180
0

చివరి కోరిక ప్రేమతో

180

కె.జి. హెచ్ ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్ దగ్గర రామస్వామి కళ్ళు మూసుకొని తల గోడకు ఆనించి కూర్చొని ఉండగా,ఎవరో తన చేతిపై చేయి వేశారు ఎవరా అని కళ్ళు తెరిచి చూసాడు, మనవడు హర్ష కనిపించాడు,వాడికి ఈ మధ్యే పెళ్లి అయింది.తన పక్కన కుర్చీలో కూర్చుంటూ ఏమైంది తాత నానామ్మకి అని అడిగాడు,రామస్వామి తడిచిన కళ్ళు తుడుచుకుంటూ డాక్టర్ ఎదో గుండె జబ్బు 12 గంటలు నిర్విరామంగా ఒపరేషన్ చేయాలి,చేసిన కానీ కేవలం 10 సేతమై బతికే అవకాశం ఉంటుంది అని చెప్పారు రా అని అన్నాడు చాలా దినగా బాధతో కన్నీరు పెట్టుకుంట్టు.ఎంత సమయం అయింది లోపలకి తీసుకొని వెళ్ళి అని అడిగాడు హర్ష.ఇప్పుడే ఒక్క ఐదు నిమిషాలు అయింది అన్నాడు.

సరే! ఏమైనా తిన్నవ తాత రా కిందు వెళ్ళి తినడం అన్నాడు హర్ష,నాకు వదు నువ్వు పోయి తిను అని చెప్పాడు నీరసంగా,రా తాత రా అని బలవంతంగా హోటల్ కి తీసుకొని వెళ్ళాడు.అవును! తాత నానామ్మ ని నువ్వు ఫస్ట్ టైం ఎప్పుడు చూసావా అని తాతని అడిగాడు తాతయ్య మూడ్ మార్చే ప్రయత్నం చేశాడు.
అవి అని ఇప్పుడు ఎందుకు రా నాన్న వదులే అని అన్నాడు రామస్వామి,చెప్పు తాత అని బతిమలాడు.
మాది రామాపురం ఇదే విశాఖపట్నం తీరంకి కొన్ని కిలమీటర్ల దూరంలో సముద్రం మధ్య ఓ చిన్న లంక గ్రామం, అది 1955 జనవరి 20 వ తేదీ మీ నానామ్మ పుట్టిన రోజు,ఇప్పటిలా ఆసుపత్రులు లేవు ఇంటిలోనే కాన్పు అయింది మా అత్తకి, విషయం తెలిసి పరుగు పరుగున ఇంటికి వెళ్ళాను అదే మొదటి సారి చూడటం నన్ను చూసి నవ్వింది మీ నాన్నమ్మ. టిఫిన్ పూర్తి చేయి,బీచ్ రోడ్డు లో నడుస్తున్నారు,రామస్వామి తనలో తను నవ్వుకుంటున్నాడు,ఏమైంది తాత ఎందుకు నవ్వుతున్నవు అని అడిగాడు.

ఏమిలేదు భార్యకు నామకరణం చేసిన మొదటి భర్త నేనే అనుకుంటున్న అని మళ్ళీ నవ్వాడు.నువ్వు పేరు పెట్టావా నానమ్మకి అని అన్నాడు ఆశ్చర్యంగా, అవును నేనే జనకిదేవి అని పేరు పెట్టాను. మీ నానామ్మ మొదటి మాట ఏమిటో తెలుసా? బావ ఆన్నడి అప్పటి నించే నాపై ప్రేమనీ నింపుకున్నడీ మీ నాన్నామ్మ అని మాట్లాడుతూ హాస్పిటల్ కి తిరిగి వచ్చారు అప్పటి టైమ్ 11 అయింది.తాతయ్య మొహం మళ్ళీ నీరసం అయింది. హాస్పిటల్ ని చూసి.
కొంచం సేపు ఇద్దరు మూనగా ఉన్నారు. తాతను అల చూసి హర్ష చాలా బాధపతున్నడు.మీ నాన్నమ్మ ఎప్పుడు అనేది బావ మనం ఎప్పుడు చాచిపోతామో ముందే తెలిస్తే బాగుంటది కదా బావ అని అడిగింది,అదేమీ మాటలే అని కోపం పడే వాడిని నేను, అబ్బ బావ కోప్పడకు అలా ఎందుకు అన్నాను అంతే నువ్వు చనిపోయే క్షణం ముందు నేను పోతాను బావ అందుకే అని అన్నేడి.చా ఏమి ఈ మాటాలు మనం నిండు నూరుయెల్లు కలిసే ఉంటాం అని అనే వాడిని.ఇప్పుడు కాదు! బావ ఇది నా చివరి కోరిక అనుకో బావ అని అనేది.

