295
0

ఆర్టికల్-2

295
We recommend you to read part 1 before reading part 2

నేను ఊహించిన దానికన్నా జైలు గోడల మధ్య జీవితం కష్టమే అని తెలుసుకున్నాను.చింత చచ్చినా పులుపు చావదు అన్నట్లుగా బతుకు కష్టంగా ఉన్నా నా విప్లవ కంఠం ఏనాడు మూగబోలేదు.ప్రపంచం మొత్తం తిరగి చూసే స్తోమత లేకపోయినా పుస్తకం చదివే అలవాటు తోడుగా జర్నలిజంలో నేర్చుకున్న విలువలు ఉండటంవల్ల జైలులో కూడా మనుషుల్ని అర్ధంచేసుకుంటూ మిత్రులని సంపాదించగలిగాను.ఆ సమయంలో అక్కడ ఉన్నది చాలావరకు మేధావులే,నిజానికి మేధావులు కనుకనే అక్కడ ఉన్నారు.సహజంగా సున్నితస్వభావుడ్ని అవ్వడంతో చుట్టూ పరిస్థితుల్ని అహింసా పద్ధతిలోనే జయించాలని అనుకున్నాను.ఏ చిన్న తప్పుకైనా జైలర్లను చట్టపరంగా నిలదీయడం వల్ల అప్పటికే తోటి ఖైదీలలలో నాకే తెలియని నాయకుడి ముద్ర వేసుకున్నాను.


అవకాశాల కోసం వేచి చూడటం కన్నా వాటిని మనమే కలిగించుకోవడం మంచిదని నమ్మి ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా జైలులొ ఖైదీలందరితో ఓ రాహస్య సమావేశం ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నాను.ఐతే ఇప్పుడు ఈ సమాచారం జైలర్ల చెవిట పడకుండా ప్రతి ఒక్క ఖైదీకి చేరుకోవడం నా మొదటి ఘట్టం.ఈ ఘట్టం నెగ్గాడానికి నా దగ్గర ఉన్నవి రెండేరెండు అస్త్రాలు,ఒకటి రోజులో మూడు సార్లు తిండి కోసం కపుకాసే పొడుగాటి లైన్లు,రెండు రోజు సాయంత్రం టి.వి చూడడానికి దాదాపు అందరూ ఒక్క దగ్గరకు చేరే సమయం.ఈ రెండు చోట్ల కూడా పోలీసుల కళ్ళు లేకపోలేవు కానీ రోజులో మిగతా సమయాలతో పోలిస్తే ఇవే కాస్త అనుకూలంగావుండే ఘడియలు.ఐతే ఈ పనికి నా ఒక్కడి గొంతు సరిపోదు కనుక రోజు నాతోపాటే తోటపని చేసే నలుగురు నమ్మకస్తులు అయిన స్నేహితులని ఎంచుకున్నాను.తమలో ఉన్న దేశభక్తో లేక జైలు జీవితం మీద ఆక్రోసమో తెలీదు కానీ ఆ నలుగురు ఏ మాత్రం బేరకకుండా పని మొదలు పెట్టారు.ఈ ప్రపంచంలో గాలికన్నా మాట తొందరగా సోకుతుంది ఏమో పొద్దుపొడిచే సమయానికి ప్రతి ఒక్క ఖైదీ మొఖంలో ఆ రోజు రాత్రి ఎదో సాదించబోతున్నాం అన్న ఆరాటం.


‘ఫార్చ్యూన్ ఫేవర్స్ ది బ్రేవ్’ అన్న ఇంగ్లీష్ సామేత నిజమే కాబోలు ఒక్క పోలీసు చెవికి కూడా సోకకుండా నా సమావేశం వినతి ప్రతి ఖైదీకి చేరుకుంది.ఇప్పుడు ఇంతమంది ఖైదీలను ఒకే చోట చేర్చి సమావేశం పెట్టడానికి కావాల్సిన ఒక రాహ్ష్యస్థలం వెతకడం నా రెండో ఘట్టం.


