్టమొస్తే ఏ దేవుడికి మొక్కాలో కూడా చెప్పడానికి ఎవరు లేరు.నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే నాకు కులం లేదు,మతం లేదు ఉన్నదల్లా ఒక్కటే సమాజాన్ని మార్చగలనన్న నమ్మకం.నిక్కరు తొడిగిన రోజుల నుంచి నాలో ఎప్పుడు రగిలేది ఒకే విషయం సమాజంలో జాతి,కుల,మత,స్థాయి పేరిట జరిగే అణచివేత.ఈ సమాజంలో మార్పు రావాలంటే అన్యాయాన్ని ప్రశనించే గొంతును అవ్వాలి అని ఎన్నో కష్టాలు పడి జర్నలిజం చదివాను,కానీ 15 ఏళ్ళ జర్నలిజం ప్రయాణంలో నేను తెలుసుకున్నది ఎంటంటే ప్రశ్నించే గొంతు ఎంత అరిచినా పాలించే నాయకులు చెవిట పెట్టకపోతే మార్పు అసాధ్యం.కనుక నేను నిశ్చయించుకున్నాను నా జీవితంలో మిగిలిన కాలం రాజకీయాల్లో ప్రజలకు సేవ చేస్తూ,సమాజ మార్పు దారులు చూపేలా తొలి అడుగులు వేద్దామని’.అతడి పై అనుమానం ఉన్న నాకే ఈ మాటలు విన్నాక అతడు ఎంతో మంచిమనసుతో రాజకీయ రంగప్రవేశం చేస్తున్నాడెమో అనిపించింది ఇంక అక్కడి ప్రజలైతే పటేల్ ఏ ఇకపై తమ బాతుకుల్ని బాగుపరిచే నాయకుడి అని నూరుపాళ్లు నమ్మారు.అప్పుడే దూరంగా జనంలో ఉన్న నన్ను వేదిక పైన ఉన్న పటేల్ అనుకోకుండా చూసాడు,నన్ను చూస్తూ ‘ప్రతి మనిషిలోను ఎదో సాధించాలన్న ఒక ఆశయం ఉంటింది కానీ ఆ ఆశయానికి చేరుకునే మార్గంలో కాలం ఎన్నో పరీక్షలు పెడుతుంది,ఏ జంకు లేకుండా ఆ పరిక్షలని ఎదుర్కోవడానికి ప్రతి మనిషికి నేను ఉన్నాను అని ప్రోత్సాహం ఇచ్చే ఓ స్నేహితుడు తమ జీవితంలో ఉండాలి,అలంటి పరిక్షలే నా జీవితంలో ఎదురైనప్పుడు నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ నాకు దన్నుగా నిలిచాడు ఓ స్నేహితుడు’ అని చెబుతూ జనంలో ఉన్న నన్ను వేలెత్తి చూపిస్తూ,వేదిక మీదకు పిలివసాగాడు.ఆ నిమిషం లో అక్కడ ఎం జరుగుతుందో పిసరంత కూడా నాకు అర్ధంకాలేదు,కానీ పటేల్ పిలుపు మేరకు మెల్లగా వేదిక మీదకు నడిచాను.అప్పుడు పటేల్ నా చేతిని పట్టుకొని ‘అన్ని చోట్లా మన కష్టాలను వినడానికి భగవంతుడు ఉండడు కాబోలు అందుకే ఇలాంటి మంచి వ్యక్తులను మనకి తోడుగా మన మధ్య వదిలి వెళ్ళాడు ఆ భగవంతుడు,కనుక రేపు రాబోయే ఎన్నికల్లో నా తరుపున ఈ గ్రామం నుంచి నా స్నేహితుడు బరిలోదిగుతాడు’ అని చెబుతూ నా చేయి పట్టుకొని గాల్లో పిడికిలి పిడుగులా చూపిస్తూ ప్రసంగం ముగించాడు.అసలే అనుమానం ఇంతలో వేదిక మీదకు ఆహ్వానం దానికి తోడు రాజకీయ నాయకత్వ అవకాశం,ఇది ఏ కోణంలో చూసినా నాకు ఇసుక రవ్వంతైన నమ్మశక్యంగా లేదు,కానీ జరిగిన నిజం అదే.నా ఆలోచన పక్కన పెడితే అక్కడికి హాజరైన ప్రజలంతా అసలు ఈ నిర్ణయాన్ని ఎలా తీసుకుంటారో చూద్దాం అని తిరిగి చూసాను,నా మీద నమ్మకమో లేక పటేల్ మాటకి ఉన్న విలువో నాకు తెలీదుగాని అక్కడి ప్రజలు నన్ను తమ హృదయపూర్వకంగా అంగీకరించారు అది వాళ్ల మొహాన నవ్వుల్లో తెలుస్తుంది.

