301
0

స్వప్నం

301


“కలయా… నిజమా….” అని రింగ్ టోన్ గట్టిగా వినిపించడంతో నాకు మెలుకువ వచ్చి ంది..
ఎదోఆలోచిస్తూ , తెలియకుండా కుర్చీలోనేనిదప్ర
ోయాను.. చుట్టూ చూసాను.. ఎవరు లేరు, చాలా నిశ్శబ్దంగా వుంది..
టైం చూస్తే,్తే సాయంతం్రనాలుగు అయ్యి ంద.ి. లేచి టీపెట్టి, అత్తయ్య క,ి మావయ్య కి, మా ఆయనకి, ఆడపడుచు క,ి
బామ్మ కి, అందరికీఇచ్చి , నేను కూడా ఒక కప్ లో పోసుకుని గుమ్మం దగ్గర కూర్చు ని తాగుతున్నా ను.. అందరూ ఆరు
బయట కూర్చు ని టీతాగుతూ మాట్లాడుకంటున్నా ం…
నేను అత్తయ్యతో, ఈ రోజు నాకు రావాల్సి న రెండు లక్షలు అందుతున్నా యి., ఈ డబ్బు లు ఇచ్చి ప్రియని(మా
ఆడపడుచునీ) వాళ్ళ అత్తారింటికిపంపించి, ఫంక్షన్ గ్రాండ్ గా చేయమని చెప్పండిఅని అన్నా ను.. అందరూ నా వంక
ఆశ్చర్యంతో చూస్తున్నా రు.. అలాగేనమ్మ అని అత్తయ్య అంటూ లోపలికివెళ్ళి పోయింది.. వెనకాలే ప్రియ, మా ఆయన
కూడా వెళ్ళి పోయారు.. బామ్మ బయట ఎవరో పిలిస్తేవెళ్ళి ంది.. మావయ్య గారు, నేను మాతమ్ర ేఉన్నా ం..
మావయ్య నాతో అమ్మా స్వప్నా , నువ్వు చాలా కష్టపడుతున్నా వ్., పతి్ర అవసరాన్ని తెలుసుకుని
తీరుస్తున్నా వ్.. నిన్ను చూస్తుంటేనాకెంతో గర్వంగా వుంది.. నువ్వు ఈ ఇంటికొచ్చి న మొదట్లో ఎన్ని అవమానాలు
పడ్డావో నేను కళ్ళా రా చూశాను.. నీ సలహా కూడా గిట్టేదికాదు వరుణ్ కి, ఇంక మీ అత్తయ్య అయితేనిన్ను ఒక
పురుగుని చూసినట్టు చూసినా, నువ్వెన్నడు ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు.. నీదిచాలా మంచి మనసు తల్లి
అని అంటుండగా, బయట నుంచి బామ్మ., ఏరా ఆంజనేయులు ఇలా రా ఒకసారిఅనడంతో, మావయ్య గారు బయటకు
వెళ్ళా రు… నేను అక్కడేగుమ్మం దగ్గర కూర్చు ని, ఆలోచిస్తున్నా ను.. నిజమేమా మావయ్య గారు చెప్పింది…
నా పేరు స్వప్న.. నా పేరు లాగేనాకు కూడా ఎన్నో స్వప్నా లు ఉన్నా యి.. అవన్నీ నిజం చేసుకోవాలి
అనుకునేదాన్ని .. పదోతరగతిలో స్టేట్ ఫస్ట్ వచ్చి న నన్ను ., మా ఊరిప్రెసిడెంట్ ఫ్రీగా మంచి కాలేజి లో జాయిన్
చేయించి, నా చదువు కర్చు ఆయనేచూసుకుని, నాకు స్కా లర్ షిప్ కూడా వచ్చేలా చేశారు.. దానితో మా నాన్న కు ఏ
భారం లేదు కదా అని నన్ను ఇంటర్ చదవనిచ్చా రు.. ఇంటర్ లో కూడా, కాలేజ్ టాపర్ గా, డిస్ట్రిక్ట్్ట్రిక్ట్లెవెల్ లో ఫస్ట్
వచ్చా ను..
