362
0

ఆర్టికల్-5

362

                  పార్ట్-5

               అప్పటి మద్రాసు ప్రాంతంలో కడలడై అడివి పక్కనే ఉన్న పార్వతీఅమలై అనే పల్లెలో మద్రాసులో తక్కువ కులస్తులుగా పిలవబడే తులువవెల్లలా కులానికి చెందినవారు ఎక్కువగా నివశించేవారు వాళ్ళల్లో నెడుంచెలియన్,ఆముతమ్మ అనే దంపతులు కూడా ఒకరు,వీళ్ళకి ఒక ఐదు ఏళ్ల కుమార్తె  ఉండేది.సహజంగా అప్పటి సమాజంలో తక్కువ కులస్తులని పెద్ద కులం వాళ్ళు,ధనవంతులు బానిసలుగా చూసేవాళ్ళు.ఒక వైపు పేదరికం మరో వైపు ఈ అణచివేత రెండు తమ బతుకుల్ని కష్టం చేస్తున్నా నెడుంచెలియన్,అముతమ్మ సంసారం మాత్రం సమాజంతో ఏ పట్టింపు లేకుండా సాఫీగా సాగిపోయేది.ఒక వర్షం పడుతున్న రాత్రి నెడుంచెలియన్ పొలానికి పోయి తిరిగి ఇంటికి వచ్చిన సమయానికి అముతమ్మకి బాగా జ్వరం కాసి ఉంది,ఎప్పటిలాంటి మామూలు జ్వరమే అనుకోని కాస్త వేడి నీళ్లు తాగి తడి గుడ్డ వేసుకొని పడుకుంది.కొన్ని గంటలు గడిచి అర్ధరాత్రి అయ్యే సమయానికి జ్వరం తీవ్రత పెరిగి అముతమ్మ స్మృతి తప్పి పడిపోయింది.భారీ వర్షం అందులోనూ అర్ధరాత్రి కావడంతో పక్క పట్టణంలో ఉన్న ఆసుపత్రికి కూడా తీసుకువెల్లే అవకాశం లేకపోయింది.తండ్రి కూతుర్లు ఎం చెయ్యాలో తెలియక భయంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.అదృష్టవుసాత్తం ఆ ఊరిలోనే రామేశ్వరన్ అనే డాక్టర్ ఉండేవాడు.బాగా డబ్బున్న పెద్ద కులంలో పుట్టినప్పటికి ఆ పెద్దాయన అందరితో మంచిగా మెలిగేవాడు.తండ్రి,కూతుర్లు వెంటనే అముతమ్మని రామేశ్వరన్ దగ్గరకు తీసుకువెళ్లారు.అంత అర్ధరాత్రి పూట కూడా అతడు పెద్ద మనసుతో అముతమ్మకి చికిత్స చెయ్యడానికి ఒప్పుకున్నాడు.ఐతే చికిత్సకు కొన్ని మందులు అవసరం అని,కుదిరినంత తొందరగా పక్కనే ఉన్న పట్టణానికి వెళ్లి ఆ మందులని తీసుకురావల్సిందిగా డాక్టర్ నెడుంచెలియన్ కి చెప్పగా, అతడు తన కూతుర్ని తల్లికి తోడుగా ఉంచి వెంటనే పట్టణానికి బయలుదేరాడు.పెద్ద వర్షం పడుతూ ఉండటంవల్ల తిరిగి రావడం కాస్త ఆలస్యం అయింది.అతడు తిరిగి ఆసుపత్రికి చేరుకున్న సమయానికి తన కూతురు గది బయట కూర్చొని ఏడవడం గమనించాడు.నెండుచెలియన్ కి ఎందుకో పరిస్థితులు చెయ్యి దాటుతున్నాయి అనిపించి తన కూతుర్ని ఎం జరిగింది అని ఆరాతీయగా,ఆమె గుక్కపెట్టి ఏడుస్తూ గదిలో నిర్జీవంగా ఉన్న తన తల్లిని చూపించింది.నెడుంచెలియన్ వెళ్లి చూడగా అముతమ్మ అప్పటికే ఊపిరి విడిచి పడివుంది.తన భార్యకి ఉన్నది కేవలం జ్వరం మాత్రమే అని తాను ఎందుకు ఇంత త్వరగా చనిపోయిందో చెప్పాలని బోరున విలపిస్తూ డా౹౹రామేశ్వరన్ ని అడిగాడు.తాను చాలా ప్రయతించానని,ఆసుపత్రికి తరలించడం ఆలష్యం కావడం వల్లనే అముతమ్మ పరిస్థితి విషమం అయిందని డాక్టర్ చెప్పాడు. ఏడవడం తప్ప ఏమీ చేయలేని నెండుచెలియన్ తన భార్య మృతదేహాన్ని,కుమార్తెని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు.

