480
16

అస్పష్టమైన కథ

480

కార్తీక్ ఒక MBBS విద్యార్థి . కార్తీక్ బెంగళూర్ లో మెడిసిన్ చేస్తున్నాడు .కార్తీక్ చాలా బాగా చదువుతాడు. వాళ్ళు చెన్నై లో వుంటారు. ఎలా అయిన USA లో ఒక మంచి హాస్పిటల్ లో మంచి డాక్టర్ గా పని చెయ్యాలి అని తన డ్రీమ్ . అందువల్ల దానికోసం కృషి చేశాడు .శ్రేయ కూడా MBBS చెయ్యడానికి కార్తీక్ వాళ్ల కాలేజ్ లో కొత్తగా జాయిన్ అయ్యింది. శ్రేయ వాళ్ళు వుండేది వైజాగ్ లో , బెంగళూర్ కి మెడిసిన్ చెయ్యడం కోసం వచ్చింది . శ్రేయ కి కూడా US లో పిజి చెయ్యాలని డ్రీమ్. శ్రేయ కి చిన్నప్పటి నుండి ఒక స్నేితురాలు ఉంది తన పేరు ప్రియ…

ప్రియ కూడా MBBS చేద్దాం అని శ్రేయ తో కలిసి బెంగళూర్ వచ్చింది . ప్రియ కి కూడా శ్రేయ అంటే చాలా ఇష్టం .ప్రియ వాళ్ళది కూడా వైజాగ్. వాళ్ల ఇద్దరు కూడా చిన్నప్పటి నుండి ఒకే స్కూల్ మరియు ఒకే కాలేజ్. ప్రియ వాళ్ల నాన్న గారు చనిపోయారు , అప్పటి నుండి ప్రియ కి అన్ని శ్రేయ నే , శ్రేయ వాళ్ల బంధుమిత్రులు కూడా ప్రియ తో చాలా అనుబంధంగా ఉండేవారు , శ్రేయ వాళ్ల నాన్న గారు శ్రేయ కోసం ఏమి కొన్న ప్రియ కోసం కూడా తీసుకొని వచ్చేవారు , శ్రేయ ప్రియ మధ్య వుండే స్నేహం చూడటానికి అక్క చెల్లి వలె ఉండేవారు. ఇద్దరు కలిసి MBBS చెయ్యడానికి బెంగళూర్ వచ్చేరు. అలా అక్కడికి  MBBS చెయ్యడానికి వచ్చిన శ్రేయ కి కార్తీక్ పరిచయం అయ్యాడు .శ్రేయ కి వాళ్ల అమ్మ ని వొదిలి రావడం ఇష్టం లేదు అందువల్ల తను అక్కడి నుండే తర్వాత ఎం చెయ్యాలో ఆలోచించింది . ఒక రోజు కార్తీక్ శ్రేయ నీ క్యాంటీన్ లో చూస్తాడు. కార్తీక్ కి శ్రేయ పైన లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కలిగింది. కార్తీక్ హృదయం లో శ్రేయ కి చోటు లభించింది.తన సీనియర్ అవ్వడం తో తనకి ఎటువంటి ఇబ్బందీ లేకుండా ప్రతి విషయం లో తనకి సహాయం చేస్తున్నాడు. ఒకరోజు కార్తీక్ తన స్నేహితులతో కలిసి క్యాంటీన్ లో ఉండగా శ్రేయ ప్రియ కి సీనియర్స్ ఏడిపిస్తున్నరు  , వెంటనే అది తెలుసుకున్న కార్తీక్ శ్రేయ ప్రియ వాళ్ల దగ్గిరకి వెళ్ళేడు , సీనియర్స్ తో మాట్లాడు వాళ్ళని అక్కడి నుండి తీసుకొని వెళిపోయాడు.అక్షణం శ్రేయ కి కార్తీక్ మెడ ప్రేమ కలిగింది.కార్తీక్ ఎలా ఇన తన మనసులో ఉన్న మాట నీ శ్రేయ కి చేపుడం అనుకున్నాడు.