ఒకవైపు కృష్ణయ్యన్ చావు,మరో వైపు నా సుజాత ఉంటున్న అద్దాల మేడ ఎలా వచ్చాయో తెలియక సతమతమవుతున్న నాకు ఇప్పుడు కొత్తగా పటేల్ ఎందుకు నన్ను రాజకీయాల్లోకి నెడుతున్నాడో తెలియక గంగతగోళంలో ఇంటికి నడవసాగాను.ఆకలితో ఇంటికి చేరుకుని ‘త్వరగా కాస్త భోజనం వడ్డించు’ అని గదిలో ఉన్న సుజాతకు వినిపించేలా చెప్పి టి.వి ముందు కూర్చున్నాను,అందులో కూడా అప్పుడే ముగిసిన పటేల్ ప్రసంగ వార్తలు ప్రసంగం అవుతున్నాయి.ఆకలి వేస్తుండడంతో మళ్ళీ ‘సుజాతా త్వరగా వడ్డించు ఆకలేస్తుంది’ పిలిచాను,కాసేపు గడిచింది టి.వి లో పటేల్ ప్రసంగం కొనసాగుతుంది ఇంకా సుజాత భోజనం పెట్టడంలేదు ఏంటి అనుకుంటూ ఉన్న సమయంలో ఒక పెద్ద పళ్లెం కింద పడిన శబ్దం వంటగదిలో వినిపించింది.ఏమైందో ఎంతో అని వెంటనే నేను ‘సుజాతా..సుజాతా..ఏమైంది’ అని కేకలు పెడుతూ వంటగదికి పరుగులు తీసాను.వెళ్లి ఆ గదిలో దృశ్యాలు చూడగా ఒక్కసారిగా నించున్న చోటే కుప్పకూలాను,నా సుజాత గొంతు తెగి రక్తం పారుతూ కొణఊపిరితో కొట్టుమిట్టాడుతుంది.అరసెకెను పాటు నా లోకం స్తంభించింది,ఎం జరిగిందో అన్న ఆలోచన పక్కన పెట్టి ముందు నా సుజాతను ఎలా కాపాడు కోవాలో ఆలోచించాను కానీ నా సుజాతకి దేవుడు రాసిన రాత అంతే ఏమో అప్పటికే ఆఖరి సారి కనురెప్ప ఆర్పుతుంది.గుండె నిండా దుఃఖంతో తనని న వడిలోకి తీసుకొని బోరున ఏడ్చాను.ఎం జరిగింది సుజాత అని తెలియని ఆక్రోశంతో అరుస్తున్నాను.తుది శ్వాస విడిచే ముందు సుజాత కష్టంగా రక్తపు మడుగులో ఉన్న తన చేతిని లేపి ఎదురు గా ఉన్న గది గుమ్మాని చూపిస్తూ కన్ను మూసింది.ఆ నిమిషంలో నా మనసుకు పుట్టెడు బాధ తో కుములిపోవడం తప్ప ఇంకేమి తోచలేదు.