అందరూ నన్ను పెద్దఇంజనీర్ నీ ఐపోతాను అని, పెద్దపెద్దచదువులు చదివేస,ి ఊరికిమంచి పేరు తెచ్చేసి
పెద్దఉద్యోగం చేసేస్తాను అనేవారు.. నిజంగానేనిజం అనుకుని పొంగిపోయేదాన్ని …
ఎంసెట్ రాసి, మంచి యూనివర్సిటీలో, జాయిన్ ఐపోతాను అనుకుని మా నాన్నకు చెప్తే, ఈ చదువు
చదివిందిచాలు, చదివించేఓపిక, స్థోమత నాకు లేదు అని కచ్చి తంగా చెప్పేసి, నన్ను ఎగ్జామ్ కూడా రాయనివ్వలేదు..
ఎంతో మందిఎన్నో విధాలుగా చెప్పినా, వినిపించుకోలేదు.. నా కలలు అన్నీ కన్నీ లైపోయాయి.. ఇంట్లో ఉండివంట
పనులు నేర్చు కున్నా ను.. మా అమ్మ నా చిన్నప్పు డేచనిపోయినా, మా నాన్న రెండోపెళ్లి చేసుకోలేదు.. రోజు మా
నాన్నే నాకు వంట చేసిఇన్నా ళ్లు పెంచాడు.. ఇక నుంచి ఇంట్లో అన్నీ నేనేచూసుకోవడం మొదలు పెట్టాను.. మా నాన్న
పంచాయతీ లో పనిచేసేచిన్న గుమస్తా.. ఆ సరిసరిపోని డబ్బు లతోనేనన్ను పెంచాడు.. కొన్నా ళ్ళకిమ నానమ్మ,
తాతయ్య బాధ్యత కూడా మా నాన్న మీద పడింది…
ఇంతలో పండు గాడిఏడుపు గట్టిగా వినిపించింది.. నా ఆలోచనల నుంచి బయటకు వచ్చా ను.. పండు మా
ఆడపడుచు కొడుకు.. వాడిమొదటిపుట్టినరోజు ఇంకో వారం లో వస్తుంది.. వాడిపుట్టిన రోజు చాలా ఘనంగా చేయాలని
వాళ్ళ అత్తింటివాళ్ళు నిట్టూ రుస్తూ చెప్పా రు.. దానితో డబ్బు లు కోసం అడగటానికిప్రియ ఒక నెల ముందునుంచేమా
అత్తయ్య నీ, మ ఆయనని కాకా పడుతుంది.. దాని కోసమేనేను డబ్బు లు సిద్ధం చేశాను.. దానితో ఆనందం తట్టుకోలేక,
కొడుకు ,కూతురు వాళ్లఅమ్మ, పండు నీ కూడా పట్టించుకోకుండా లోపలికివెళ్ళి ఫంక్షన్ ఎలా చేయాలో అని ప్లాన్లు
వేసుకుంటున్నా రు…
నేను వెళ్లి పండు గాడిని బుజ్జగిస్తూ , ఒక బిస్కెట్ ప్యా కెట్ చేతిలో పెట్టి, మా పాప అక్షర(హనీ) తో ఆడుకోమని
పంపాను.. నేను లోపలికివెళ్ళగానేఏదోమాట్లాడుకుంటున్న వాళ్ళు సడెన్ గా ఆపేసి, సైలెంట్ అయిపోయారు.. నేను
నవ్వు కుని, అక్కడ వున్న నా బుక్,పెన్, నా ఫోన్ తీసుకుని బయటకు వచ్చి హాల్ లో సోఫా లో కూర్చు ని, బుక్ లో ఈ
నెల కర్చు లు, అవసరాలు రాస్తున్నా ను.. ఈ లోపు నాకు ఫోన్ వచ్చి ంద.ి. లిఫ్ట్ చేస్తే, నాకు డబ్బు లు ఇస్తా అన్న
సుబ్బా రావు గారు ఫోన్ చేసి, డబ్బు లు వాళ్ళ అబ్బా యి తో పంపిస్తున్నా ను, తీసుకోమని చెప్పా రు.. సరేఅండిఅని ఫోన్
పెట్టేశాను.. పదినిమిషాల్లో వాళ్ళ అబ్బా యి వచ్చి , బ్యా గ్ ఇచ్చి వాళ్ళ నాన్న గారు ఇచ్చా రు అని, లెక్క
చూసుకోమన్నా డు.. పర్లేదు బాబు నువ్వు వెళ్ళు అని చెప్పి, తను వెళ్ళా క లెక్క పెట్టి, సరిపోయాయి అని ఆ బ్యా గ్
తీసుకెళ్ళి మా అత్తయ్య చేతిలో పెట్టి, ఇదిగోండిప్రియకు ఇచ్చేయండిఅని చెప్పి, ప్రియా జాగత్ర్తగా కర్చు పెట్టుకో అని చెప్పి
వెంటనేవచ్చేసాను…
వంట గదిలోకివెళ్ళి వంట కోసం కూరగాయలు కోస్తు, మళ్ళీ ఆలోచనల్లోకివెళ్ళా ను…
నేను చదువు మానేసిన మూడు నెలల్లో మా నాన్న నాకు మంచి సంబంధం వచ్చి ందిఅని చెప్పి, మా నానమ్మ
ఆస్తిగా వచ్చి న ఒక ఏకరం పొలంలో, అర ఎకరం వాళ్ళకోసం వుంచి, ఇంకో అర ఎకరం ఇచ్చి నన్ను తోచినంతలో పెళ్లి
చేసివాళ్ళ బాధ్యత తీర్చేసుకున్నా రు..
