బామ్మ – అనగనగా ఓ ఆకాశం ఆ ఆకాశం లో చుక్కలు అదే ఆకాశం కింద భూమి. ఆ భూమి మీద ఒక మనిషి చూపులు. ఆ చూపులు, చుక్కలు మాట్లాడుకుంటూ ఉంటాయి. అపుడు చూపులు చుక్కలని అడుగుతాయి “జాబిలి ఎక్కడ?” అని. రోజులు మారుతూ వచ్చాయి ఎక్కడ జాబిలి అని అడుగుతూ వచ్చాయి చూపులు ఉన్న చుక్కల్ని పట్టించుకోలేదు చూపులు ఒక రోజు చుక్కలు రాలేదు. జాబిలి రాలేదు.
అభయ్ (6years) – అబ్బా…. బామ్మ వొద్దు బామ్మ. రోజు ఇవే కథలు చెప్తావు మంచి కథ చెప్పు బామ్మ. మళ్ళీ నువ్వు అనగనగా ఓ రాజు……… అది కూడ చెప్పొద్దు. ఈరోజు కొత్త కథ చెప్పు బామ్మ.
బామ్మ- సరే అయితే నీకు ఒక మంచి కథ చెప్తా అగు. మహాభారతం లో ఏకలవ్యుడు అనే గొప్ప వేటగాడు ఉండేవాడు …………………………………… అప్పుడు అతను తన గురువు అడిగాడు అని తన బ్రొటనవేలు కోసి ఇచ్చేస్తాడ…..
అభయ్ – ఆగు బామ్మ! తర్వాత నేను చెప్తా. వెంటనే అతని భక్తికి మెచ్చి దేవుడు ప్రత్యక్షమయ్యి వరం ఇచ్చాడు మళ్ళీ వేలు కూడా ఇచ్చాడు అంతేనా?
బామ్మ- ఈసారి ఆలా జరగలేదు రా! అలానే ఉండిపోయాడు అతను.
అభయ్ – అదేంటి బామ్మ? మొన్నటి వరుకు నువ్వు చెప్పిన కథల్లో ప్రతి సారి దేవుడు వచ్చాడు, వరం ఇచ్చాడుగా? ఈసారి ఎందుకు రాలేదు, ఇవ్వలేదు? అతను వేటగాడు అనేగా? దేవుడు మనలాంటి వాళ్లకోసం రాడా?
బామ్మ- (silent)
అభయ్ – నాకు ఈ కథ నచ్చలేదు బామ్మ. మంచి కథ చెప్పు బామ్మ. లాస్ట్ కి బాలేదు ఎదో లాగా ఉంది ఈసారి మంచి కథ చెప్పు బామ్మ
బామ్మ- సరే ఇప్పుడు మంచి కథ చెప్తా. ఇప్పుడు మహాభారతం లేదు. వెన్నల లేదు. ఇంకో ప్రపంచమే లేదు. ఇది మన ప్రపంచంలో, మన భూమి మీదే జరిగిన కథ.
అభయ్ – అవునా! అయితే చెప్పు బామ్మ. వింటాను
బామ్మ- పాతకాలంలో నువ్వు పుట్టక చాల కాలం ముందు ఒక పెయింటింగ్ స్కూల్ ఉండేది. అదే పెయింటింగ్ స్కూల్ ముందు ఒక సంతలాగా మార్కెట్ ఉండేది. అక్కడ చాల మంది వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు. అక్కడే ఆ రోడ్లు తుడుచుకుంటూ ఒక ఆయా ఉండేది. ఆ అయ్యాకి ఒక కొడుకు ఉండేవాడు. నీకంటే కొద్దిగా పెద్దవాడు. సుమారు 13 సంవత్సరాలు ఉంటాయి. రోజు లాగా ఆరోజు రాత్రి కూడా ఆకలితో రోడ్ ఫుట్పాత్ మీదే పొడుకున్నారు. అయితే అటువైపుగా ఒక కార్ వేగంగా వెళ్లడం వల్ల ఆ రోడ్డు మీద ఉన్న బురద, దుప్పటి కప్పుకుని పడుకున్న వాళ్ళ అమ్మ మీద పడింది. అది చుసిన చిన్న బాబు, ఆ కార్ మీద కోపంతో రాయి విసిరాడు. ఆ రాయి వెళ్లి కార్ అద్దానికి తాకింది. కార్ ఒక్కసారిగా ఆగింది. ఆ కార్ లో నుండి ఒక పాతికేళ్ల కుర్రాడు,డ్రైవర్ దిగారు. ఆ పాతికేళ్ల కుర్రాడు చిన్న బాబుని ఎందుకు రాయి విసిరావు అని