తాత నీ భుజం పైన 3 గీతాలు ఉన్నాయి కదా వాటి కథ ఏంటి తాత నా చినప్పుడు నించి అడుగుతున్న నువ్వు ఎప్పుడు చెప్పలేదు నాకు అని అడిగాడు,తన మనస్సులోని బాధ పోగొట్టం కోసం మనవడి ప్రయత్నం చేస్తున్నాడు అని గ్రహించిన రామస్వామి మనవడి భుజంపై చేయివేసి ఇవి గీతాలు కాదు రా పెద్ద పులి గొరురకు అని చెప్పాడు.పెద్ద పులిలా ! అని ఆశ్చర్యంగా అడిగాడు.అవును అప్పటికి ఇంకా మాకు పెళ్లి కాలేదు ఓ సారి మీ నాన్నమ్మ నాతో మొదటి సరి అడిగిన మొదటి కోరిక “కాలశాంతి పువ్వు ” కావాలి బావ అని అడిగింది.అవి చాలా అందంగా ఉంటాయి అంటా బావ వెన్నెల్లో ఇంకా చాలా బాగుంటుంది అంటా నాకు తీసుకొని రా బావ అని అడిగింది ,ఎలాగైనా తీస్కో
రావాలి అని గట్టిగా నిరనయించుకున్నాను కానీ నాకు ఆ పువ్వు ఎలా ఉంటాయో తెలీదు,ఇది వరుకు నేను ఆ పేరు కూడా వినలేదు కేవలం మీ నానమ్మ మాట కోసం సరే అనేశాను.ఊరు కోసం బాగా తెలిసిన ఒక్క గుడి పూజారిగారు ఒక్కరే, పరుగున అయిన దగ్గరకు వెళ్ళాను.పూజారి గారు నాకు “కాలశాంతి పువ్వు” అని అడిగాను.అయన ఈ మాట వినగానే ఆశ్చర్య పోయాడు,మొహంలో భయం ఛాయలు అలుమకున్నాయి. ఆ పువ్వులు మన ఊరిలో ఉండవు, అయినా నీకు ఎందుకు ఆ పువ్వులు కోసం వాటికోసం ప్రయత్నం మానుకో అని చెప్పుడు పూజారి భయంతో కూడిన గొంతుతో.ఎందుకు మీరు అంతా భయపడుతున్నారు? ఎక్కడ ఉంటాయో చెప్పండి అని అడిగారు.నేను చెప్పాను పో అని నన్ను పూజారి బయటకి తోసాడు.