కొద్ది రోజులు గడిచాయి,ఆ నాలుగు గోడల మధ్య ఒంటరితనం నాకు అలవాటయింది, ఇంట్లో ఎప్పుడు ఎదో ఒక అలికిడి చేసే న సుజాత లేక ఇల్లు అంత బోసిపోయింది.ఎంత నెమరువేసుకున్నా అసలా సుజాత హత్య పట్ల ఒక్క అనుమానితమైన సంఘటన కూడా నాకు తట్టడంలేదు.ఆలోచిస్తూ అలా వంతగదికి నడిచాను,సుజాత రక్తం మడిలో పడివున్న దృశ్యాలు ఇంకా నా కళ్ళ ముందే ఉన్నాయి.అప్పుడే సడన్ గా ఇంటికి పొద్దున్నే పోయిన విద్యుత్ సరఫరా వచ్చింది,వేసి ఉన్న బల్బులు,ఫ్యాన్లు అన్ని ఒకేసారి మొదలయ్యాయి,ఎదురు గదిలో టి.వి కూడా ఎదో శబ్దం చేస్తూ మొదలయింది,అలా వంట గదినుంచి తిన్నగా నడుస్తూ వెళ్లి టి.వి ఆర్పేశాను,అయినాక అలా వెనక్కి తిరిగి చూస్తే నాకు ఉన్నపాళ్లుగా ఎదో తట్టింది.అలా అటుగా వంట గదిలోకి తిన్నగా చూస్తే అక్కడ నాకు సుజాత చనిపోయే ముందు ఈ గదిని చూపిస్తూ కన్ను మూసిన దృశ్యాలు ఎదురయ్యాయి.వెంటనే మళ్ళీ వంట గదికి వెళ్లి చూసాను,అక్కడ నుంచి చూస్తే నాకు కేవలం ఆ ఎదురు గదిలో టి.వి మాత్రమే కనిపిస్తుండు,ఎందుకో సుజాత నాకు ఆ టి.వి ని చూపిస్తూ కన్ను మూసింది అని గట్టిగా అనిపించింది.

ఆ గదిలి ఏమైనా ఉందా,లేక ఆ టి.వి లిప్ ఏమైనా ఉందా అని నన్ను నేను ఆరాదీసుకున్నాను.గది మొత్తం వెతికాను ఎక్కడా ఏమి అనుమానంగా లేదు.ఇక పోతే టి.వి లొనే ఎదో విష్యం ఉందని అర్ధమయ్యింది.ఆ రోజు జరిగిన కథనం అంతా మళ్ళీ మళ్ళీ ఆలోచించుకున్నాను,అసలెక్కడా ఏమి అనుమానాస్పదంగా అనిపించలేదు.అప్పుడే నాకు ఒక విషయం గుర్తొచ్చింది ఆ రోజు నేను ఇంటికి వచ్చాక టి.వి లో పటేల్ ప్రసంగం చూస్తూ కూర్చున్నాను.బహుశా సుజాత ఆ టి.వి లో నాకు పటేల్ ని చూపించిందేమో? నా మెదడుకి దొరికిన ఆ కొన్ని తెగిన దారపు ముక్కలను ముడివెయ్యగా నాకు అర్ధమైంది ఏంటంటే ఆ ఆఖరి నిమిషాల్లో సుజాత పదే పదే ఆ టి.వి లో ప్రసంగిస్తున్న పటేల్ నే చూపించింది.మళ్ళీ నాలో ఎదో సందేహం,పటేల్ కి న భార్యను చంపే అవసరం ఏముంది? పైగా ఆరోజే పటేల్ నన్ను ఎంతో పొగుడుతూ రాయకీయాల్లో అడుగుపెట్టేలా చేసాడు.

