363
16

ఆమె నాకు కనిపించింది(పార్ట్ – 2)

363

అక్కడ చెట్టుకు వేలాడుతున్న శవం ముఖం ఎవరిదో కాదు…………… ‘అది రవి దే’. ఆ మొఖం రవిది కావడంతో, భయంతో పరిగెత్తిన రవి కి దూరం లో ఒక తెల్లని ఆకారం కనిపించింది. రవి ఆ తెల్లని ఆకారం వైపుగా వెళ్ళాడు. రవి ఎంత నడిచినా ఆ ఆకారం అంతే దూరంలో కనిపిస్తుంది, అలా ఉండగా ఒక పాడుబడిన ఇల్లు కనిపించింది . రవి ఆ ఇంటి తలుపు దగ్గరికి వెళ్ళాడు. ఆ ఇంటి తలుపు తట్టే లోపే, అది తనకు తానే తెరుచుకుంది. రవి తలుపు కాస్త ముందుకు తోసి లోపలికి చూసాడు. ఎవరైనా ఉన్నారా! అని గట్టిగా ఆరవ గా ఇంటి లోపల నుండి కొన్ని గబ్బిలాలు రవి మీదుగా వచ్చి వెళ్లిపోయాయి. రవి ఇంటి లోపలికి వెళ్ళాడు, అక్కడ ఒక మంచం కనిపించింది. ఈ రాత్రికి ఇక్కడే పడుకొని రేపు ఉదయం వెళ్దాం అని అనుకున్నాడు. రవి కూర్చున్న మంచం ఎదురుగా ఒక అద్దం ఉంది, అద్దం నుంచి ఎవరో తనను చూస్తున్నట్టు అనిపించింది. ఆ అద్దం దగ్గరికి వెళ్లి చూస్తే,రవికి తను తప్ప ఎవరూ కనిపించలేదు. ఇదంతా నా భ్రమ అనుకొని రవి నవ్వుకుంటూ మళ్ళీ ఒకసారి అద్దం వైపు చూడగా, ఎవరైతే తనకు ముందుగా అద్దంలో కనిపించారో వాళ్లు తన వెనకాల నుండి చూస్తున్నట్టు అద్దంలో కనిపించింది. అది చూసిన రవికి గుండె ఆగినంత పని అయింది, భయంతో వెనక్కి తిరిగి చూడగా ఎవరూ లేరు. ఇదంతా నా భ్రమ నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను అనుకుని వెనక్కి తిరిగి మంచం వైపు నడవసాగాడు. అలా నడుస్తున్న రవి కి తన వెనకాల ఎవరో వస్తున్నట్టు అనిపించి చూడగా ఎదురుగా అద్దం వచ్చి ఉంది. రవి కి భయం వేసి పక్కనే ఉన్న కర్రను తీసుకుని అద్దాన్ని పగలగొట్టాడు.

  ఆ కర్రను పక్కకు విసిరేసి మంచం మీద వచ్చి కూర్చున్నాడు. అంతలో అతని పక్క గది నుంచి ఎవరో ఏడుస్తున్నట్టు వినిపించింది. రవి అది ఎవరని చూడడానికి పక్క గది కి వెళ్ళాడు. వెళ్ళి చూస్తే ఎవరూ లేరు, తన గదిలోకి ఎవరో వెళ్లినట్టు తనకు కనిపించింది. ఎవరని వెళ్లి చూడగా అక్కడ ఎవరూ లేరు. కానీ!……. అక్కడ పగిలిన అద్దం అతుక్కుని ఉంది. రవి ఆశ్చర్యంతో అద్దం దగ్గరికి వెళ్లి దాన్ని తాకుదామని ప్రయత్నించగా, అందులో నుంచి ఒక భయంకరమైన ఆకారం వచ్చి రవి గొంతు నొక్క బోయింది. భయంతో, ఉన్నపళంగా ఆ ఆకారం నుంచి విడిపించుకుని ఆ ఇంటి నుంచి బయటకు పరుగుతీశాడు. అప్పుడు ఆ ఇంటి నుంచి గట్టిగా అరుపులతో “నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను వదలను” అని భయంకరమైన గొంతు వినిపించింది రవికి. దానితో రవి మరింత వేగంగా పరుగు తీశాడు. అలా కొంత దూరం వెళ్ళిన రవికి అలసట వేసి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అంతలో ఆ చెట్టుకి ఉన్న పెద్ద తొర్రలో నుంచి ఒక చెయ్యి వచ్చింది. రవి భయంతో కళ్లు మూసుకుని వెనకకు తిరిగి చూడలేదు. ఆ చెయ్యి రవి ని వెనక నుంచి భుజాన్ని తట్టింది. పదే పదే ఆ చేయి రవిని తడుతూనే ఉంది. ఇంతకు అది ఎవరు చేయి అని కళ్ళు తెరిచి చూడగా…….

బస్సులో ఉన్న కండక్టర్, సార్ మీరు దిగవలసిన పట్టణం వచ్చింది దిగండి అని పడుకొని ఉన్న రవి ని లేపి చెప్పాడు. రవి కి ఏం అర్థం కాలేదు. రవి బస్సు దిగి, “నాకు వచ్చిందంతా కలనా”, అమ్మో భయపడి చచ్చా రా బాబు. అప్పటికే చీకటి పడడంతో రవి తన గడియారం చూశాడు. రవి కి ఇప్పుడు నిజంగానే భయం మొదలైంది. ఎందుకంటే తన కలలో బస్సు దిగిన సమయం ఇప్పుడు సమయం ఒకటే………

Leave a Reply

Your email address will not be published.

16 thoughts on “ఆమె నాకు కనిపించింది(పార్ట్ – 2)

 1. Abba abba emyna supsense aa ichi padesav macha…story narration burra padu…..👌👌👌👌

 2. Unexpected ending…
  Very interesting..
  Super exciting story…
  Chala baga story rasaruu…
  😁

 3. Superr 👌👌
  Twist bagundii😅

 4. Superr 👌👌
  Twist bagundii🤭

 5. Nice, one 👍…. Ending line is fab.

 6. · October 9, 2020 at 4:29 pm

  Interesting ga undi ra… last lo ending Ila istavu anukoledu.. Inka untey baagunnu anipinchindi….
  To sum up, its a Good story 👌👌👌

 7. Nice Twist Broo. 👌👌👌👌👌👌👌👌👌

 8. Yemanna suspense thammudu

 9. Waiting for the Part-3…

 10. Story super ra shivam
  Suspence keka ra
  Waiting for part 3
  All the best ra shivam

 11. Nxt em jaruguthaadhi ani waiting asala😇