ఎందుకు అయినా అంత భయపడిపోతున్నారు నేను అడిగింది ఓ పువ్వు కోసమై కదా అని నడుచుకుంటూ తీరంలో ఈసుక టినెలు పైన పడుకోని ఆలోచిస్తూ నిద్రపోయాను లేచే సరికి రాత్రి అయిపోంది.నా పక్కనే నా సేహ్నితుడు కృష్ణ కుర్చీని ఉన్నాడు.నువ్వు ఎప్పుడు వచ్చావని అని అడిగాను.వాడు ఇప్పుడే వచ్చాను కానీ నువ్వు ఎంటి రా ఇక్కడ పడుకున్నవ్ అన్నాడు.అది నాకు కాలాశాంతి పువ్వు కావాలా రా అన్నాను. కృష్ణ కుడా భయంపడుతు ఏరా! చావలి అని ఉన్నదా అన్నాడు.నాకు ఆశ్చర్యం వేసింది ఎందుకు అలా అంటున్నావురా? అని అడిగాను.ఆ పువ్వులు సీత లంకలో ఉంటాయి,తెలుసుగా ఆ లంకలో ఏమి ఉంటాయో ఆ భయంకర అడివిలో,దాదాపు పది పదిహేను పెద్ద పులులు ఉంటాయి.అక్కడకి వెళ్ళి తిరిగి వచ్చిన మనిషిలేడు ప్రయత్నం మానుకో అని చెప్పుడు.అది కాదు రా! కృష్ణ జానకి అడిగిన మొదటి కోరికరా ఆలోచించారా, వెళ్ళడం నువ్వు లోపలికి రావదు నేను వెళ్ళి పువ్వు తెంచి వస్తాను రా రా కృష్ణ అని బతిమలాడాను.సరే సరే వెళ్ళడలే అన్నాడు కృష్ణ.సరే పడవ తీయి అన్నాడు ఏంటి ఇప్పుడా! అన్నాడు. హ ఇప్పుడే అన్నాను,అలాగే పడవ తీశారు కొంత సమయానికి సీత లంక చేరుకున్నారు.సరే నేను వెళ్ళతునాన్ను నువ్వు ఇక్కడే ఉండు అన్నాను కృష్ణతో ,రేయ్ రామ ఇదిగో ఈ కత్తి తీసుకో అని బోట్ లో నించి ఓ పెద్ద కత్తి తిసియిచ్చి జాగ్రత్త రా అని చెప్పాడు కృష్ణ, నేను తీరం నించి అడివి వైపు నడుస్తున్న కృష్ణ గాడు వెనక నించి అగు అగరా నేను వస్తున్న అని పరుగేతున్నాడు. చీకటి లో వెన్నల వెలుతురులో అడివి అందంగా కనిపించింది కాని అడివిలో పులులు కోసం ఆలోచిస్తేనే చాలా భయంగా ఉంది కానీ బయటకి చెప్పలేదు,చెప్పితే కృష్ణ భయపడతాడు అని. మెల్లిగా లోపలికి వెళ్ళాము అడివిలో కొంత దూరం వెళ్ళక పువ్వు కనిపించాయి, జానకి చెపితే ఏమో అనుకున్న కానీ ఆ పువ్వు నల్లటి నాలుగు రేకులతో చిన్న తెల్లటి మచ్చలతో వెన్నెల వెలుగులో మెరిసిపోతున్నాయి.కృష్ణ గాడు కళ్ళు మెరిసిపోతున్నాయి ఆ పువ్వుల వెలుగుకి,పువ్వులు కోసి వెనకి తిరిగాము మా ముందు పెద్ద పులి ముద్దురు గోధుమ రంగులో వెన్నెల వెలుగులో భయంకొలేపే భయంకరమైన గర్జన చేస్తూ మాపైకి ఎగిరింది,కృష్ణ కళ్ళు తిరిగి పడిపోయాడు వెంటనే కృష్ణని నా వెనకాల పొదలోకి తోసి కత్తితో నాపైకి వస్తున్న పెద్దపులి మొహం పైన నరికను,గాయం నొప్పితో అది ఇంకా రెచ్చిపోయి మళ్లీ పైకి లేచి పంజాతో ఎడమ భుజం పై దాని పదునేన గొరులాతో గీసింది,కోపంతో కుడిచేతిలో కత్తితో దాని తల నరికను పొదలో నించి కృష్ణ గాడిని లేపే ప్రయత్నం చేశాను రే కృష్ణ లేరా లేరా అని గట్టిగా అరిచే సారికి లేచి కూర్చున్నాడు, పులి తల కనిపించింది రేయ్ చంపేసావు ఏంటిరా నేనే చంపుడం అనుకున్నారు, ఏడిచవులే లేపాడు ఎలాగో తిరిగి పడవ దగ్గరకి వచ్చాము,కృష్ణ దేవుడు దయ వాళ్ళ ఇంకో పులి కనిపించాలేదు రా అంటూ పడవ తీశాడు.నేను గాయంకి గూడ కట్టి పువ్వు చూస్తూ కూర్చున్న,ఇవి చూసి జానకి చాలా సంతోషం పడతాడి,తన పెద్ద నేరేడు పండ్లు లాంటి కళ్ళు ఆశ్చర్యంతో ఇంకా పెద్దవి అవుతాయి, అప్పుడు జానకి ఇంకా అందం ఉన్నతాడి.ఇవి చూసి జానకి హంస నడక కాస్తా జింక పరుగు అవుతాడి అని ఊహాలోకి వెళ్ళిపోయాను,దూరంగా తీరంలో ఎవరో పడవ తీసి సముద్రం లోకి వస్తున్నారు,కృష్ణకి రాజు కనిపించడు ఓ రాజు ఏమైందిరా ఈ రాత్రి అప్పుడు పడవ తీస్తున్నవ్ అని అరుస్తూ అడిగాడు,రంగయ్య కూతురు జానకి పాము కాటేసింది వేద్యుడు కాటుకి విరుగుడు కాలశాంతి పువ్వు రసం కావాలి అన్నాడు. ఈ మాట విని ఓడు చేరగగే ఇంటికి పరుగుతీసాను, భుజం దెబ్బ నించి రక్తం కరుతున్నది,నాకు కన్నీరు ఆగలేదు ఇంటికి చేరుకున్నాను జానకి మంచంపైన ముర్చాపొయి ఉన్నది.మా అత్త నన్ను చూసి ఓరే నీకు ఏమైంది ఈ గాయం ఏంటిరా ? అన్నది భయంతో,చేతిలోని పువ్వు అత్త చేతిలో పెట్ట మోనం గా బయట అరుగుపైన కుర్చిందిపోయా జానకిని అలా చూసి నాకు భుజం గాయం కన్న పక్కన ఉన్న గుండె బాధ ఎక్కువగా ఉంది. వెద్యుడు మందు తీసి జానకి నోటిలో పోశాడు, కొంచం సేపు తర్వాత జానికి కళ్ళు తెరిచింది అని అత్త బయటకి వచ్చి అర్చిండి,నేను వెంటానే లొపలికి వెళ్ళాను తను నన్నే పిలుస్తున్నది బావ బావ .. అని పిలుపుతో నాకు మళ్ళీ ప్రాణం వచ్చింది.ఇప్పుడు భుజం గాయం నొప్పి తెలిసింది ప్రాణం వచ్చింది కదా! స్పర్శ కూడా వచ్చింది,మరుసటి ఏటా మాకు పెళ్లి అయింది,జానకి పడుకొనెప్పుడు దుప్పటి మొహం వరుకు కప్పుకొని ఉంటాది,నాకు ఏమో అలా పడుకుంటే అదే శవం పడుకున్నటూ కనిపిస్తుంది నాకు చాలా భయం, మీ నానామ్మ నన్ను భయపెట్టడం కోసం అప్పుడు అప్పుడు అలా చేసేది అని పాత సంగతులన్నీ చెప్పి నవ్వుతున్నాడు రామస్వామి,తాత మొహంలో నవ్వు చూసి హర్ష కూడా నవ్వాడు.