అల కార్తీక్ శ్రేయ పైన ఉన్న ప్రేమ నీ దాచుకోలేక ఒక రోజు శ్రేయ తో చెప్పేశాడు. శ్రేయ కి కూడా కార్తీక్ అంటే ఇష్టం శ్రేయ కి కార్తీక్ మెడ ఉన్న ఫీలింగ్స్ నీ ప్రియ తో షేర్ చేసుకునేది. శ్రేయ కి కూడా కార్తీక్ అంటే ఇష్టం ఉండడం వల్ల ప్రియ శ్రేయ తో ఒప్పుకో అని చెప్పింది .అల కాలేజ్ తో ప్రారంభం అయిన వాళ్ల ప్రేమ ఇంట్లో చెప్పి ఒప్పించి ఇంటి వరుకు తీసుకొచ్చారు.అల వాళ్ల ప్రేమ బంధం పెళ్లి బంధం గా మారింది.అల అల శ్రేయ కార్తీక్ తో US వెళ్లడానికి సిద్ధం అవుతుంది. శ్రేయ కి కార్తీక్ తో US వెళ్తున్న ఆనందం కన్న ప్రియ నీ వొదిలి వెళ్తున్న అనే బాధ ఎక్కువగా ఉంది . కార్తీక్ కి తను అనుకున్నట్టు US లో మంచి ఉద్యోగం వచ్చింది. శ్రేయ కి ప్రియ నీ అల వొదిలి వెళ్ళడం ఇష్టం లేదు కానీ వెళ్లల్సి వచ్చింది.ఎక్కడికి వెళ్ళినా ప్రతి రోజూ శ్రేయ ప్రియ కి ఫోన్ చేస్తూనే ఉండేది. ఒక వారం నుండి ప్రియ శ్రేయ చేస్తున్న కాల్స్ నీ లిఫ్ట్ చెయ్యడం లేదు మాట్లాడటం లేదు. ప్రియ వాళ్ల మదర్ కి కాల్ చేసినా సరే ఆవిడ కూడా లిఫ్ట్ చేసే వారు కాదు.శ్రేయ కి చాలా భయం గా ఉండేది…

తనతో మాట్లాడటం కోసమే ఎదురు చూస్తున్న శ్రేయ కి ప్రియ నుండి ఫోన్ వచ్చింది. ప్రియ ఏమో అని ఆతృత తో మాట్లాడితే వాళ్ల రిలేటివ్స్ అని చెప్పి ప్రియ సూసైడ్ చేసుకుంది అని చెప్పేరు.శ్రేయ US నుండి INDIA కి వచ్చేసింది.శ్రేయ కి ప్రియ గదిలో ఒక సూసైడ్ నోట్ దొరికింది.సూసైడ్ చేసుకుంది అని వినగానే శ్రేయ బాధ పడింది. తను ఎంతగానో ఇష్టపడిన ah స్థితి లో చూడలేకపోయింది  ప్రియ ఎందుకు సూసైడ్ చేసుకుంది ?? శ్రేయ కి కూడా చెప్పలేనంత బాధ ప్రియ కి ఎం వచ్చింది ?? చూద్దాం ఏం అవుతుందో !!!….