అక్కడికి కొన్ని నెలలు గడిచినా నెండుచెలియన్ కూతురు మాత్రం చనిపోయిన తన తల్లిని మర్చిపోలేక రోజు రాత్రంతా ఏడుస్తూ కుమిలిపోయేది.ఒక రోజు నెండుచెలియన్ తన కూతురి దగ్గరకు వెళ్లి, చావు పుట్టుకలు మానవ జీవితంలో సహజమని అది మన చేతుల్లో ఉండదని చెప్పుకొచ్చాడు.ఎంత సంజాయించినప్పటికి తన కూతురు మాత్రం ఏడుపు ఆపలేదు.తన ఇష్టంగా మీ అమ్మ ఆ దేవుడి దగ్గరకు వెళ్లిపోయింది,దానికి మనం ఏం చేయగలం అని అతడు తన కూతుర్ని అడగగా,అప్పుడు తన కుమార్తె ఒక్కసారిగా తనలో దాచిన ఆక్రోశంతో,తన తల్లి జబ్బు చేసి చనిపోలేదని డా౹౹రామేశ్వరన్ తన తల్లిని బలవంతంగా మానభంగం చేసి చంపేసాడని,అడ్డుకున్న తనని కూడా లైంగికంగా వేధించాడని చెప్పుకొచ్చింది.ఇదంతా అప్పుడే ఎందుకు చెప్పలేదు అని నెండుచెలియన్ తన కూతుర్ని అడగగా,ఈ విషయం బయటకి తెలిస్తే తండ్రి,కూతుర్ల ఇద్దరిని ప్రాణాలతో వదిలిపెట్టనని డాక్టర్ హెచ్చరించడాని,అందుకే భయంతో ఎప్పుడూ బయటకి చెప్పుకోలేదు అని ఆ చిన్న పిల్ల తన తండ్రికి చెప్పింది.ఇది విన్న నెండుచెలియన్ కోపంతో ఊగిపోయి వెంటనే తనకు న్యాయం జరగాలని ఆ ఊరి పోలీసులను ఆశ్రయించాడు.డాక్టర్ పెద్ద కులం వాడు పైగా ధనవంతుడు కావడంతో పోలీసులు నెండుచెలియన్ పిర్యాదుని పెడ చెవున పెట్టారు.తన భార్య చావు అర్ధం లేకుండా పోకూడదని ఎలాగైనా తనకి న్యాయం జరగాలనుకున్న నెండుచెలియన్ అంతటితో ఆగక ఈ విషయాన్ని ఆ ఊరి పెద్ద మనుషుల సమక్షంలో పెట్టాడు,అక్కడైనా న్యాయం జరుగుతుందని ఆశపడిన నెండుచెలియన్ కి మళ్ళీ చేదు వార్తే ఎదురయింది.ఊరి పెద్దలు కూడా పెద్ద కులం వల్లే కావడంవల్ల వాళ్ళు నెండుచెలియన్ ఆరోపణలు తప్పని,నిజానికి డబ్బుకి ఆశపడి  అముతమ్మనే చాలా సార్లు డబ్బున్న మగాళ్లని లోబర్చుకోవడానికి ప్రయత్నించెదని,ఇప్పుడు తన చావుకి పరిహారంగా డబ్బుని చెల్లించమని డాక్టర్ ని కోరగా అతడు కాదనడంతో అతడి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని ఊరి ప్రజలందరిని నమ్మించారు.ఈ వదంతు ఊరంతా పాకడంతో అవమానం భరించలేక ఒక రాత్రి నెండుచెలియన్ కూతుర్ని ఒంటరిగా వదిలి ఊరి చివర ఉన్న పెద్ద మర్రి చెట్టుకి ఉరి వేసుకొని చనిపోయాడు.ఈ చావుని ఊరంతా తమ కళ్ళతో చూసింది.కొద్ది నెలల వ్యవధిలోనే తల్లి,తండ్రి ఇద్దరిని కోల్పోయిన ఆ ఆడపిల్ల దిక్కుతోచని అణాముకురాలుగా మిగిలింది.ప్రశాంతంగా ఉన్న తన కుటుంబం కేవలం కులం,డబ్బు అహంతో వొళ్ళు మరిచిన ఒక రాక్షసుడి కామ వాంఛకు బలి కావడంతో ఆ చిన్న ఆడబిడ్డ సమాజం పట్ల విపరీతమైన ద్వేషం పెంచుకుంది.ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే ఆమె ఆ ఊరు విడిచి ఎక్కడికో వెళ్ళిపోయింది.