నా చుట్టూ నడుస్తున్న పద్మవ్యూహం నాకు ఎంతమాత్రం అర్ధం కాలేదు,కానీ గుండెనిండా ఈ వ్యవస్థ పట్ల కోపం,ఈ సమాజంలో అన్యాయం పట్ల అసహనం పుట్టుకొచ్చింది.వ్యవస్థలో జరిగిన తప్పుల్ని,ఒక మతం మీద జరపాలనుకున్న అణచివేతను ఖండిస్తూ “హిందూస్తాన్ లో ముస్లిం మనుగడ ఉండబోదా?” అని నేను రాసిన వార్తకు నా బతుకుమీద ఇంత కుట్ర పన్నుతారా? నిజానికి ఆ రోజు ఫోన్ లో ‘దేశం మొత్తం కరువుతో అల్లర్లు చెలరేగడం,ఇందిరా పదవికి కూడా ముప్పు రావడం వల్ల దిక్కుతోచని ప్రభుత్వం ఎలా అయిన ప్రజల్ని మళ్ళీ తమ వైపుకి తిప్పుకోవడానికి మరలా వాళ్ళని మబ్బి పెట్టె పన్నాగం ఒకటి పన్నుతుంది.ఇప్పటికే దేశంలో అన్ని చోట్లా హిందు ముస్లిం వర్గాల మధ్య విభేదాలు చాప కింద నీరులా మెల్లగా తార స్థాయికి చేరుతున్నాయి.ఇరు వర్గాలు ఒకరి అంతం ఒకరు కోరుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి.ఐతే దేశంలోఎక్కువ శాతం హిందు మతానికి సంబంధించిన ప్రజలు ఉండటంతో వల్ల వాళ్ల మన్నన పొంది మళ్ళీ పార్టీకి పూర్వ భలం చేకూర్చి తన పదవిని కాపాడుకోవాలని దేశంలో ఉన్న ముస్లిం మతస్తులకి భారత పౌరసత్వం రద్దు చేసే ఆలోచనలతో కేంద్రం పాములు కదుపుతోంది’ అని పటేల్ నాకు వార్తను అందించాడు.ఒకే మతంలో పుట్టకపోయిన తోటి ముస్లింలను సోదరులుగా భావించే నేను ఈ వార్తను తట్టుకోలేక ప్రజల్ని చైతన్య పరుచేలా ఆ రోజు ఆ ఆర్టికల్ రాసాను.కానీ ఇప్పుడు అదే పటేల్ ఎందుకు నా బతుకుమీద చీకట్లో పగపడుతున్నాడో నాకు ఏమాత్రం అర్ధంకాలేదు.నా మీద అంత పగే ఉంటే నన్ను రాజకీయాల్లోకి నాయకుడిగా ఎందుకు ఆహ్వానిస్తున్నాడో ఇంకా అర్ధంకాలేదు.

చుట్టూ పతిస్థితులు కారణంగా ‘నా’ అన్న మనుషులు దూరం అవ్వడంవల్ల నాలో పూర్తిగా సహనం మట్టుకలిసింది.ఎలానైన ఈ కుట్ర రాజకీయాలని మార్చాలని తేల్చుకున్నాను,ఆరు నూరైనా రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు సాధించాలని రేయింపగల్లు శ్రమించాను.గ్రామంలో ఇంటి ఇంటికి వెళ్లి నాకు జరిగిన అన్యాయాన్ని చెప్పాను,ఐతే ఎక్కడా పటేల్ మీద ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు ఎందుకంటే ప్రజలు అప్పటికే పటేల్ ను పోర్టు స్థాయిలో నమ్మారు. ఎన్నికలు గెలిచాక పటేల్ నిజస్వరూపం బట్టబయలు చేద్దాం అని వేచిచూసాను.జైల్లో నా విప్లవ మార్గాన్ని మెచ్చిన ఎంతో మంది ప్రజలు నాకు ఎన్నికల్లో అనుకూలంగా నిలిచారు.నీతి పరుడైన జయోర్నలిస్ట్ గా,విప్లవ మార్గం ఎన్నుకున్న ధైర్యశీలి గా ప్రజలు నన్ను పూర్తి స్థాయిలో నమ్మారు.ఫలితాలు రానే వచ్చాయి ఊహించినట్టుగానే ప్రజలు నాకు బ్రహ్మరథం పట్టారు,కనీవినీ ఎరుగని రీతిలో భారీ మెజారిటీతో నేను ఎన్నికల్లో గెలుపొందాను.