కొత్తఇల్లు, కొత్తమనుషులు, కొత్తజీవితం మళ్ళీ ఎన్నో స్వప్నా లతో కొత్తఇంట్లోకిఅడుగు పెట్టాను.. ఇంటిని,
ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవాలి అనేఆలోచనతో వచ్చి న నాకు ఇక్కడ అన్నీ వింతగానేఅనిపించేవి.. మ అత్తయ్య కి
నేనెంత బాగా వంట చేసినా ఏదోఒక వంక పెడుతూనేవుండేది.. ఎప్పు డు కాలీ లేకుండా, ఏదోఒక పని చెప్తూ నే
వుండేది.. చాలా సార్లు పనులతో అలిసిపోయి, మా పుట్టింటికివెళ్లిపోవాలి అనిపించేది.. కానీ, కష్టమైనా, సుఖమైనా
అక్కడేఅనుభవించాలి అని చెప్పి పంపిన మా నానమ్మ మాటలు గుర్తొచ్చి ఆగిపోయేదాన్ని ..
నా కష్టాన్ని చెప్పు కుందాం అని చెప్పినా పట్టించుకోని నా భర్త, నా బాధను చూసికూడా ఏం మాట్లాడలేని మా
మామ గారు.. ఆడపిల్లకు ఇవన్నీ మామూలే అని కొట్టిపడేసేబామ్మ గారు…
నా వయసేవున్న నా అడపడుచుకిముందు సంవత్సరమేపెళ్లి చేశారు కానీ పట్టుమని పదిరోజులు
తిరగకుండానేపుట్టింటికివచ్చేసింది.. అబ్బా యి మంచోడేఅని పెళ్లి చేశారు కానీ, అబ్బా యి మంచోడేకానీ తల్లి చాటు
పిల్లోడు.. తల్లి ఎంత చెప్తేఅంత.. ఏదిచేయాలన్నా తల్లి నీ అడిగేచేస్తాడు.. తల్లి కాదంటేతినడం మానేస్తాడు, తినే
వాళ్ళని ఆపేస్తాడు.. ఇచ్చి న కట్నం తక్కు వ ఇచ్చా రని ఎప్పు డు ఎత్తిపొడుస్తు వుంటుందివాళ్ళ అత్త.. తల్లి వైపేమాట్లాడే
భర్తను భరించలేక ఏడుస్తూ వచ్చేసింద.ి. ఎన్ని సార్లు నచ్చచెప్పి పంపించినా మళ్ళీ మామూలే.. వచ్చి న పతి్రసారీ
ఏదోకటితీసుకెళ్ళి అత్తకు ఇస్తేనేఇంట్లోకిరానిచ్చేది.. వాళ్ళ ఇంట్లో పండగ వచ్చి నా, ఈ ఇంటినుండేమోసుకెల్లాలి.. ఇలా
అలవాటు పడిపోయారు ఇంట్లో..
ఇప్పు డు పిల్లోడు మొదటిపుట్టిన రోజు బాగా చేయాలి, కనీసం 2 లక్షలు ఐన కర్చు పెట్టిచేయాలి అని చెప్పి పంపించింది
వాళ్ళ అత్త., అందుకేనేను ఈ డబ్బు లు సర్ధాల్సి వచ్చి ంద.ి.
ఆలోచన నుంచి బయటకు వచ్చేలా మా పాప, అమ్మ మంచి నీళ్ళు ఇవ్వు అంటూ వంట గదిలోకివచ్చి ంద.ి.