ఎంత అర్ధరాత్రి అయిన పోలీసులు కళ్ళు కప్పి ఒక బహిరంగస్థలంలో సమావేశం పెట్టాలి అనుకోవడం వెర్రిచేస్టే అవుతుంది.పొని పాత సినిమాల్లో చూపించినట్టు ఎదో ఒక పెద్ద గదిలో తలుపులు కప్పి జరుపుదామన్నా అంత సులభం కాదు,ఇది సినిమా కాదు కదా.చీకటి పడింది నాకు ఇంకా సమావేశం ఎక్కడ పెట్టాలో తట్టడంలేదు,కానీ ఎట్టి పరిస్థితుల్లో సమావేశం పెట్టి తీరాలి ఇప్పుడు అవకాశం కోల్పోతే మళ్ళీ ఇంత మంచి అవకాశం రాదు.పాతికేళ్ళ నా జీవితంలో ఎప్పుడు ఇంత దీర్ఘంగా ఆలోచించలేదు ఏమో,అప్పుడే నా మెదడుకు ఒక ఆలోచన తట్టింది,అది ఏంటి అంటే నేను జైలులో ఒక విప్లవ సమావేశం పెట్టదానికి అధికారులు ఒప్పుకోకపోవచ్చు ఏమో కాని సరదాగా ఒక ఒక గంట మాలో ఉన్న కళలు ప్రదర్శించుకోవడానికి కాదనరని నాగట్టి నమ్మకం.


మీకు ఆ కళల ప్రదర్శన ఎంటో అర్ధంకాలేదు కదూ? నిజానికి నాకు కూడా ఎలా ముందుకెల్లాలొ పూర్తి అవగాహన లేదు. అ ఆలోచన మంచిదా చెడ్డదా అని సందేహపడడంకన్నా ఉన్న ఒక్క అవకాశాన్ని వాడుకోవడం మేలు అనిపించింది.వెంటనే జైలు రక్షణా ఉన్నతాదికరి దగ్గరకు వెళ్లి ఆ రాత్రి భోజనం తరువాత ఒక గంటసేపు సరదాగా పాటలు పాడుకోవడానికి అవకాశం అడిగాను.ఎంతకాదన్న మేము ఖైదీలమే కాని క్రిమినల్స్ కాదన్న భావం ఉండటంతో అధికారి వెంటను సరే అని తలఊపాడు.భోజనాల సమయం ముగిసింది,ఖైదీలు అందరూ ఒక దగ్గరకు చేరుకున్నారు,అన్ని అనుకున్నట్టు జరుగుతున్నాయి అనే సమయంలో మళ్ళీ ఒక సమస్య వచ్చింది.అన్ని రాసుకునట్టు జరగడానికి ఇది కథ కాదుకద,నిజాజీవితం ఎప్పుడు ఎంజరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు,ఐతే వచ్చిన సమస్యని ఎదురుకొని ముందుకెల్లే అవకాశం జీవితానికి మాత్రమే ఉన్న వజ్రాయుధం.ఇప్పుడు నాకు వచ్చిన సమస్య ఏంటంటే కేవలం ఒక పాటల ప్రదర్శ కార్యక్రమానికి ఒక్క ఖైదీ కూడా తప్పకుండా అందరూ హాజరు కావడం పోలీసుల్లో అనుమానాలకు తోవతీసింది,మా కార్యక్రమంలో కాపలా ఉండమని ఒక జైలర్ను నియమించారు.


సమావేశం మొదలయింది ఖైదీలు అందరూ నేన ఎంమాట్లాడతానో వినడానికి అరాటంగా వేచిచూస్తున్నారు,కానీ వాళ్ళతోపాటె ఒక పోలీసు అధికారి కూడా వేచిచూస్తున్నాడు.ఇంత వరకు నెట్టుకొచ్చిన తరువాత ఒక చిన్న తప్పుచేసి పోలీసులకు దొరికిపోవడం నాకు ఇష్టం లేదు అందుకే మొదట్లో నాకు వచ్చిన కొన్ని దేశభక్తి పాటలను కూని తీసాను,అలా ఒక అరగంట గడిచింది కాపుకాసిన పోలీసు అక్కడ నా శృతిలేని పిచ్చి రాగాలు తప్ప ఏమీ జరగడం లేదు అని అనిపించి మెల్లగా మమ్మల్ని ఒంటరిగా విడిచి పెట్టాడు.అప్పుడు మొదలైంది అసలు కధ