కొన్ని ఏళ్ల తరువాత ఒక నాడు ఆ ఊరికి ఎవరో పెద్ద రాజకీయ నాయకుడు విచ్చేసారు,అతనికి బందోబస్తుగా పెద్ద సంఖ్యలో పోలీసు మూకలు సిద్ధమయ్యాయి,అతడిని కలిసేందుకు ఊరిలో ఉన్న ధనవంతులు,పెద్ద కులం వాళ్ళు అంత హాజరయ్యారు.ఆ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఆ రాజకీయనాయకుడి పర్యటన ముగిసింది,హాజరైన జనమంతా తిరిగి తమ తమ ఇళ్లకు బయలుదేరారు.ఊరి పొలిమేరల్లోకి వస్తుండగా నెండుచెలియన్ ఉరి వేసుకున్న ఆ మర్రి చెట్టుని చూసి ఒక్కొక్కలు ఆశ్చర్యంతో గుటకలు మింగారు.ఆనాడు ఆ దృశ్యాలను చూస్తుంటే ఆ జడల మర్రిచెట్టుకి సెవాలు మొలిచినట్టుగా అనిపించింది.నెండుచెలియన్ చావుకు కారణమైన పోలీసులు,ఊరి పెద్దలు,డాక్టరు అందరూ ఆ చేతట్టుకి సెవాలయ్యి వేలాడుతున్నారు.వేలాడుతున్న ప్రతి సెవం మొహం నుదిటి మీద ‘దేవి’ అన్న పెరు చెక్కివుంది.ఇది చూసిన ఊరి ప్రజలు చెమటలు కక్కుతూ పరుగులు పెట్టారు.అది మొదలు ఆ చెట్టుకి సెవాలు వేలాడటం సాధారణ విషయం అయిపోయింది.ఊరిలో డబ్బు,కులం పేరుతో బడుగు బలహీన వర్గాల మీద హత్యాచారాలకు పాల్పడుతున్న ప్రతిఒక్కరి నుదిటి మీద దేవి అన్న పెరుతో ఆ మర్రె చెట్టుకి వేలాడటం ఖాయం.ఈ పరిస్థితి ఆ ఒక్క ఊరితో ఆగలేదు,చుట్టుపక్కల ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా మరుసటి రోజు ఆ అన్యాయానికి పాల్పడిన వాడు ఆ ఊరి చివర చెట్టుకి సెవమై వేలాడాల్సిందే.కొనెల్లూపాటు ఆ ప్రాంతం ప్రజలకి దేవి ఎవరో తెలియలేదు గాని,తప్పు జరిగితే మనకి ఆ దేవి ఉందన్న నమ్మకం మాత్రం కలిగింది.డబున్న బడా బాబులకి,పెద్ద కులం పేరిట అక్రమాలకు పాల్పడే మూర్కులకు దేవి అంటే మహిషాసురమర్ధిని అవతారమెత్తిన కాళికాదేవిగా హడలు పుట్టించింది.తప్పు చేయడం సరిసరి తప్పు చేయాలన్న ఆలోచన వచ్చినా దేవి చేతిలో బలి కావాల్సిందే.ఒక్క ఊరిలో మొదలయిన ఈ తంతు దక్షిణాది అడవి ప్రాంతాళ్ళనింటా ప్రాకింది.రెండు మూడు ఏళ్లలోనే ఈ హత్యల సంఖ్య భారీగా పెరగడంతో ఈ విషయం ప్రభుత్వాల దృష్టికి వెళ్ళింది.వెంటనే దేవిని పట్టుకోవాలని పోలీసులు దర్యాప్తులు మొదలు పెట్టారు,ఐతే ధైర్యం చేసి అడవిలోకి అడుగు పెట్టిన పోలీసు ఎవ్వరు తిరిగి బయటకు రాలేకపోయారు.ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవిని పట్టుకోవడం ఎవ్వరివల్లా కాలేదు.నిజానికి సామాన్య ప్రజలకు దేవి ఓ దేవతగా మారింది,ఆమెని పట్టుకోవడానికి ఏఒక్కరూ పోలీసులకి సహకరించే వాళ్ళు కాదు.