దానితో నేను నా ఆలోచనకు కామా పెట్టి, నీళ్ళు ఇచ్చి పంపించి, వంట చేయటం మొదలు పెట్టాను.. కొంచెం సేపట్లో
వంట పూర్తిచేసిబయటకు వచ్చి టీవీ ఆన్ చేశాను, ఇంతలో బెడ్ రూం నుంచి మా అత్త, ప్రియ కూడా వచ్చి టీవీ దగ్గర
కూర్చు న్నా రు.. టీవీ చూడలనిపించక, నేను వెళ్లి పడుకుంటాను తల నొప్పిగా వుందని చెప్పి గదిలోకివెళ్లి అలా
పడుకుని, మళ్ళీ నా ఆలోచనల సుడిలో పడ్డాను..
మా ఆయనకు మంచి ఉద్యోగమేవుంది, బాగానేసంపాదిస్తున్నా రు.. చెప్పు కునేంత పెద్దకష్టాలు, అప్పు లు
లేవు.. కానీ ఆయనకు ఇంకా ఎదోచేసేయాలి, పెద్దబిజినెస్ చేయాలి, డబ్బు లు సంపాదించాలి అనేయావ.. ఆ బిజినెస్
కోసం ఏవో పయ్ర త్నా లు చేసేవారు.. ఈ లోపు కొత్తపరిచయాలు కలిగాయి.. బ్యా ంక్ లో లోన్ అప్లైచేస,ి డబ్బు లు తెచ్చి
ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు వాళ్ళతో కలిసి.. మొదట్లో లాభం లేకపోయినా పెట్టిన డబ్బు వెనక్కి వచ్చేది.. సంతోషం గానే
వుండేవారు.. పెట్టిన ఆరు నెలలో మంచి లాభం వచ్చి ందని పార్టీకూడా ఇచ్చా రు.. ఈ లోపు నేను తల్లిని కాబోతున్నా
అనేశుభవార్తవిన్నా ం.. నెలలు గడిచాయి.. అంతా బాగున్న సమయంలో, ఆయనతో బిజినెస్ లో వున్న పార్టనర్స్
మోసం చేసి, డబ్బు లతో పరార్ అయ్యా రు.. మొత్తం నష్టం లోకికూరుకుపోయారు ఈయన.. బ్యా ంక్ లోన్ ఎలా తీర్చా లి,
చేసిన అప్పు లు ఎలా తీర్చా లి అనేభయం పట్టుకుంది.. నాకు నెలలు నిండిఒక పాపకు జన్మనిచ్చా ను.. సంతోషాన్ని
కూడా ఆస్వా దించేపరిస్థితుల్లో లేరు.. అప్పు ల వాళ్ళు ఇంటిమీద పడ్డారు. నేనేమైనా సలహా ఇస్తేనచ్చేదికాదు
ఈయనకి.. నన్ను ఎందుకూ పనికిరాని దానిలగేచూసేవారు.. నా పని ఇంట్లో పని చేయటం, ఇంట్లో వాళ్ళని, పిల్లలను
చూడటం మాతమ్ర ేఅంటూ నన్ను చులకనగా చూస్తూ లెక్క చేసేవారు కాదు.. కానీ నేను ఆయన పరిస్థితి నీ చూస్తూ
ఉండలేక ఏదోకటిచేయాలని ఆలోచించాను..
నేను చదువుకున్న బుర్రతోనేఆలోచించి, నాకు మా నాన్న పెళ్ళి కిఇచ్చి న అర ఎకరం పొలం లో మొక్కలని
నాటి, నర్సరీచేసిడబ్బు లు సంపాదించాలి అని నిర్ణయించుకున్నా ను.. ఈ విషయం చెప్తేఒప్పు కోరు అని తెలిసిఎవరికి
చెప్పలేదు, కానీ మా మామ గారికివీటిమీద అవగాహన వుందని తెలిసిఆయన సలహా తీసుకుని, మొక్కల కోసం,
విత్తనాల కోసం, అలాగేభూమి కిసరిపోయేఎరువుల కోసం తెలుసుకున్నా ను.. వాటిని కొనడానికినా బంగారాన్ని
బ్యా ంక్ లో పెట్టీడబ్బు లు తెచ్చు కుని, మావయ్య చెప్పిన విధంగా ఇద్దరు మనుషులని పెట్టుకుని పని మొదలు
పెట్టాను.. నేను బయటకు వెళ్లాల్సి న పని లేకుండా మావయ్య సహాయం చేసేవారు..