శ్రేయ ప్రియ గదిలో దొరికిన సూసైడ్ నోట్ తేసి చదువుతుండగా శ్రేయ కంట్లోంచి కన్నీరు ఆగటం లేదు .అంతలా కన్నీరు పెట్టుకునే మాటలు ఎం ఉన్నాయి అంటే ” నేను నిన్ను చాలా మిస్ అవుతా , నేను ఎలాంటి తప్పు చేయలేదు కనీసం నువ్వు అయిన నన్ను నమ్ము , నేను ఎలాంటి తప్పు చేయలేదు అని నువ్వే రుజువు చేయ్యు.” అలా ప్రియ సూసైడ్ నోట్ చదివి ప్రియ సూసైడ్  వెనుక ఏదో పెద్ద రహస్యం ఉంది అందుకుంది ,వెంటనే శ్రేయ ప్రియ సోషియల్ మీడియా అంతా చూసింది కానీ ఎలాంటి క్లూ దొరకలేదు.  శ్రేయ అల ఆలోచిస్తూ ప్రియ గది నుండి బయటికి వెళిపోయింది.పోలీసులు ఉన్నారు కాబట్టి ఇంటి వెనుక నుండి వెళ్లింది…

శ్రేయ ప్రియ గది అంతా  వెతికింది కానీ తనకి ఏమి దోరకాలేదు. ప్రియా నాకు ఒక క్లూ ఇవ్వు  అని అనుకుంటుండగా  పోలీస్ రావడం చూసి కంగారు తో బయటికి వచ్చేద్దాం అని అనుకొని తొందరగా వస్తుంటే టేబుల్ కి తన్నుకొని పడిపోయింది. శ్రేయ కి కొన్నీ లెటర్స్ మరియు కొన్నీ ఎన్విలోప్స్ దొరికాయి . అవీ అన్నీ పట్టుకొని శ్రేయ అక్కడి నుండి బయటికి వచ్చేసింది . ప్రియా రూమ్ లో దోరికినా లెటర్స్ శ్రేయా కి ఏమ్మైన క్లూ ఇస్తాయా ?? ఇంతకీ అహ్ లెటర్స్ ప్రియా కి వచినవ లీదా ప్రియా ఎవారికి ఇనా రాసి పోస్ట్ చెయ్యకుండా వుంచిందా ? ప్రియా ఎలంటి తప్పు చేయలేదు అని శ్రేయా ఎలా నిరూపోస్తుంది అనేది చూద్దాం !!!…..

శ్రేయ కి ప్రియ గదిలో దొరికిన వాటిని చూస్తే అమైన క్లూ ఉంటుంది ఏమో అని అనుకుంటూ అవి అన్ని  చూడటం మొదలుపెట్టింది. ముందు ఒక కవర్ తెరవగానే అందులో ఆర్గాన్ డొనేషన్ కి సంబంధించిన కాగితాలు కొన్ని ఉన్నాయి . ఆహ్ పేపర్స్ ఏంటి ప్రియ రూం లోకి ఎందుకు వచ్చేయో ఎవ్వరికీ తెలియదు. ఒకసారి పేపర్స్ పైన ఉన్న హోసిపిటల్ కి వెళ్తే ఏమైనా క్లూ దొరుకుతుంది ఏమో అని వెళ్లింది .కానీ అక్కడి వాళ్ళు ఏది చెప్పలేదు తిరిగి ప్రియ కోసం తప్పు గ చెప్పేరు అందువల్ల శ్రేయ కి కోపం వచ్చింది అప్పుడు శ్రేయ కంట్రోల్ చేసుకొని ప్రియ ఎలాంటి తప్పు చేయలేదు అని నేను నేరుపిస్త అని చెప్పి వెళిపోయింది…

హాస్పిటల్ నుండి శ్రేయ కి ప్రియ ఒక క్లూ ఇద్దం అని కార్ నీ అగిపోయెల చేసింది.తన భర్త కి ఫోన్ చేసి రమ్మని చెప్తుంది.ఈలోపు అక్కడ ఎం ఉన్నాయా అని చూస్తుండగా ఒక ఇల్లు కనిపించింది. శ్రేయ కి ఒకసారి ఆ ఇంట్లోకి వెళ్దాం అని అనిపించింది.అది చాలా పాత ఇల్లు , ఆ ఇల్లు మొత్తం చూస్తుండగా శ్రేయ కి ఒక ఫోటో కనిపిస్తుంది. అది చూసి శ్రేయ షాక్ అవ్తుంది .అలా ఆ ఇల్లు మొత్తం చూస్తుంటే శ్రేయ కి ప్రియ ఇంట్లో దొరికిన ఆర్గాన్ డొనేషన్ పేపర్స్ అక్కడ కూడా దొరుకుతాయి. ఆ పేపర్స్ అక్కడ దోరకడనికి కారణం ఏంటి ?? షాక్ అయ్యేంత వాళ్ళు ఆ ఫోటోలో ఎవరు ఉన్నారు ??ఇంతకీ ఆర్గాన్ డొనేషన్ పేపర్స్ కి ప్రియ కి సంబందం ఏమిటి ??? చూద్దాం !!!…

