కరోనా వల్ల చాలా మంది తమ ఇంటి సభ్యలని, తమ మిత్రులలని, తమ బంధువులను కోల్పోయారు. కావున అందరూ మీ కోసం మీ వారి కోసం నియమాలను పఠించి, సరైన జాగ్రతలు తెసుకొంది.
నా ఈ చిన్న ప్రయత్నం మీలో కొందరికైనా జాగృతిని తెస్సుతుంది అన్ని ఆశిస్తున్నాను.
ఈ కథలోని పత్రాయిన సరయు అందరికీ కనెక్ట్ అవుతుంది.
కథ ఆరంభం
సాయంత్రం 7:00 అయ్యింది. సరయు
సరయు : నా పండుగాడు ఎం చేస్తునడో ఏమో
ఒక సరే ఫోన్ చేసి రమని చేపుడము.
ఫోన్ చేస్తుంది.
సరయు : ఎం మాస్టరు చాలా బిజీగా ఉన్నారు. ఎంటి సంగతి
నిఖిల్ : అదే ఎం లేదు బుజ్జి తల్లి. చిన్న పని మీద బయటకు వచ్చ.
సరయు : ఓహ్ అలాగ. మాస్క్ పెటుకున్నవ
నిఖిల్ : తొక్కలో మాస్క్ లే బుజ్జి
సరయు : ఒరేయ్ ఎదవ. మాస్క్ పెట్టుకొర ముందు.
నిఖిల్ : నా దగ్గర లేదు బుజ్జి.
సరయు : అయితే ముందు మాస్క్ కొన్నుకొరా
నిఖిల్ : సరే ఆగు.
షాప్ లో అన్న ని నిఖిల్ మాస్క్ ఒకటే ఎంత అన్ని అడుగుతాడు.
సరయు : ఒరేయ్ ఎంతో కొంత కొన్నుకోరా ముందు.
నిఖిల్ : సరే బుజ్జి
షాప్ లో అన్న దగ్గరనుంచి నిఖిల్ ఒక మాస్క్ కొన్నుకుంటడు.
నిఖిల్ : మాస్క్ కొన్నుకున్నరా బుజ్జి. సంతోషంగా ఉందా ఇప్పుడు.
సరయు : ఎదిచవులే ఎదవ.
నిఖిల్ : సరే బుజ్జి తిటదు ఇంకా.
సరయు : పని చూసుకో ఇంకా.
నిఖిల్ : సరే బుజ్జి.
ఈ పండుగాడికి బోతిగా భయం లేకుండా పోయింది.
రాత్రి 8:30 అయ్యింది
అమ్మ : భోజనం చేయడానికి రా మా సరయు తల్లి.
సరయు : వస్తున్న మా.
తిన్న తరువాత నిద్రపోతుంది.
ఉదయం 3:00 అయ్యింది
సెల్ ఫోన్ రింగింగ్….. నిద్రపోతున్న అమ్మాయి లేచి కాల్ ఎవరు చేశారు అని స్క్రీన్ మీద చూస్తుంది… స్క్రీన్ మీద యమధర్మరాజు అని వస్తుంది…
సరయు : నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు.
యమధర్మరాజు : నేను యమధర్మరాజు నీ…. యమపురి నుంచి మాట్లాడుతున్న..
సరయు : ఏంటి???
యమధర్మరాజు : నేను యముడు ని మాట్లాడుతున్నా..
సరయు : పొద్దు పొద్దున్నే వీసుగు తెపించడానికి, ఫోన్ చేయడానికి ఇంకెవరు దొరకలేదా నీకు( సరయు కోపంగా చెపుతుంది)
యమధర్మరాజు : నేను చెప్పేది నిజం బాల…
సరయు : ఇంకోసారి కాల్ చేస్తే బాగోదు అని కాల్ చేస్తే బాగోదు అన్ని చెప్పి, కట్ చేస్తుంది.
పొద్దు పొద్దున్నే ఫ్రాంక్ చేసే ఎవడో ఈ ఫాల్తూ గాడు.
యమధర్మరాజు మళ్లీ కాల్ చేస్తాడు.