అడవిలో ఎదురుగా వెళ్లి దేవిని పట్టుకునే ధైర్యం చాలని పోలీసులు ఒకనాడు ఆమెని పట్టుకోవడానికి అడవి సమీప గ్రామంలో ఎదో ఆన్యాయం జరుగుతునట్టుగా ఒక అబద్ధపు వార్తను సృష్టించి దేవి చెవిలి పడేలా చేశారు,అది తెలుసుకున్న దేవి అడవి దాటి బయటకు రాగానే పోలీసు మూకలతో చుట్టుముట్టి ఆమెని భందించాలనుకున్నారు.పన్నాగం ప్రకారం ఒక అబద్ధపు వార్తను సృష్టించి దేవికి చేర్చారు,దేవి వెంటనే అడవి నుంచి బయలుదేరి ఊరిలోకి రానే వచ్చింది.పోలీసులు పథకం ప్రకారం ఊరి ప్రజలందరి ముందు ఆమెని చుట్టుముట్టి బంధించారు.ముసుగులో ఉన్న దేవి మోహముని చూద్దాం అని అక్కడ ఉన్న పోలీసు ఉన్నతాధికారి ఆమె దగ్గరకు వెళ్లి ఆ ముసుగుతీసి చూడగా ఒక్క నిమిషం బిత్తరపోయాడు,ఆ ముసుగులో ఉన్నది దేవి కాదు అది తన భార్య.అది చుడిన పోలీసుకి చిన్న యరతో పెద్ద చేపకు గేలం వెయ్యాలనుకోవడం తప్పని తెలుసుకున్నాడు.ఎక్కడ విషయం బయటకు ప్రాకిందో ఆలోచించే అరసేకనులో అక్కడ ఉన్న పోలీసు మూకలందరి మెడలకు ఉరి తాళ్లు చిక్కుకున్నాయి.ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న ఆ పోలీసు బలగాల కళ్ళ ముందు చావులా ఒక రూపం అడవినుంచి అలా నడచి వస్తున్నట్టు కనిపించింది,ప్రాణం పోయే నిమిషం ముందు దేవిని చూడాలన్న వాళ్ళ కోరిక తీరేలా ఒక ఉగ్రరూపం వల్ల ముందు ప్రత్యక్షమయింది. ఊరి జనం అందరూ చూస్తుండగా ఆమె ఒక గంభీరమైన గొంతుతో ‘దేవి…కొప్పెరుందేవి’ అని గర్జించింది,ఆ గర్జనకు పోలీసు మూకల గుండెలు స్తంభించాయి.ఇది చూస్తున్న ప్రజలు నెండుచెలియన్ కూతురు దేవి ఏ తమముందు సాక్షాత్తు ఆ పరశక్తి రూపంలో ప్రత్యక్షంగావించడం చూసి పూకాకలతో ఊగుతూ ‘కాటు కోమగల్….కొప్పెరుందేవి’ ‘కాటు కోమగల్…కొప్పెరుందేవి’ (అడవికి రాణి..కొప్పెరుందేవి) అని నినాదాలతో హోరెత్తారు.ఈ సంఘటన అనంతరం కొప్పెరుందేవి ని నక్షల్ రాణి గా ప్రభుత్వాలు ముద్రవేసాయి కానీ పేద,ధనిక,బడుగు,బలహీన వర్గాల్లో ప్రజల గుండెల్లో మాత్రం ఆమె అడవుల రాణి గానే స్థానం సంపాదించుకుంది.తక్కువ సమయంలోనే కొప్పెరుందేవి ఆ ప్రాంతాల్లో ఒక తిరుగులేని శక్తిగా మారింది.అడవుల్లో ఉంటూనే బయట సమాజంలో నడుస్తున్న రాజకీయ పార్టీల భవిష్యత్తు నిశ్చయించేది.పదహారేళ్ళ ఒక ఆడపిల్ల పెద్ద పెద్ద నాయకుల రాజకీయ అడుగుల్ని నిర్ణయించడం అదే చరిత్రలో మొదటిసారి.