పద్దతి ప్రకారం పటేల్ నన్ను అభినందించడానికి మా ఇంటికి వచ్చాడు,ఎందుకో నా గెలుపుకు అతడు చాలా సంతోచిస్తున్నట్టు తన మొహంలో ఎదో ఆనందం.ఇదంతా పక్కన పెట్టి అసలా కృష్ణయ్యన్ ను నా సుజాత ను ఎందుకు హత్య చేయించాడో ఆడిగి తేల్చుకుందాం అని సిద్దంమయ్యాను ఇంటలోపలే పటేల్ ఇంకుడు గోతిలో నేను పాతిపెట్టిన ఆధారాల పత్రాల పై ‘ఈ పాత్రలు పటేల్ కి చేరాలి’ అని రాసియున్న మొదటి పేజీ నా ముందు పెట్టి “నన్ను క్షమించు మిత్రమా, నీ భార్య మొదట ఆ ఆధారాలు పట్టుకొని నన్ను సంప్రదించింది, నేను అవి చాలా విలువైనవి వాటిని రహస్యంగా భద్రపరచాలని లేకపోతే నీ భర్త ప్రాణానికి,నా ప్రాణానికి కూడా ముప్పు అని చాలా స్పష్టంగా చెప్పాను.ఐనా డబ్బుకి ఆశపడి నీ భార్య ఆ ఆధారాలను ప్రభుత్వానికి పనిచేసే దళారీలకు భేరం పెట్టింది,ఇదిగో ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ ఇల్లు ఆ డబ్బు అంత అలా వచ్చిన సొమ్మే.కర్మ ఫలం ఎన్నటికైనా తిరిగి వస్తుంది అన్నట్లు నీ భార్య తాను తీసిన గోతులో తానే చిక్కుకుంది తోడుగా మన ఇద్దరి బతుకులు కూడా ప్రమాదంలో పడేసింది.ఆ ఆధారాలు చేజిక్కించుకున్న ప్రభుత్వ పెద్దలు ఆ విషయం ఇక ఎప్పటికి బయటకి రాకుండా వాటి నమూనాలని,అందులో విషయం తెలిసిన నిన్ను,నన్ను,నీ భార్యని పూర్తిగా భూస్తాపితం చెయ్యాలి అనుకున్నారు.జైలులో నీ మీద హత్యా ప్రయత్నానికి ముందు నన్ను కొంతమంది అపరిచితులు కలిసారు,జైలులో ఉన్న నిన్ను బయట నీ భార్యని మట్టుపెట్టి,ప్రభుత్వం తరుపున నేను రాజకీయాల్లో పనిచేస్తే నన్ను ప్రాణాలతో వదిలేస్తామని ఒప్పందం చేసుకున్నారు.ప్రాణానికి ఆశపడి నేను నిన్ను చంపే ప్రయత్నం చేసాను అదృష్టంగా నువ్వు తప్పించుకున్నావ్,కృష్ణయ్యన్ అనుకోకుండా బలి అయ్యాడు,ఇంతలోనే నువ్వు జైలునుంచి విడుదలయ్యావ్ దాంతో నాకు గుర్తుతేలియని వ్యక్తులనుంచి ఒత్తిడి పెరిగింది.ఈసారి నిన్ను నీ భార్యని కలిపి ఒకేసారి కధ ముగించాలి అనుకోని మీ ఇంటికి మందిని పంపాను,ఊరి జనం అంతా నా సమావేశంలో ఉండగా మూడో కంటికి తెలియకుండా మీ పని ఎవరి కంటా పడకుండా సులువుగా అయిపోతుంది అనుకున్నాను కానీ మళ్ళీ నీ అదృష్టం బాగుండి ఆరోజు నువ్వు ఇంట్లో లేవు.సమావేశంలో నిన్ను చూసి నేను ఆశ్చర్యపడ్డాను అప్పుడే ఆ వేదిక మీదనే నాకు ఒక ఆలోచన వచ్చింది.నిన్ను కూడా రాజకీయాల్లో పెట్టి ప్రభుత్వానికి అనుకూలంగా పని చేయిస్తే నిన్ను,నన్ను ఇద్దరిని ప్రాణాలతో వదిలేస్తారు ఆశపడ్డాను.అనుకున్నట్టుగానే నిన్ను రాజకీయాల్లోకి నెట్టాను,పెద్దల దగ్గర ఇకపై నివ్వు వల్ల మనిషివని వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటావ్ అని వాళ్ళకి చెప్పాను.అదృష్టపుషాత్తం నువ్వు ఎన్నికల్లో గెలిచావు,ఇకపై నీ ప్రాణానికి నా ప్రాణానికి ఎటువంటి హాని ఉండబోదు.బహుశా మళ్ళీ మనం కలవకపోవచ్చు,నన్ను క్షమించు మిత్రమా కనీసం నిన్నైనా ప్రాణాలతో కాపాడుకోవడానికి ఈ దారి తప్ప నాకు ఇంకేం కనిపించలేదు” అని చెప్పాడు.