సరయు : ఈరోజు నా చేతిలో చచ్చావ్ రా అనుకొని కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఏరా ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా… అసలే నిద్ర పాడు చేసావు పిచ్చ కోపం వస్తుంది.. నువ్వు ఇంకా చిరాకు తెప్పించకు.
యమధర్మరాజు : నేను నిజంగా యముడినే… కావాలంటే చెక్ చేసుకో… కాదనిపిస్తే అప్పుడు కాల్ కట్ చేసేసుకో…
సరయు : అమ్మో వీడు విసిగించే చేస్తున్నాడు
కొంచెం ఆలోచించి…
సరే అయితే చెక్ చేస్తా..
టక్ మని నా ఆధార్ కార్డు నెంబర్ చెప్పు..
యమధర్మరాజు : ఓకే అని xxxxxxxxxx చెప్తాడు.
సరయు : ఓహో నా ఆధార్ కార్డు నెంబర్ వీడి దగ్గర ఉందన్నమాట
అయితే నా అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉందో టక్ మని చెప్పు పైసల్ తో సహా….
యమధర్మరాజు : నీకు టు అకౌంట్స్ ఉన్నాయి. SBI,
AXIS…. ఇందులో ఏ అకౌంట్లో బ్యాలెన్స్ కావాలి
సరయు : సరయుకి ఒక క్షణం ఎం అర్థం కాలేదు. కొంచెం అయోమయంగా ఫేస్ పెట్టి SBI అంటుంది.
యమధర్మరాజు : అందులో 2197.58 ఉంది.
సరయు : వెంటనే గూగుల్ పే లో కి వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేసుకుంటుంది. సరాయుకి అయోమయంలో ఎం చేయాలో అర్థం కాదు. వెంటనే కరెక్ట్ గా అంతే ఉంది.. కొంచెం కంగారు పడుతుంది.
సరే ఈసారి లైవ్ థింగ్స్ అడుగుదాం అనుకుని
సరయు : నేను చిటికేస్తే ఫ్యాన్ … ఆన్/ఆఫ్ అవ్వాలి స్విచ్ వేయకపోయినా సరే.
యమధర్మరాజు : హ సరే …
సరయు : చిటికెలో ఫ్యాన్ ఆన్/ఆఫ్ అవుతుంది..
తనలో భయం మొదలవుతుంది.
సరయు : చివరిగా ఒక ప్రశ్న అడగచ (భయంతో)
యమధర్మరాజు. : సరే అడుగు.
సరయు : నాకు టిఫిన్ కి ఉప్మా కావాలి
( ఈరోజు వాళ్ల ఇంట్లో టిఫిన్ దోస అని తనకు తెలుసు. కావాలనే ఉప్మా అడుగుతుంది)
యమధర్మరాజు : సరే మీ అమ్మని పిలు..
సరయు : అమ్మ.. టిఫిన్ రెడీనా..
అమ్మ : కొండ వే పాడు పిల్లి దోస పిండి అంతా
నేలపాలు చేసింది. నువ్వు బ్రష్ చెయ్యి.
ఈ లోపు నేను ఉప్మా చేస్తాను.
సరయు : సరయుకి ఎందుకు ఎలా జరుగుతుందో అర్థంకాక షాక్ లో ఉంది.
ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది…
యమధర్మరాజు : హలో….
సరయు : ఫోన్ బెడ్ మీద పడేసి కొంచెం దూరంగా వచ్చి నిలబడి ఫోన్ వైపే చూస్తుంది..
భయపడుతూ… కొంచెం సేపటికి తేరుకొని హలో అంటుంది.
యమధర్మరాజు : ఇప్పటికైనా నమ్ముతావా..
సరయు : నాకు చాలా భయం వేస్తుంది.
యమధర్మరాజు : భయపడకు నీ ప్రాణాలు పట్టుకెళ్ళి పోవడానికి నీకు ఫోన్ చేయలేదు.
సరయు : మరి ఎందుకు చేశారు.