అదే సమయంలో సమాజంలో సామాన్య ప్రజలపై జరుగుతున్న అన్యాయాలపై ఉద్యమాలు చేస్తున్న కృష్ణయ్యన్ కు దేవి పెరు బాగా వినిపించింది.ఓ ఆడపిల్ల అయుండి అనేక విషయాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నడుచుకుంటూ అడవి ప్రజల హక్కులు కాపాడుకొస్తున్న కొప్పెరుందేవి ధైర్యా సాహసాలకు కృష్ణయ్యన్ ఆశ్చర్యపోయాడు.అదే సమయంలో దేవి కి కూడా కృష్ణయ్యన్ చేస్తున్న ఉద్యమాల సమాచారం ఆమె అనుచరులు అందేది.వ్యక్తిగతంగా ఇద్దరికి పరిచయాలు లేకపోయినా వాళ్ల పోరాటాల భావాలకు చాలా దగ్గర పోలికలు ఉండేవి.అప్పటి సమాజములో ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నప్పటికీ ఈ ఇద్దరు తమ తమ విప్లవ ఉద్యమాలకు హింసా మార్గాన్నే ఎంచుకోవడం వీరి మధ్య సారూప్యత,ఆ సారూప్యతనే వీరిద్దరి కలయికకి ముఖ్య పాత్ర పోషించింది.ఇద్దరూ కలిసి పనిచేయడంవల్ల తమ తమ ఉద్యమాలు మరింత సత్ఫలితాలు ఇస్తాయని కృష్ణయ్యన్,కొప్పెరుందేవి నమ్మసాగారు.అతి తక్కువ సమయంలోనే ఇద్దరికి పరిచయం ఏర్పడింది.ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు లేకపోయినప్పటికీ కొప్పెరుందేవి అప్పుడప్పుడూ కొన్ని కీలక విషయాలు చర్చలు జరిపేందుకు మారువేశంలో కృష్ణయ్యన్ ను కలిసేందుకు అడవి దాటి వచ్చేదని భోగట.ప్రజాభలానికి వ్యూహాభాలం తోడవ్వడంతో ఆ ప్రాంతాల్లో కృష్ణయ్యన్,కొప్పెరుందేవి లకు వ్యతిరేకంగా నిలపడే ప్రయత్నం కూడా ఎవ్వరూ చెయ్యలేదు.ఆ కాలంలో కృష్ణయ్యన్ సలహాదారులుగా వ్యవహరించిన కొంతమంది మాట్లాడుతూ కృష్ణయ్యన్ కూడా కొప్పెరుందేవి ని కలిసేందుకు చాలా సార్లు అడవిలోకి రహస్యంగా వెళ్ళేవాడని చెప్పుకొచ్చారు.మొదట్లో వీరిద్దరి కేవలం సన్నిహితులు గానే ఉన్నా మెల్లగా కొద్ది కాలానికి ఆ సన్నిహిత్యం ప్రేమగా మారింది.నోరు విడిచి చెప్పేందుకు ఎవ్వరూ ధైర్యం చేయకపోయినా కృష్ణయ్యన్,కొప్పెరుందేవి లు వివాహం చేసుకొని సంసారం మొదలుపెట్టిన విషయం అందరూ ఎరిగిన సత్యమే.ఆ తరువాత కొద్ది కాలానికే వాళ్ళు ఒక బిడ్డని కూడా కన్నారు.ఒకసారి ఇద్దరూ కలిసి పేద ప్రజల పంట రాబడి మొత్తం రుణాలు కింద వసూలు చేస్తున్న ఒక ప్రాంతపు తాసీల్ధార్ ని గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకు వచ్చి,ప్రభుత్వాలను కిందకి దింపే ఆలోచన చేశారు.పథకం ప్రకారం అతడిని ఎత్తుకువచ్చి బందీ చేశారు.వ్యూహ రచన లోపమో లేక ఇంటి దొంగల వెన్నుపోటో తెలీదు కానీ ఈసారి చేసిన పనిలో కృష్ణయ్యన్ హస్తం ఉందని పోలీసు అధికారులకు వార్తలు అందాయి.అప్పటిదాకా మూడో కంటికి తెలియకుండా కృష్ణయ్యన్ దేవితో కలిసి చేస్తున్న వరుస కార్యకలాపాలు ఒక్కసారిగా అన్ని బయట పడ్డాయి.కొప్పెరుందేవి బలానికి సగం తోడు కృష్ణయ్యన్ ఏ అని పోలీసులకు స్పష్టంగా అర్ధమయిపోయింది.అడవిలో దాక్కున్న కొప్పెరుందేవిని బయటకు రప్పించాలంటే కృష్ణయ్యన్ ను ముందు అదుపులోకి తీసుకోవాలని పోలీసులు రంగం సిద్ధం చేశారు.పోలీసులకు దొంగ త్రోవలనట్టే కృష్ణయ్యన్ కు కూడా పోలీసుల్లో సమాచారం అందించే వాళ్ళు ఉండేవారు.పోలీసులు రంగంలోకి దిగకముందే కృష్ణయ్యన్ కి మొత్తం విషయం తెలిసిపోయింది,వెంటనే అడవిలో ఉన్న కొప్పెరుందేవి ని ఆ ప్రాంతం వదిలి ఎక్కడికైనా దూరం వెళ్లి కొద్ది రోజులు తలదాచుకోమని సమాచారం పంపాడు.కృష్ణయ్యన్ మాటమేరకు కొప్పెరుందేవి తన బిడ్డని పట్టుకొని ఎవరికి తెలియకుండా రాత్రికి రాత్రి పరారయింది.కృష్ణయ్యన్ మాత్రం ఏమి ఎరుగనట్టు పోలీసులకు లొంగిపోయాడు.ఆ తరువాత కొన్ని ఏళ్లకే కృష్ణయ్యన్ కి కొప్పెరుందేవికి సంభందం ఉన్నట్టు గట్టి సాక్ష్యాదారాలు పోలీసులు సమర్పించ లేకపోవడం,పరారీలో ఉన్న దేవిని పట్టుకోవలేకపోవడంతో కోర్టులు కృష్ణయ్యన్ ను నిర్దోషిగా విడుదల చేసాయి.