శ్రేయ కి దొరికిన ఆ ఆర్గాన్ డొనేషన్ పేపర్స్ పట్టుకొని శ్రేయ ప్రియ పని చేసినా హాస్పిటల్ కి వెళ్తుంది .కానీ అక్కడ ఎవ్వరూ ఏమి చెప్పలేదు.హాస్పిటల్ నుండి బయటికి వస్తుండగా అక్కడ పని చేసే ఒక అబ్బాయి శ్రేయ కి ఒక విషయం చెప్పేడు.కీర్తి అని ఒక అమ్మాయి ఉండేది. ప్రియ మేడం హాస్పిటల్ కి రాకపోవడం తో తను కూడా రావడం లేదు అని చెప్పేడు. ఈ అబ్బాయి చెప్పినది ఏమైనా ఉపయోగపడుతుంది ఏమో అని అనుకుంటుంది శ్రేయ.ఆ అబ్బాయి దీనితో పాటు ఒక పేపర్ కూడా ఇచేడు అందులో ప్రియ కోసం చెడ్డగా రాసిన ఆర్టికల్ వుంది.ఆ పేపర్ పట్టుకొని శ్రేయ ఆ పేపర్ ఆఫీస్ కి వెళ్తుంది…

అక్కడ వాళ్ళు ఈ అమ్మాయి ఆర్గాన్స్ తో బిజినెస్స్ చేస్తూ దొరికిపోయిన అదే రాసెం, అని అన్నారు.శ్రేయ కి అసలు ఏం అర్దం కావడం లేదు .శ్రేయ తనకి దొరికిన క్లూస్ నీ తన భర్త కి చెప్పుకుంటూ ఏడుస్తుంది.తొందరపడకుండా వెతుకు ఏదో ఒక క్లూ దొరుకుతుంది శ్రేయ అని తన భర్త తనకి దైర్యన్ని ఇస్తాడు.ఆరోజు రాత్రి 11:45 అయింది ఆ సమయం లో శ్రేయ కలలోకి ప్రియ వస్తుంది.తను ఏదో చెప్పాలి అని అనుకుంటుంది కానీ అది ఏంటో శ్రేయ కి అర్దం కావడం లేదు .ఉదయం లేవగానే శ్రేయ తనకి వచ్చిన అహ్ డ్రీమ్ కోసం ఆలోచిస్తుంది.ఒక్కసారిగా తనకి హాస్పిటల్ బయట ఆ అబ్బాయి చెప్పిన విషయాలు గుర్తువచి , వెంటనే ఒకసారి అతనిని కలిసి కీర్తి అడ్రెస్స్ తెలుసుకొని తనని కలుద్దాం అని అనుకొని వెళ్తుంది.శ్రేయ కి ప్రియ ఏమిటి చేపుదం అనుకుంది ?? అసలు ప్రియ కి కీర్తి కి సంబందం ఏంటి ?? కీర్తి ఇంటికి వెళ్ళిన శ్రేయ కి ఏమైనా  దొరికిందా ?? చూద్దాం….