యమధర్మరాజు : నేను ఒక ప్రశ్న అడుగుతాను. నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్తే ఒకరి ప్రాణాలు నిలబెట్ట వచ్చు. అసలు నీకే కాల్ ఎందుకు చేశాను అంటే వాళ్ళిద్దరికీ కామన్ గా ఉన్నది నువ్వే.
సరయు : ఇంతకీ ఎవరు ఆ ఇద్దరు..
యమధర్మరాజు : నీ లవర్, నీ ఫ్రెండ్
సరయు : ఏమైంది వాళ్ళిద్దరికీ..( కంగారు పడుతూ)
యమధర్మరాజు : ఇంకా ఏమి అవలేదు ఇప్పుడు అవబోతుంది.
సరయు : ఏం అవ్వబోతుంది….
యమధర్మరాజు : వాళ్ళిద్దరి ఆయుష్ అయిపోయింది. కాకపోతే వాళ్లు చేసిన పాపాపుణ్యం సమానంగా ఉంది. అందుకే నువ్వు ఎవరు కావాలో కోరుకుంటే వాళ్లని వదిలేసి ఇంకొకరిని తీసుకెళ్ళిపోతాను.
సరయు : చాలా బాధపడుతు మీరు చెప్పేదినాకు అంతా అయోమయంగా ఉంది.
యమధర్మరాజు : నీకు ఎవరు కావాలో చెప్పు, ఎందుకు కావాలో చెప్పు.. నువ్వు కరెక్ట్ రీజన్ చెప్తే ఒకరిని బ్రతికించు కోవచ్చు..
సరయు : వాళ్ళిద్దరూ నాకు 2 కళ్ళ లాంటి వాళ్లు. వాళ్ళిద్దరు నాకు ఇంపార్టెంట్ . ఎవరు లేకపోయినా ఒక కన్ను లేకుండా లోకాన్ని చూసినట్టు ఉంటుంది.
యమధర్మరాజు : ఏం పర్లేదు బాల ఒక కన్ను తో కూడా లోకం బాగానే కనిపిస్తుంది. రెండు కళ్ళు లేకపోతే నే కష్టం.
సరయు : పోనీ వాళ్ళిద్దరినీ వదిలేసి నన్ను తీసుకోండి..
యమధర్మరాజు :భలే బాల.. నీ త్యాగం అమోఘం. కానీ అది కుదరదు. నీకు నిండు నూరేళ్లు ఆయుష్ ఉంది. నువ్వు ఒకరిని సెలెక్ట్ చేసుకోక పోతే ఇద్దరు చనిపోతారు.
సరయు : నాకు కొంత సమయం కూడా ఎవ్వకుందా చెప్పమని అడిగితే ఏం చెప్పలేను , అదే కాక నాకు ఈదరు ఒకటే (సరయు ఎడచడం మొదలుపెడుతుంది).
సరయు : ప్లీస్,అండి ఎవర్ని చంపొద్దు
యమధర్మరాజు : ఒక్క నిమిషం లైన్ లో ఉండమ్మ
మా చిత్రగుప్త పిలుస్తున్నాడు.
సరయు : ఎం అయ్యింది యమధర్మరాజు గారు?
యమధర్మరాజు : నువ్వు ఇంకా టెన్షన్ పడక్కర్లేదు బాల
సరయు : ఎందుకండీ ఇద్దర్నీ చంపకుండా వదిలేస్తున్నా రా
యమధర్మరాజు : లేదు బాల.. ఎవరిని చంపాలో మేము డిసైడ్ అయ్యాము..
సరయు : అయ్యో ఇంతకీ ఎవరిని అండి( కంగారుపడుతూ)
యమధర్మరాజు : నీ లవర్ కి కరోనా పాజిటివ్ వచిందెంత. అందుకే మేము అతడిని తీసుకెళ్లడానికి ఫిక్స్ అయ్యాం. వదిలితే అందరికీ వైరస్ ని అంటిస్తాడు. ఇంక నీతో మాకు పని లేదు బాల ఇంకా సెలువు.