ఆ తరువాత ఇప్పుడు కొప్పెరుందేవి ఆ ప్రాంతాలకు వచ్చినట్టుగాని,కృష్ణయ్యన్ కలిసినట్టుగాని జాడలు లేవు.చాలా ఏళ్ల తరువాత ఇప్పుడు మళ్లీ ఆ కాటు కోమగల్ కొప్పెరుందేవి ఫోటోని సిద్దమురుగన్ చేతిలో చూసాను.అంటే ఇప్పటిదాకా నేను ఊహించిందంతా తప్పు అని తెలుసుకున్నాను.సిద్దమురుగన్ మనం అనుకున్నట్టు జర్నలిస్ట్ కొడుకు కాదు అతడు కృష్ణయ్యన్ కొడుకు,అంటే కొప్పెరుందేవి సిద్దమురుగన్ ని పంపింది కూడా తన తండ్రి కృష్ణయ్యన్ ని కలవమనే.హత్య వెనుకాల కధ నడిపింది కృష్ణయ్యన్ కాదన్నమాట,మనం అనుకుంటున్నట్టు ఆ రోజు సిద్దమురుగన్ తో కలిసి వ్యూహం సిద్ధం చేసింది కృష్ణయ్యన్ ఆ అయినప్పటికీ అసలు వ్యూహ కర్త మాత్రం కృష్ణయ్యన్ స్నేహితుడు జర్నలిస్ట్ ఏ,అమాయకంగా కనిపిస్తూ ఇదంతా నడిపింది అతడే.సిద్దమురుగన్ చెప్పినట్లుగానే అతడు తండ్రికి సహాయంగా జైల్లో కొందరు దుండగులని సిద్ధం చేసాడు కానీ అసలు వ్యూహం ఏంటో కృష్ణయ్యన్ కి గాని అతడి కొడుకు సిద్దమురుగన్ కి గాని తెలియకుండా జర్నలిస్ట్ జాగ్రత్త పడ్డాడు.అపర మేధావైన జర్నలిస్ట్ తన చేతికి ఏ మాత్రం మట్టి అంటకుండా కృష్ణయ్యన్ కొడుకు చేతనే తన తండ్రి హత్యకు రంగం సిద్ధం చేయించాడు.