నేను ఇంట్లోనేవుండి, మిషన్ కుట్టడం నేర్చు కున్నా ను.. నెమ్మదిగా చుట్టూ పక్కన వాళ్ళవి కుట్టడం మొదలు
పెట్టాను.. ఇదిచూసిమా అత్తయ్య ఎన్నో సార్లు మొకం చిట్లించుకునేది.. ఐనా లెక్క చేయక కష్టపడ్డా.. మంచి ఆదరణ
లభించడంతో చిన్న బోటిక్ పెడదాం అనిపించి, మా ఆయనకిచెప్పా ను.. ఒప్పు కోలేదు.. ఇవన్నీ ఏం అవసరం లేదు
అన్నా రు.. ఆయనకు వత్తాసు పలుకుతూ మా అత్తయ్య నన్ను నిందించింది.. కానీ నేను పట్టు విడువలేదు.. పెళ్లిళ్ల
సీజన్ లో మంచి గిరాకీవచ్చి ంది, దానితో ఇంట్లోనేచేసుకుంటూ కొంచెం మొత్తం సంపాదించాను.. అలాగేమొక్కలకి
మంచి రేట్ పలికిలాభం వచ్చి ంది..
ఈ విషయం చెప్తూ మా ఆయన చేతిలో డబ్బు లు పెట్టాను.. నన్ను లెక్క చేయని ఆయనకు నా మీద నమ్మకం
వచ్చి ందిఅనిపించింది.. నన్ను బొటిక్ పెట్టుకోమని చెప్పా రు.. సంతోషంతో ఆ వారం లోనేఇంటికిదగ్గర్లో,ఒక గదిరెంట్ కి
తీసుకుని, మా అత్తయ్య చేతుల మీదగా ఓపెన్ చేయించాను.. ముగ్గురు మనుషులని పెట్టుకుని స్టార్ట్ చేశాను.. అలాగే
మావయ్య గారిసహాయంతో నర్సరీనీ కూడా చుసుకునేదాన్ని ..
రెండు నెలల తర్వా త, మొక్కలని పెంచమని ర్యా లీ చేయటానికిమా జిల్లాకిఎం. ల్. ఏ వచ్చా డు.. ఆయన
చాలా మొక్కలు మా నర్సరీనుంచేతీసుకోవడానికికాంట్రాక్ట్ తీసుకున్నా రు.. దానితో మంచి లాభాలు అలాగేపేరు కూడా
వచ్చి మా నర్సరీకిమంచి గుర్తింపు వచ్చి ంది..
నేను మా బిజినెస్ నీ ఇంకా పెద్దదిచేసాము. స్టాఫ్ నీ కూడా పెంచాము.. అలా మా నర్సరీకిపేరు రావడం తో,
తెలిసిన వాళ్ళ ద్వా రా ఒక సీరియల్ ఆర్టిస్ట్ కిపర్సనల్ డ్రెస్్రె డిజైనర్ గా ఛాన్స్ వచ్చి ంది.. అలా అలా ఇండస్ట్రీలో వున్న
చాలా మందిసెలబ్రిటీస్ కిపర్సనల్ డిజైనర్ షాప్ గా మా బొటిక్ మారింద.ి. ఇంకో రెండు షాపులు కూడా రెంట్ తీసుకుని
సిటీసెంటర్ లో మనుషులని పెట్టుకుని నడిపిస్తున్నా ను.. వాటిని ఇప్పు డు మా ఆయన చూసుకుంటున్నా డు..
ఎప్పు డు అత్యా శకు పోకుండా, మంచి గిట్టుబాటు ధరలకేమావి అందుబాటులో ఉంచడం వలన పేరుతో
పాటు,గౌరవం కూడా లభించింది..
అలా ఒక స్త్రీఇంటిని నడిపించగలదు అనేనమ్మకం మా ఇంట్లోనేకాదు, మా ఊరిలో కూడా బలంగా
నాటుకుంది..
నాకు ఇప్పు డు ఒక ఆలోచన వచ్చి ంద.ి.నాలాగ ఇంట్లో మగ్గిపోయేఆడవాళ్ళకు స్వయం ఉపాధికలిగించాలని..
దాన్ని ఎలా ఐన మొదలు పెట్టాలి అని ఆలోచనలు చేస్తూ నేఇందాక కుర్చీలోనేఆలోచిస్తూ పడుకునిపోయాను…
“కలయా… నిజమా..” అంటూ రింగ్టోన్ నన్ను మేలుకొలిపింది..
నా స్వప్నా లు నేను నెరవేర్చు కున్నా ను.. ఇలా ఎంతో మందిస్వప్నా లు నిజం చేయాలని నా కోరిక…
— “స్వప్నం”

Leave a Reply

Your email address will not be published.