297
9

ఆమె నాకు కనిపించింది(పార్ట్ – 3)

297

పార్ట్ – 3

రవి కి వచ్చిన కలలో బస్సు దిగిన సమయం, ఇప్పుడు సమయం ఒకటే కావడంతో, తనలో నిజమైన అలజడి మొదలైంది. రవి “పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్”(PTSD) తో బాధపడుతున్నాడు. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటే ఎప్పుడు పడుకున్న భయంకరమైన పీడకలలు వస్తుంటాయి. రవి కాసేపు ఆలోచించి ఇదంతా నా కలేగా, ఇది ఏమైనా నిజ జీవితంలో జరుగుతుందా ఏంటి. రవి కి వచ్చిన కలను పట్టించుకోకుండా, వీరభద్రపురం వైపుగా నడవసాగాడు. రవి వీరభద్రపురం అడవి లోపలకి ప్రవేశించాడు. రవికి నక్కల అరుపులు వినిపించాయి. తాను అదేమీ పట్టించుకోకుండా ముందుకు నడుస్తూ సరైన మార్గంలోనే వెళ్తున్నాడు. నక్కల అరుపులు రవి వెనకాతల నుంచి గట్టిగా వినిపించి వెనక్కి తిరిగి చూడగా, ఐదు నక్కలు రవిని చంపడానికే ఉన్నట్టు క్రూరంగా చూస్తున్నాయి. రవికి భయం వేసి ఒక్కసారిగా పరిగెత్తాడు. రవి చురుగ్గా ఒక పొడవాటి చెట్టు మీదకు ఎక్కి కూర్చున్నాడు. నక్కలు ఆ చెట్టు మీదకి ఎక్కలేక, అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. రవి దూరంలో ఒక తెల్లని దుస్తుల్లో ఉన్న వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తి ఎంతో సేపటినుంచి అక్కడే అలానే నిల్చొని ఉన్నాడు. రవి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్దామని అనుకున్నాడు, దాంతో రవి ఆ చెట్టు దిగి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లగా, ఆ వ్యక్తిని వెనక నుంచి చూస్తే అతి భయంకరంగా కనిపిస్తున్నాడు. రవి ఆ వ్యక్తిని పిలిచాడు. కానీ ఆ వ్యక్తి ఉలుకు లేదు పలుకు లేదు. రవి ఆ వ్యక్తి ముందుకు వెళ్లగా………..