ఎంతో ఆశగా ఏమైనా క్లూ దొరుకుతుంది అనుకొని కీర్తి ఇంటికి వెళ్ళిన శ్రేయ కి అక్కడ కీర్తి కోసం వినగానే చాలా బాధ పడింది .ఎందుకంటే కీర్తి ఇంటికి వెళ్ళిన శ్రేయ కి కీర్తి లేదు అనే నిజం తెలిసి తట్టుకోలేకపోయింది.కీర్తి ఎలా చనిపోయింది అని వాళ్ల అమ్మ నీ అడగగా తను ఒక ఏక్సిడెంట్ లో చనిపోయింది అని చెప్పేరు.ఎవరో Dr. ప్రియ అనే మేడం దగ్గిర పని చేసింది ఆవిడ చనిపోయిన తర్వాత కొన్ని రోజులు కంగారు పడింది.ఇంతలో ఇలా అయింది అని చెప్తారు.కీర్తి బయటికి ఎప్పుడు వెళ్లింది అని శ్రేయ అడుగుతుంది? అయితే వల్ల సీనియర్ Dr. చక్రవర్తి నీ కలవడానికి వెళ్లి వస్తుండగా ఇలా ఏక్సిడెంట్ అయింది అని చెప్పేరు.ఏక్సిడెంట్ అయ్యి ఎన్ని రోజులు అయ్యింది ? అని అడుగుతుంది మూడు రోజులు క్రితం వాళ్ల అమ్మ గారు చెప్తారు…

ఇది అంత విన్న శ్రేయ తనకి ఎలాంటి క్లూ దొరకలేదు అని చాలా బాధ పడుతుంది.తనకి వచ్చిన కళ కోసం అల ఆలోచిస్తూ అక్కడి నుండి బయటికి వచ్చేస్తుంది.అల వస్తుండగా కీర్తి గదిని ఒకసారి చూద్దాం అని చెప్పి కీర్తి గదిలోకి వెళ్తుంది .అల చూస్తుండగా కీర్తి కి ఒక లెటర్ దొరుకుతుంది. ఆ లెటర్ లో ఒకరి సంతకం ఉంటుంది. ప్రియ కి తన కలలో కనిపించిన సంతకం అలానే తను ఇప్పుడు చూసిన సంతకం ఒకటేనా అని ఆలోచిస్తుంది.ఆ సంతకం చూసిన శ్రేయ కి ఒక ఉపాయం గుర్తొస్తుంది.వాళ్ళని కలిస్తే మొత్తం తెలుస్తుంది అని అక్కడ నుండి వెళ్లిపోతుంది. కీర్తి ది నిజం గానే ఏక్సిడెంటా లేదంటే ఎవరు అయిన చంపేశారా ?? ప్రియ చనిపోయాక కీర్తి ఎందుకు కంగారు పడింది??…

ప్రియ చనిపోయాక కీర్తి కి Dr.చక్రవర్తిని కలవాల్సిన అవసరం ఏంటి ?? కీర్తి గదిలో దొరికిన సంతకం తన కలలో వచ్చిన సంతకం  ప్రియ గదిలో దొరికిన సంతకం ఒకటే.అయినా శ్రేయ కి పూర్తిగా ఎం జరిగిందో అర్థం అవ్వడం లేదు.ప్రియ గురించి తప్పుగా రాసిన ఆఫీస్ కి వెళ్లి తన కోసం అడుగుతుంది. అతను ప్రియ ఆర్గాన్స్ తో బిజినెస్స్ చేసింది ,తన గదిలో డబ్బులు కూడా ఉన్నాయి , చేసినా తప్పుకి సిగ్గు తో చచ్చిపోయింది అని అంటారు అతని మాటలు విన్నాక శ్రేయ కి చాలా కోపం వచ్చింది…