“సోదరులారా ఈ సమావేశం మీకు నాకు ఎంత ముఖ్యమో ఈ దేశ ప్రజాస్వామ్యానికి అంతే ముఖ్యం,నీతులు చెప్పి పబ్బం గడిపిన ప్రభుత్వాలను నిజాలు అడిగి నిలదీసే సమయంవచ్చింది,కులం పేరుతో మతం పేరుతో ఓట్లు ఎరుకునే నీచరాజకీయ వ్యవస్థను శుద్దిచేసే రోజులు వచ్చాయి.నీదా? నాదా? ఈ దేశం ఎవరిది? వేలమంది అమరవీర స్వతంత్రపొరాట యోదుల రక్తం కాదా ఈ నెల? కోట్ల మంది భారతీయుల శ్వాస కాదా ఈ నెల?అధికారం పేరుతో రాక్షస పాలన చేస్తున్న రాజకీయ నాయకులది కాదు ఈ నెల.మీలో ఎంతో మంది ఎంతప్పు చేసామో కూడా తెలియకుండా ఈ జైలులో జీవితం గడుపుతున్న వాళ్ళు ఉన్నారు.ఎందుకు మనకి ఈ కర్మ ఎంపాపం చేశామని మనకి ఈ స్థితి?అన్యాయాన్ని ప్రశ్నించే గొంతులని దేశద్రోహులుగా ముద్రించి అనచివేయడమా అంబెడ్కర్ కలలుకన్న రాజ్యాంగం?ఆకలి కేకలతో రోడ్లెక్కిన ప్రజలకు లాఠీ దెబ్బలు తినిపించడమ గాంధీజీ కలలుకన్న స్వరాజ్యం? సోదరులారా ఇక ఈ అక్రమ అనచివేతకు అంతం పాడుదాం,హక్కుల కోసం పోరాడే మనల్ని చిడ పురుగుల్లా తొక్కిపడేస్తున్న ఈ లంఛగుండె మూకలపై కదంతొక్కుదాం.ఈరోజు నుంచి ఆ మహాత్ముడు గాంధీ చూపిన మార్గం సహకార వ్యతిరేకంగా నడుద్దాం.పోతే పోనీ పిడికెడు ప్రాణం పోరాడి భావితరాలకు ఆదర్శనంగా నిలుద్దాం,చస్తే చద్దాం కానీ తప్పుచెయ్యకుండా ఎవరికీ తలవొంచని ఒక స్వేచ్ఛ భారతీయుడిగా చద్దాం”
అని నాలో రగిలిపోతున్న విప్లవ భావాన్ని అక్కడ ఖైదీలకు నూరిపోసాను.ఆరుతున్న వాళ్ల ఉక్రోశపు దీపాలకి తిరిగి ధైర్యం అన్న చమురు పోసాను.


గడ్డి పరకలే అయిన సమూహంగా కొండని కట్టవా,అలానే ఖైదీలు అందరూ ఒక్కటయ్యి వ్యతిరేకించడంవల్ల ఆ రోజు నుంచి జైలులో మెల్లగా మార్పులు వచ్చాయి.ఇది పెద్ద విజయంగా భవించక పోయిన దూరంగా ఉన్న గెలుపుకి ఇదే మాతోలి మెట్టు.
ఐతే ఈ సంబరం ఎక్కువ కాలం నిలవలేదు.జైలు గోడలకి చెవ్వులు ఉన్నాయి ఏమో మా సమావేశం విషయం ఉన్నతా అధికారికి తెలిసిపోయింది.ఇక తెలిసిన ఒక్క క్షణం కూడా ఆగకుండా పోలీసు బృందం నా దగ్గరకు వచ్చింది.జైలు మొత్తం నిశబ్దంగా భయంతో చూస్తున్నారు అధికారులు నా ముందే ఉన్నారు.ఆ క్షణం నా ఆలొచన అంతా నాకేదో అవుతుంది అని కాదు కానీ ఇప్పుడు అందరి ముందు నన్ను పోలీసులు అనచివేస్తే అది మిగతా ఖైదీలలో అప్పుడప్పుడే పెరుగుతున్న ధర్యానికి సమాది కట్టినట్టు అవుతుంది.ఇదంతా నేను ఆలోచిస్తున్న లోపలే ఒక పోలీస్ అధికారి నా చొక్కా పట్టుకున్నాడు.చుట్టూ ఎవరు ఏమి మాట్లాడక భయంతో మూగపోయారు,నేను ఒక్కడినే ఏంచెయ్యగలను అన్న ఆలోచన నన్ను చేరకముందే.ఒక బండరాయి నా వెనక వచ్చి ఆ పోలీస్ రొమ్ముమీద తాకింది.ఎం జరిగిందో అని నేను వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక ఖైదీ అతని పేరు కృష్ణయ్యన్,అతను నాకు ముందే తెలుసు,అతడు ‘పోలీస్ డౌన్ డౌన్’ అంటూ ఒక పెద్ద కేక పెట్టాడు.ఆ కేకకు ఖైదీలలో నిశబ్ధం బడ్డలయింది,ఒక్కొక్కలు ఒక్కో ఫిరంగి గుండ్లలా పోలీస్ డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తూ ఖాకి మూకలపైకి అడుగులు కదిపారు.ఈ తిరుగుబాటుకు పోలీసు బృందం వెన్ను వొణికింది ఇక ఏమాత్రం గీత దాటినా పరిస్థితి విషమం అవుతుంది అని తెలుసుకొని వెనక్కితగ్గారు.