అడిగాడు. అపుడు చిన్న బాబు నీవల్ల మా అమ్మ కప్పుకున్న దుప్పటి పాడైపోయింది నిదానంగా వెళ్లొచ్చు కదా అన్నాడు. అప్పుడు డ్రైవర్ కోపంతో పిల్లవాడి మీదకు వెళ్లబోతుంటే ఆపి, ఆ కుర్రడు, “బాబు! నీ పేరు ఏంటి? ” అని అడుగుతాడు. అపుడు బాబు, “ముందు నీ పేరు ఏంటి? “ అని అడుగుతాడు. “నా పేరు ద్రోణ” అని చెప్తాడు. “ సరే. కొత్త దుప్పటి కొనుక్కోటానికి డబ్బులు ఇస్తా ఆగు.” అని పర్సు తీసి చూస్తే డబ్బులు ఉండవు. “నేను అడుక్కునేవాడ్ని కాదు. నాకు డబులు వొద్దు.” అంటాడు పిల్లవాడు. సరే అని ద్రోణ కారులోనుండి ఒక పేపర్ తీసి ఒక నిమిషం లో ఎదో బొమ్మ గీసి, “ఇది నువ్వు వేరే ఏ పెయింటింగ్ షాపులో ఇచ్చినా, 5000 రూపాయిలు ఇస్తారు.” అని అంటాడు. 5000 అంటే అప్పట్లో చాల ఎక్కువ. చిన్న పిల్లవాడు నవ్వి, “ఇది ఇస్తే ఎందుకు ఇస్తారు? తప్పించుకుందాం అనుకుంటున్నావా? ”అంటాడు. ద్రోణ నవ్వి, పర్సు తీసి అందులో అతని పాస్పోర్ట్ ఫోటో ఉంటె, దాని వెనుక అతని పేరు రాసి సంతకం పెట్టి ఇస్తాడు. “అది ఇచ్చాక డబ్బులు ఇవ్వకపోతే నా దగ్గరకు రా.” అని అంటాడు. “ఇది చూపిస్తే ఈ స్కూల్ లోనికి రానిస్తారు. ” అని అతని ఫోటో ఇస్తాడు. “లేదు! నన్నుస్కూల్లోకి రానివ్వరు. తోసేస్తారు.”. “ లేదు! ఆ ఫోటో చూపించు, కచ్చితంగా రానిస్తారు.” అని చెప్పి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఆ పెయింటింగ్ పట్టుకునే వెళ్లి ఒక చోట అడుగుతాడు. అతను దానికి 5000 ఇస్తా అని అంటాడు. విని అచ్యార్యపోతాడు. సరే అని అతను ఓడిపోవాలని కావాలని అన్ని చోట్లకు వెళ్లి అడుగుతాడు, ప్రతి చోట అదే 5000 ఇస్తా అని అంటారు ఆరోజు నుంచి అతను తనకి ఇచ్చిన ఫోటోని ముందు పెట్టుకుని తాను ఇచ్చిన బొమ్మని వేరే దాని మీద గీయటానికి ప్రయత్నిస్తాడు కానీ అవ్వదు. అలా చాల రోజులు గడుస్తూ ఉంటాయి. అతను అక్కడే పెయింటింగ్ స్కూల్ ముందు గోడలకు పెయింట్లు వేసుకొంటూ డబ్బులు సంపాదించేవాడు. ఆ గోడ ఎదురుగుండా పోస్టర్లు అతికించే వారు. అక్కడ ఎం పోస్టర్ ఉంటే, ఆ పోస్టర్ని గోడ మీద వేసేవాడు. అది చూసి ఆ సినిమా వాళ్ళు డబ్బులు ఇచ్చి బొమ్మలు వేపించుకునే వాళ్ళు. అలా బొమ్మలు వేయడం నేర్చుకున్నాడు. ఇప్పటికి అతని పర్సులో ఆరోజు ఆ కుర్రాడు ఇచ్చిన ఫోటో ఉంది. అయితే ఒక రోజు అదే పెయింటింగ్ స్కూల్ లో ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది ఆ ఎగ్జిబిషన్లో చాల మంది పెయింటర్స్ వచ్చి పెయింటింగ్స్ సబ్మిట్ చేసి వెళ్తారు. వాటిలో బాగున్నవి అన్నీ, అదే స్కూల్ ఎగ్జిబిషన్లో షోకేసు చేస్తారు. అయితే అప్పుడు ద్రోణ గారు అక్కడికి