నిజాలు తెలుసుకొని మాట్లాడండి అని గట్టిగ చెప్పేసి అక్కడ నుండి వెళ్లిపోతుంది.అక్కడి నుండి వస్తుండగా శ్రేయ కి ఒక ఫోన్ వస్తుంది. తన పేరు కిరణ్ అలానే  తను కీర్తి కోసం మాట్లాడాలి అని చెప్తాడు.కిరణ్ తో కలిసి మాట్లాడేక శ్రేయ కి మొత్తం అర్దం అవ్తుంది.అలానే కీర్తి కి జరిగింది ఏక్సిడెంట్ కాదు చంపేశారు అని అర్దం అవ్తుంది.కిరణ్ , కీర్తి స్నేహితులు కానీ తన విషయం లో ఇంత తెలిసిన ఏమి చెయ్యలేని పరిస్తితి అని చెప్పుకుంటూ బాధ పడుతాడు.కిరణ్ శ్రేయ నీ కలిసిన విషయం ఎవరికి తెలియకూడదు అని చెప్తాడు.శ్రేయ కి తన భర్త స్నేహితుడు ఒకరు సహాయం చేస్తున్నారు…

ప్రియ విషయం లో ప్రియ నీ తప్పుగా చేసినా వాళ్ళు ఏదో ఒక విషయంలో తప్పు చేసి ఉంటారు ఏదో ఒక క్లూ వొదిలి ఉంటారు అని ఆలోచిస్తుండగా.శ్రేయ కి ఒక ఉపాయం వచ్చింది. ప్రియ రూం లో ఉన్న డబ్బు అలానే పేపర్స్ మీద వెలుముద్ర ఉంటుంది కదా అని ఆలోచించింది.అవి అన్నీ పోలీస్ దగ్గిర ఉన్నాయి అని తెలుసు శ్రేయ కి వాటి మీడన ఉన్న వేలుముద్ర లు ఎవరివో తెలుసుకోడానికి తన భర్త అలానే తన స్నేహితుడు వెళ్తారు.ఆ రిపోర్ట్ వచ్చేక అది ఎవరిదో శ్రేయ కి తెలుస్తుంది…

అక్కడ ఉన్న పోలీస్ కి చెప్పి ఆ వెలుముద్రా ఎవరిదో తెలుసుకున్నారు. అలా తెలుసుకున్నాక శ్రేయ ప్రియ ఎవరి వల్ల చనిపోయింది అనేది తెలుసుకుంది.ఆ డబ్బు ఎవరు పెట్టేరో కూడా శ్రేయ కి అర్దం అయింది. జరిగింది ఏంటి అంటే , ప్రియ తన హాస్పిటల్ లో పని చేస్తుండగా తనకి ఒక క్రిటికల్ ఆపరేషన్ వచ్చింది అది చాలా కష్టపడి ప్రియ పూర్తి చేసింది. ఆ ఆపరేషన్ నీ విజయవంతం చేసింది .అలా చేసినా పనిలో తనకి చాలా మంచి పేరు వచ్చింది . ప్రియ నీ అందరూ మెచుకొడం మొదలుపెట్టేరు.అక్కడే ప్రియ గెలుపు నీ ఇంకొకరు తమ ఓటమి గా ఫీల్ అయ్యారు. ప్రియ చేసినా ప్రతి ఆపరేషన్ సక్సెస్ అయ్యేది. ప్రియ కొన్ని విషయాల్లో పేషంట్స్ కి ఉచితం గా వైద్యం చేసేది.తనకి తోచినంత ఇతరి విషయాల్లో ప్రజలకి సహాయం చేసేది.ఇలా ఎదుగుతున్న ప్రియ నీ తన సీనియర్ DR. చక్రవర్తి సహించలేదు, ఒకసారి ఒక ఆర్గాన్ కోసం ఎంత అవసం ఉందో చెప్పి ఒక ఆర్గాన్ ట్రాన్స్పోర్ట్ చేయించింది. ఆ సర్జరీ సక్సెస్ అయిన శుభ సందర్భం లో  ఒక ప్రెస్స్ మీట్ జరిగింది. అందులో ఆర్గాన్ డొనేషన్ కోసం చెప్పింది.ఇకపై ఆర్గాన్ డొనేషన్ యొక్క పూర్తి బాధ్యతను తను వహిస్తాను అని చెప్పింది.ఆ సమయం లో DR. చక్రవర్తి అప్పటికే చేస్తున్న ఆర్గాన్ బస్సినేస్ కోసం ఆలోచించి ప్రియ నీ తన దేగిర పని చేసుకునేలా చేసుకుంటే మంచి లాభం ఉంటుంది అని అనుకొని ప్రియ తో మాట్లాడుతాడు. కానీ ప్రియ కు అది నచ్చలేదు మొహమాటం లేకుండా ఒదు అని చెప్పి ఇంకో సరి అడిగితే పోలీస్ కి చెప్తా అని చెప్పింది….