అప్పటికి సాయంత్రం అయిపోంది, మీ కథ విన్నటూ టైమ్ కూడా తెలియలేదు తాత అని ఫోన్ చూసాడు,గౌతమి తన వైఫ్ నించి 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. తిరిగి కాల్ చేసాడు గౌతమి చిర్గా మాట్లాడుతున్నాడి ఇదిగో ఇలా నా బుర్ర తినకు అని కాల్ కట్ చేశాడు,చిరగ వచ్చి కూర్చొన్నాడు.ఏమైంది రా అని అడిగాడు.అసలు పెళ్లి అందుకు చేసుకున్నా అని బాధపడుతున్న తాత అని అన్నాడు,అసలు నువ్వు నానమ్మ అప్పుడు గొడవ పడలేదా తాత? అని అడిగాడు. మీ నానమ్మ నెలలో మూడు నాలుగు రోజులు నాపైన చిరాకు,కోపం చూపేది ఆ సమయంలో చాలా బలహీనంగా ఉండేది.మరి పటిక్యులర్ గా మూడు నాలుగు రోజులు అదేమైనా రులే మీ ఇద్దరికీ అని అన్నాడు హర్ష ప్రశ్నార్థకం గా మొహం పెట్టీ.కాదురా మనవడా నీకు అర్దం కాలేద అని మనవడి వైపు చూసాడు, హహహ అర్థమయ్యింది అని అన్నాడు. మరి నువ్వు ఆ టైంలో నువ్వు ఏమి చేసివాడివి అని అడిగాడు. నేను ఆ సమయంలో తన్ని రోజు ప్రేమించే దాని కన్న కొంచం ఎక్కువ ప్రేమించే వాడిని తన దగ్గరకి తీసుకొని నేను ఉన్నాను అని ద్దైర్యం చేపేవాడిని.ఒక్కటి గుర్తుపెట్టుకో వాళ్ళ కోపం చిరాకు చూపేది నాకు ప్రేమ కావాలి కొంచం లాలన కావాలి అని అర్థం.ఆడవాళ్ళని బాగా అర్థం చేసుకున్నావు తాత నువ్వు అని అన్నాడు హర్ష నవ్వుతూ,లేదు లేదు నేను మీ నానమ్మని మాత్రమే అర్ధ్మచేసుకున్న ,ఆడ వాళ్ళు ఒకే టైటిల్ తో ఉండే వేరు వేరు అర్థాలు,కథలు ఉన్న పుస్తకాలు అని అన్నాడు మనవడితో ఇలా మాట్లాడుతూ ఉండగా రామస్వామి కొడుకు కోడలు (హర్ష అమ్మ, న్నాన) వాళ్ళని చూసి సరే నువ్వు నా మనవరాలు దగ్గరకి వేళ్ళూ ఎలాగో అమ్మానాన్న వచ్చారు కదా! అని హర్ష నీ ఇంటికి పంపించేశారు.హర్ష దారిలో గౌతమి కి ఇష్టమైన స్వీట్స్ కొని తీసుకొని వెళ్ళాడు.హర్ష వెళ్లేసరికి గౌతమి పడుకొని ఉంది,టేబుల్ పైన వండిన అని అలాగే ఉన్నాయి,అంటే గౌతమి కూడా భోజనం చేయలేదు అందుకే అని కాల్స్ చేసింది,తన పైన కోపం పడిండుకు తన పైన తనకే కోపం వేసింది.బెడ్ రూంలోకి వెళ్ళి గౌతమి ని నిద్రలేపి చిన్నగా నవ్వి లే భోజనం తిని అని తానే తన చేతులతో గౌతమి కి తినిపించాడు.తరువాత గౌతమిని దగ్గరకు తీసుకొని సార్రీ (sorry) కోపంగా మాటలుఆడను కదా! ఇంకా ఎప్పుడు అలా చేయనురా ప్రామిస్ అని చాలా సేపు తనతో మాట్లాడి తనకి నొప్పిని మర్చిపోయేలా చేశాడు.తన కోసం తెచ్చిన స్వీట్స్ తినిపించాడు. హర్షలో మరుపు చూసి గౌతమి చాలా అనందపడింది.గడియారం 8 గంటలు కొట్టింది,సరే తయారు అవు హాస్పిటల్ కి వెళ్ళాలి అని లేపాడు,కొంచం సేపటికి ఇద్దరు హాస్పిటల్ కి వచ్చారు. ఆపరేషన్ థియేటర్ ముందు నించోని ఉన్న తాత పదేపదే వాచ్ చూసుకుంటున్నాడు.టైమ్ అయిపోండి డాక్టర్ బయటకి వచ్చి దీనంగామొహం పెట్టీ సోర్రీ అని వెళ్ళిపోయాడు.తాతయ్యా కింద కుల్భాడిపోయాడు,నేను నాన్న వెళ్ళి అయను లేపే ప్రయత్నం చేసాము కన్ని మావాళ్ళ కాలేదు. నాన్నామ్మ ని లోపలి నించి మొహం వరుకు తెల్ల దుప్పటి కప్పి తీసుకొని వచ్చారు.