మొత్తానికి నేను ఈ చిక్కుముడులను ఛేదించాను.ఎంత పెద్ద గజదొంగైనా ఒక్క చిన్న తప్పు చేసి దొరుకుతాడు అన్నట్టు.ఆ జర్నలిస్ట్ కూడా అందరి కళ్ళను కప్పి తప్పించుకొని నా చేతికి దొరికాడు.ఇక వీలైనంత తొందరగా ఆ జర్నలిస్ట్ ని పట్టుకోవడమే ఆలస్యం.ఆ జర్నలిస్ట్ ఎక్కడ ఉంటాడో,అతడి వివరాలేవో తెలుసుకుందామని అతడి జైలు జాబితాలను తవ్వి చూసాను.అతడి కుటుంబ విషయాలు ఏవి దోరకనప్పటికీ అతడి వివాహ దృవీకరణ పత్రంలో అతడి భార్య పేరు సుజాత అని చూసాను.వెంటనే సుజాత ఎవరో తెలుసుకుందామని సమాచార బృందాలని అడిగి ఆమె జాబితా తెప్పించాను.సుజాత జాబితా రానే వచ్చింది,ఎంతో ఆత్రొతగా తెరిచి చూసిన నేను మళ్ళీ ఒక్క సారి నీరు గారాను.

నింగి సముద్రం కలిసే ప్రాంతమైనా పట్టుకోగలమేమో కానీ ఈ దర్యాప్తులో హంతకుడు ఎవరో పట్టుకోవడం అసాధ్యం అనిపించింది.జాబితాల్లో ఉన్న సుజాతను చూసి నేను మళ్ళీ తలపట్టుకోక తప్పలేదు.ఆ జాబితాల్లో ఉన్న సుజాత ఎవరో కాదు ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న కొప్పెరుందేవి.

కొప్పెరుందేవి,సుజాత ఇద్దరూ ఒకరేనా?

జర్నలిస్ట్ కి కొప్పెరుందేవి అలియాస్ సుజాత కి సంభంధం ఏంటి?

    __________________ ఆర్టికల్-6  _______________

Leave a Reply

Your email address will not be published.