వచ్చి, తన స్టూడెంట్ పెయింటింగ్స్ చూస్తుంటారు. ఇంతలో అందరూ ఒక పెయింటింగ్ చుట్టూ గుమిగూడతారు. అది చూసి ఆయన అటు వెళ్లి ఆ పెయింటింగ్ చూసి షాక్ అయిపోతారు. ఎందుకు అంటే, ఆ పెయింటింగ్లో పెయింటింగ్ ఉంటధి , ఆ పెయింటింగ్ ఏంటంటే ఒక మనిషి చిన్న పిల్లాడికి ఒక పేపర్ ఇస్తూ ఉంటాడూ. ఆ పేపర్ లో ద్రోణ గారు 10 ఏళ్ళ క్రితం ఎనిమిది సంవత్సరాలు కష్టపడి నేర్చుకున ఒక పెయింటింగ్ ఉంటది. ద్రోణ చిన్న బాబుకు ఇచ్చిన పెయింటింగ్ ఉంటుంది. దాన్ని రిక్రీయేట్ చేస్తాడు. ఆ పెయింటింగ్ ని చూసి “నేను వేసిన పెయింటింగ్ని మళ్ళీ ఎలా వేయగలిగారు అంత చిన్న పేపర్ లో?”, ఆ పెయింటింగ్ని పట్టుకున్న మనిషి అచ్చం ద్రోణ లాగే ఉండటం చూసి అందరూ షాక్ అవుతారు. అదే రోజు రాత్రి ద్రోణ ఆ పెయింటింగ్ వేసిన వాడిని వెతుకుతాడు.కానీ దొరకడు. ఇక అతను, వాళ్ళ కూతురు, వాళ్ళ ఒక స్టూడెంట్ ముగ్గురు కలిసి రిటర్న్ వెళ్ళటానికి ఎయిర్పోర్ట్ వెళ్తుంటే, అర్ధరాత్రి రోడ్ మీద పెయింటింగ్ వేస్తున్న ఇతన్ని చూస్తార. అర్ధరాత్రి పెయింటింగ్ వేస్తున్నాడు అని చూసి, అప్పుడు వాళ్ళ డ్రైవర్ చెప్తాడు “ఇతనే సార్, ఆ పెయింటింగ్ ఏసింది” అని. అందరూ కార్ దిగుతారు, అతనితో మాట్లాడదాం అని. ద్రోణ గారిని చుసిన అతను, ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. వాళ్ళ కూతురు, స్టూడెంట్ వాళ్ళని అలా చూస్తూ ఉండిపోతారు.
అభయ్ – “బాగుంది బామ్మ. చాల బాగుంది. సరేలే, నేను ఇక వెళ్లి పడుకుంటా. నాన్న వస్తే తిడతారు. అవును బామ్మ అసలా ద్రోణ పెయింటింగ్ ఎం వేశారని 5000 ఇచ్చారు? మళ్ళీ ఈ పిల్లవాడు వేస్తే ఎందుకు ఇవ్వలేదు ?”
బామ్మ- “అప్పట్లో ఆ సమాజంలో, సంతకానికే విలువ. అందుకే, ఆ ద్రోణ గారి సంతకం చూసి ఇచ్చారు.
ఒకటి చెప్తా చూడు అబ్బాయి, మన జీవితంలో అయినా, పుస్తకంలో అయినా , సినిమాలో అయినా, ఎక్కడ అయినా, ఎవరికి అయినా కథ ఒకటే కథనమే వేరు. కొన్ని సార్లు కొన్ని కథల అంతాలు భాధగా ఉంటాయి ఎందుకంటే, దేవుడు అంతులేని భాధలు ఇవ్వడం కన్నా, ఒక కథకు బాధాకరమైన ఆంతం ఇవ్వడం మేలు అనుకుంటాడు.”
అభయ్ – “బామ్మ,ఈసారి కూడా దేవుడు రాలేదు కానీ కథ బాగా ముగిసింది కదా?”
బామ్మ- “దేవుడు కథలలోకే వస్తాడు, జీవితంలోకి కాదు. అయినా ఈ కథ మనదే , మనమే మార్చుకోవాలి నచ్చినట్టుగా. అర్ధమైందా? సరే ఇక వెళ్లి పడుకో.”
అప్పుడే ఇంట్లోకి ఒక మనిషి వస్తాడు…..
ఏకలవ్ – “ఏంటి అమ్మ ఇంకా పాడుకోలేదా?”
బామ్మ- “లేదు రా ని కథనే చెప్తున్నా……… వాడికి కానీ ని కథ గ చెప్పలేదు లే ……………..”
WRITTEN BY
The End G RITHISH VARMA
This guy is something ❤❤❤