తాత అది చూసి ఒరేయ్ చూసావా మీ నానమ్మ నన్ను భయపైడం కోసం దుప్పటి కప్పుకొని వచ్చింది.జానకి నాకు భయంగా ఉంది లే జానకి లే జానకి అని గట్టిగా ఏడుస్తున్నడు రామస్వామి.మీ నాన్నమ్మ మాట నిలబెట్టుకుంది రా నాకన్నా ముందే నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోండి రా అని పెళ్ళాం కాలు పడుకొని ఏడుస్తున్నాడు చాలా సేపు ఏడిచడు ఒక్కసారిగా ఏడుపు అగిపొంది, తాత చేతులు కిందపడాయి రామస్వామి కూడా పెళ్ళాంతో నే వెళ్ళిపోయాడు.ఈ దృశ్యం చూసిన హర్ష,గౌతమి,కొడుకు, కోడలు మరియు డాక్టర్స్ సైతం నిర్గతాపోయరు..

రామస్వామి జానకి పుట్టిన క్షణం నించి తన ఐదెళ్లే చిన్ని మనస్సులో ప్రేమ మొక్కని నాటుకున్నడు,దాని 75 యేళ్లు తనలోనే మహా వృక్షం అయింది.ఎంత మహా వృక్షమైన ఓ గాలి వానకి పడిపోతాడి,ఈ కథలో గాలి వాన జానకి దేవి మరణం దాని గాలికి వృక్షం,రామస్వామి పడిపోయాడు.తాత కూడా తన మాట నిలబెట్టుకున్నడూ అని హర్ష అనుకున్నాడు.ఓ యేడాది తర్వాత హర్ష గౌతమి లాకు ఇద్దరు కవల పిల్లలు ఓ కొడుకు,కుతూరు పుట్టారు.వాళ్ళకి రామ్,జాను అని పేర్లు పెట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published.