సరయు : అయ్యో ధర్మరాజా … నేను చెప్పేది వినండి.. హలో.. హలో.. ఫోన్ కట్ అవుతుంది.
అమ్మ : ఎంతసేపు మొద్దు నిద్ర లే ఇంకా..రాత్రంతా ఫోన్ తో కూర్చోవడం పొద్దున్నే పదింటి దాకా పడుకుని దొర్లడం.. లే ఇంకా…
సరయు :సరయు అకస్మాత్తుగా నిద్రా లేస్తుంది… రూమ్ అంతా ఒకసారి అటు ఇటు చూస్తుంది.
అమ్మ : ఏంటే తెగ కలవాట్లు పడుతున్నావు. కల ఏమైనా వచ్చిందా.
సరయు : అయోమయంగా చూస్తుంది.
అమ్మ : లేచి ఫ్రెష్ అవ్వు. టిఫిన్ చేద్దువుగాని…
( వెళ్ళి పోతు….)
సరయు : అమ్మ… ఈరోజు టిఫిన్ ఏంటి…
అమ్మ : దోస… త్వరగా బ్రష్ చెయ్యి… వేడివేడిగా తిందువుగాని..
సరయు :సరే అమ్మ… అయితే నాకు వచ్చింది కలే అన్నమాట. ఎందుకైనా మంచిది మన ఎదవకి(నిఖిల్) call చేద్దాం.. అసలే అస్తమానబేవర్స్ గా బయట తిరుగుతాడు.
తన లవర్ నిఖిల్ కి కాల్ చేస్తుందే…..
నిఖిల్ డైలర్ టోన్… నీ కాళ్లని పట్టుకు వదలన న్నది చూడే నా కళ్ళు.. ఆ చూపులనల తొక్కుకు
వెళ్ళకు దయలేదా అసలు.. నీ కళ్ళకు కావలె
కాస్తాఏ కాటుకలా నా కలలు…
సరయు : ఆ కలలు వచ్చే చస్తున్నాం ఇక్కడ…
కాల్ లిఫ్ట్ చేయరా బాబు…
నిఖిల్ : నా బుజ్జి సరయు తల్లి చెప్పు మా.
సరయు : హమ్మయ్య అనుకుని… ఏంటి పొద్దున్నే రోడ్లు ఎక్కేసావా కార్ సౌండ్లు వినిపిస్తున్నాయి…
నిఖిల్ : హా అవును.. సరుకులు తీసుకురావడానికి షాప్ కి వచ్చా.. మళ్లీ షాప్స్ early గా క్లోజ్ చేస్తారంట.. లాకడౌన్ కదా..
సరయు : ఓహ్ అందుకా..
నిఖిల్ : అయినా ఎంటి నా ప్రేయసికి పొద్దున్నే ఇంత ప్రేమపొంగి పోతుంది ఏంటి…. కొంపతీసి నాకు కరోనా వచ్చి కాలం గడిపేసి నట్లు కల ఏమైనా వచ్చిందా..
సరయు : కొంచెం సేపు ఆగి.. ఎడ్చావులే అదేం లేదు..ఊరికే కాల్ చేశా అంతే.. సరేగాని మాస్క్ పెట్టుకుని వెళ్ళావు కదా..
నిఖిల్ : నాకు నీకన్నా భయం ఎక్కువే బాబు.
ఇప్పుడు కూడా మాస్కు పెట్టుకుని నీతో
మాట్లాడుతున్న…
సరయు : సరే జాగ్రత్త… త్వరగా ఇంటికి వెళ్ళిపో..
వెళ్ళాక ఫోన్ చెయ్యి..సరే నా.
నిఖిల్ :సరే రా బుజ్జి తల్లి. లవ్ యూ
సరయు : లవ్ యూ రా పండు.
హమ్మయ్య… అయితే ఇదంతా కలే…అమ్మో ఈ కరోనా మామూలుది కాదు ఇంట, బయటే కాదు కలలోకి కూడా వచ్చేస్తుంది.. అయితే కరోనా వస్తే కాల యముడు కూడా కనికరించడేమో… దీనితో చాలా జాగ్రత్తగా ఉండాలి…