అది ఒక దిష్టిబొమ్మ అని రవికి అర్థమైంది. ఇంత దట్టమైన అడవి మధ్యలో ఈ దిష్టిబొమ్మ ఎవరు ఉంచారు అబ్బా…, అని రవి ఆలోచిస్తుండగా, ఎవరదీ? అనే పిలుపు వినిపించింది తనకి. అది ఎవరని చూడగా. అక్కడ పొడవాటి జుట్టు, తెల్లటి దుస్తులతో ఒక ఆవిడ కనిపించింది రవికి. రవి ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. రవి మీరు ఎవరు? అని అడిగాడు. నా పేరు అరుణ అని చెప్పింది ఆవిడ. నా పేరు రవి, నేను వీరభద్రపురం వెళ్లాలి, నాకు ఈ రాత్రికి ఒక ఆశ్రయం కావాలి. మీరు అది ఏర్పాటు చేయగలరా? అని అడిగాడు రవి. దాందేముంది మీరు ఈ రాత్రికి మా ఇంట్లోనే ఉండి రేపు ఉదయం వీరభద్రపురం వెళ్ళండి అని ఆవిడ చెప్పగా, సరే అన్నాడు రవి. ఆవిడ ఇల్లు పెద్దగా ఉంది. ఆవిడ రవికి ఒక గది ఇచ్చి మీరు ఇక్కడే పడుకోవచ్చు అని చెప్పి, పడుకోవడానికి దుప్పటి, తలగడ కూడా తెచ్చి ఇచ్చింది. ఆవిడ తన గదికి వెళ్తూ రవి తో ఇలా చెప్పింది. మీకు రాత్రివేళ బయటనుండి విచిత్ర శబ్దాలు మరియు ఎవరో తలుపు కొడుతున్నట్టు అనిపిస్తుంది, దానికి మీరు ఎటువంటి కంగారు పడకుండా ప్రశాంతంగా పడుకోండి. ఒకవేళ మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీ మంచం పక్కనే ఉన్న టెలిఫోన్ ద్వారా నా గదిలో ఉన్న నన్ను మీరు పిలవచ్చు. సరే అన్నాడు రవి. సమయం అర్ధరాత్రి 1:00 కావస్తోంది, రవికి ఎవరో బయట నుండి మెల్లగా ‘రవి….రవి….బయటకు రా’ అని పిలుస్తున్నట్లు వినిపించి లేచాడు. రవి కి భయం వేసి ఆవిడకు ఫోన్ చేశాడు. ఆవిడ ఏమయింది అని అడగగా, నన్ను ఎవరో పేరుతో పిలిచి బయటకు రమ్మంటున్నారు అని చెప్పాడు రవి. ఆవిడ నువ్వు ఏమీ పట్టించుకోకుండా పడుకో అని చెప్తూ ఒకవేళ తలుపు ఎవరో తడుతున్న శబ్దం వినిపిస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తలుపు తియ్య వద్దు. రవి ఫోను మంచం పక్కన పెట్టేసి పడుకో గా మళ్లీ తనకు అదే శబ్దం ఈ సారి గట్టిగా వినిపించగా ఒకసారి బయట ఎవరున్నారో చూద్దామని కిటికీ అద్దం నుంచి తొంగి చూడగా బయట ఒక నల్లటి ఆకారం తెల్లని దుస్తులతో ఒక్కసారిగా తన ముందు నుండి వెళ్లడం చూశాడు. అది చూసిన రవికి చాలా భయం వేసింది. అప్పుడే ఒక్కసారిగా ఆ ఇంటి తలుపులు ఎవరో తడుతున్నట్టు అనిపించింది. రవి కి ఏం చేయాలో తెలియని పరిస్థితి. రవికి ఫోన్ వచ్చింది. అది ఎవరు అని ఎత్తగా, ‘నువ్వు ఈ ఇంటి తలుపులు తీయకపోతే మీ ఇద్దరూ చస్తారు’. అని భయంకరమైన గొంతు తో చెప్పింది రవికి. కొద్దిసేపటికి మళ్లీ ఫోన్ వచ్చింది. రవికి టెలిఫోన్ ముట్టుకోవడానికి కాళ్లు చేతులు వణికాయి. అయినా రవి ఫోన్ ఎత్తాడు. ఈసారి ఫోన్లో మాట్లాడుతుంది అరుణ. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటి తలుపులు తియ్య వద్దు అని చెప్పే లోపే ఫోన్ ఆగిపోయింది. రవికి అర్థమయింది ముందుగా భయంకర గొంతుతో మాట్లాడింది అరుణ కాదని. దానితో రవి కి చెమటలు పట్టి, గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అప్పుడే బయట నుండి ‘రవి…రవి… నన్ను కాపాడు ఈ అడవి నక్కలు నన్ను చంపేస్తాయి’ అని గట్టిగా అరుపులు వినిపించాయి రవికి. ఈ గొంతు మా అన్నయ్య నరేష్ ది లాగా ఉంది ఏంటబ్బా…అని ఆలోచించాడు. మళ్లీ అలాంటి అరుపులు వినిపించగా, బయట ఉన్నది ఖచ్చితంగా మా అన్నయ్యే అని అనుకొని రవి తలుపు తీయగా, పెద్దగా గాలి ఇంటి లోపలికి ఒక్కసారిగా వచ్చి పోయింది. రవి బయట చూసేసరికి ఎవరూ లేరు. బయట ఎవరూ లేకపోయేసరికి రవి కి చాలా భయం వేసి ఆ ఇంటి తలుపులు మూసేసిన వెంటనే తన గదిలోకి పరుగుతీసి ఆవిడకి ఫోన్ చేశాడు. ఎంతసేపు అయినప్పటికీ ఆవిడ ఫోన్ ఎత్తక పోయేసరికి, రవి ఆవిడ గది వద్దకు వెళ్లి తలుపులు గట్టిగా తట్టాడు. ఎప్పటికీ తలుపులు తీయక పోయేసరికి, తన గదికి వెళ్లి మళ్లీ ఫోన్ చేయగా, ఈసారి ఫోన్ మోగడం రవి మంచం కింద నుంచి వినిపించింది. రవికి భయంతో తన మంచం కిందకు ఒంగి చూడగా……………..

Leave a Reply

Your email address will not be published.

9 thoughts on “ఆమె నాకు కనిపించింది(పార్ట్ – 3)

 1. I enjoyed a lot 🙂 the story is very good , eagerly waiting for part4

 2. Annayya super part 4 kosam waiting

 3. The story’ is very interesting 👌👌👌👌👌👌 chalq bagundhi ra

 4. Really awesome katti la undii part 4 eppudu vastadi waiting ikkada😉😉

 5. Awesome man Lawrence series kana bagundhi….😅

 6. · October 21, 2020 at 7:48 pm

  Rey inkenni parts raasthav ra…
  😄😄…. Kani story maathram thrilling ga… Interesting ga undi… Good work, keep it up👍👍

 7. Nice ra keeping rocking… waiting for next Part

 8. · February 23, 2021 at 11:38 am

  Very thrilling story..it’s very interesting yarr!!

 9. Enna twist asalaa🔥