టిక్..టిక్,టిక్..టిక్!!(తలుపు శబ్దం)

ఎవరు????

ఇన్స్పెక్టర్ సాబ్ నేను కానిస్టేబుల్ రంగయ్య చాయ్ తెచ్చాను సాబ్.

హ హా రంగయ్య ఒక్క రెండు నిమిషాలు నేనె వస్తున్నా.

(చాయ్ తాగుతూ…)

రంగయ్య ఇన్స్పెక్టర్ కృనాల్ సింగ్ ఢిల్లీ నుంచి వస్తా అన్నారు కదా? వచ్చారా?

లేదు సాబ్ బహుశా రేపు వేస్తారేమో!

సాబ్ ఇంతకీ లోపల అతను ఏమైనా చెప్పాడా?

మొత్తం తన జీవితం చేపడయ్యా.

ఏమైనా ఉపయోగపడుతుందా సాబ్ కేస్ కి?

లేదయ్యా ఇతను నిజాంగానే చాలా మంచి వ్యక్తిలా ఉన్నాడు మనమే ఎక్కడో తప్పు చేసాం అనిపిస్తుంది!

అంటే అతను చెప్పింది అంత నిజమే అంటారా సాబ్?

అతను చెప్పిందంతా నమ్మశక్యంగానే ఉంది రంగయ్య కానీ ఒక్క విషయం మాత్రం ఎందుకో నాకు అనుమానంగా ఉంది.

ఏంటి సాబ్ అది?

మొదటి సారి హత్యా ప్రయత్నం జరిగినప్పుడు ఇతనికి జరుగుతున్న కుట్ర ఏమాత్రం తెలియకుండా అంత కరెక్ట్ గా ఆ రోజు కృష్ణయ్యన్ బదులు ఇతను ఎందుకు బయటకెళ్లాడు? అది కూడా ప్లాన్ మారింది జైల్లో ఎవ్వరికీ చెప్పకుండా! పోనీ అదృష్టం బాగుండి వెళ్ళాడు అనుకో రెండో సారి ప్రయత్నం జరిగినప్పుడు కూడా కరెక్ట్ గా అదే రోజు ఇంటి నుంచి బయటకు ఎలా వెళ్ళాడు?

అంటే ఎప్పుడు ఇతనే ఇదంతా చేసాదంటారా సాబ్?

లేదు రంగయ్య పటేల్ జాడ తెలియనంత వరకు ఎవరిని అనుమనించలేం, అతను దొరికెంత వరకు మనం వేచి చూడాల్సిందే..!


PART 4

Leave a Reply

Your email address will not be published.

One thought on “ఆర్టికల్-3

  1. Akhil sir,
    I heard that BEAUTY LIES IN SIMPLICITY but you proved it through your writings. I read most of ur writings in storyvalut(REX,IAM,RED CLOAK)…. are amazing. May u come up with more wonderful stories!!