ఆ సమయం లో తనకి తన ప్రాణాలు మీదకు తెచ్చుకుంది అని తనకి తెలియదు.అల తను చేసిన ప్రతి ఆపరేషన్ కూడా మంచిగా పూర్తి చేసి ప్రాణాలు కాపాడడం వాళ్ల తన సీనియర్ డాక్టర్ తట్టుకోలేకపోయారు. అందువల్లే తను ఆర్గాన్స్ తో బిజినెస్స్ చేస్తుంది అని సృష్టించి తను లేని సమయం లో తన గదిలో డబ్బు పెట్టి తనని తనే చంపుకునే లా చేశారు తన సీనియర్ Dr. చక్రవర్తి…

తనకి స్టూడెంట్ అయిన ప్రియ గెలుపు నీ తను తట్టుకోలేకపోయారు.తన స్టూడెంట్ గెలుపు నీ గురువుగా తను అభినందించాలి అల కాకుండా అతను తట్టుకోలేకపోయారు. అతని గొప్పతనం తగ్గిపోతుంది అని భయపడి ఇలా చేశాడు.ప్రియ నీ ఇలా చేద్దాం అని చెప్పిన సమయం లో ప్రియ కింద పనిచేసే కీర్తి విన్నది..అందుకే ప్రియ చనిపోయాక కీర్తి ఒక వారం వరకు కంగారు పడింది.కీర్తి కి ఈ విషయం తెలిసిపోయింది అని తేలుసుకున్న  చక్రవర్తి తనని కూడా చంపేశాడు..ఈ విధంగా చెయ్యను తప్పు కి ప్రియ తన ప్రాణాలు కోల్పోయింది.ఈ విషయం అంతా చక్రవర్తి ద్వారా తెలుసుకున్న శ్రేయ ఆ వివరాలు తీసుకొని కోర్టు లో ప్రేవేసా పెట్టింది .ఇపుడు శ్రేయ చాలా సంతోషం గా ఉంది ఎందుకంటే ప్రియ తప్పు చేయలేదు అని అందరికీ తెలిసింది. తన చావు తప్పు చెయ్యడం వల్ల కాదు అని అందరికీ తెలిసింది.ఆకరిగా శ్రేయ ప్రియ వాళ్ల అమ్మగారు నీ US తీసుకొని వెళిపోయింది…..

Leave a Reply

Your email address will not be published.

16 thoughts on “అస్పష్టమైన కథ

 1. Nice story🤩

 2. I really loved it superb story write like this more and more to entertain us keep go on

 3. 🤩 story

 4. It’s really admirable 👏… It’s Good one Keep it up … & All the best for ur further writings…

 5. 👌🥰

 6. 👌 story 🥰

 7. Super suspence… And thrilling story

 8. Very nice story👌🏻 keep writing more and all the best for further success💫

 9. Thrilling Story

 10. Nice story. All the best

 11. Wow i really loved this story.i hope you will definately come with more beautifull storie’s for entertining us.you have a bright feauture.

 12. Nice story

 13. Very nice story 👏👏👏👏

 14. THRILLING STORY.. 🔥