ఇంతకీ కృష్ణయ్యన్ ఎవరో మీకు తెలీదు కదా?
అతడు తమిళనాడు కి చెందిన విప్లవ నాయకుడు,కొన్ని అధికార మూకల దాడిలో కుటుంబానిని కాపాడుకోవడం కోసం చాలా ఏళ్ళ క్రితం మన తెలుగు రాష్ట్రాలకు వలసవచ్చిన కృష్ణయ్యన్ అన్ని వదిలేసి ఒక చిన్న రైతుగా బతుకు మొదలుపెట్టాడు.ఐతే కరువు వల్ల కడువు కాలిన కృష్ణయ్యన్ మళ్ళీ తన గత విప్లవ జెండాని అందుకున్నాడు బదులుగా ఖైదీలా ఈ జైలు జీవితం అనుబవిస్తున్నాడు.నిజానికి కృష్ణయ్యన్ ఎన్ని రోజులు మౌంనంగా ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించింది.ఆయన గతం తెలిసిన వాళ్ళు ఎవ్వరు అతడిని అలా ఊహించరు.ఎన్నో సంచలన నిజాల గుట్టు రట్టు చేసి పెద్ద పెద్ద రాజకీయ నాయకులికే చెమటలు పట్టించిన కృష్ణయ్యన్ ఛెగువరాకి గొప్ప అభిమాని దానికి తగ్గట్టుగానే ఆయన మార్గం హింసాడ్పదంగా ఉండేది.


ఏదేమైనా ఈసారి మళ్ళీ తొలిఆడుగు వేసినందుకు ధన్యవాదాలు చెప్పడానికి నేను ఆయన్ని కలిసాను.రెండు గంటల సుదీర్ఘచర్చ తరువాత నెను,ఆయన కలిసి పనిచేయాలని నిర్ణయిన్చుకున్నాం. కృష్ణయ్యన్ నాతో పని చెయ్యడానికి ఆయన పెట్టిన షరతు ఒక్కటే అతడికి అహింస సంకెళ్లు వెయ్యోదు అని.అసలు తిరుగుబాటు అప్పుడు మొదలయింది,మాటకి మాట రక్తానికి రక్తం అన్న కృష్ణయ్యన్ విధానం పోలీసు వ్యవస్థలో భూకంపం రేపింది.ఐతే ఈ ప్రక్రియలో ఎన్నో సార్లు కృష్ణయ్యన్ రక్తం చిందించినా ప్రతి రక్తపు బొట్టుకు బదులు తీర్చుకున్నాడు.


అప్పటిదాకా ఇష్టారాజ్యంగా దౌర్జన్యాలకు పాల్పడిన ఖాకీలు కుక్కిన పెండ్లులా మూలపడ్డారు.కొద్ది రోజుల వ్యవధిలొనే ఖైదీలంతా కృష్ణయ్యన్ అనే ధైర్యాన్ని తమలో నింపుకొని తమ హక్కుల కోసం పోరాటం మొదలు పెట్టారు.
నెను,కృష్ణయ్యన్ ఒకే గదికి మకాం మార్చామ్.ఉద్యమానికి సంబందించిన వ్యూహాలన్ని అక్కడినుంచే నడిపేవాళ్ళం.ఇక ఈ ఉద్యమం జైలు గోడలు దాటాలి అని నేను,కృష్ణయ్యన్ నిశ్చయించుకున్నాం.అప్పుడే పుట్టింది మరో ఆలోచన మాలో ఎవరో ఒకళ్లు ఈ లోపల జరుగుతున్న అనచివేతకు,పోరాటాన్ని బయట ప్రజలకు తెలిసేలా చేసి ఉద్యమాన్ని మరింత తీవ్రంగా మార్చి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అని అనుకున్నాం.ఐతే దానికి మాలో ఎవరో ఒకళ్లు జైలు గోడలు దాటాలి,అప్పుడే కృష్ణయ్యన్ ఒక అద్భుతమైన పన్నాగం పన్నాడు జైలులో ఖైదీల మధ్య ఘర్షన జరిగి ఎవరో ఒకళ్లు గాయపడితే,అధికారులు వాళ్ళని అసుపత్రికి తరలిస్తారని ఆ విధంగా ఎవరో ఒకళ్లు జైలు గోడలు దాటాలని అన్నాడు.ఈ పదకం ప్రక్కరమే మొదట కృష్ణయ్యన్ జైలు దాటడానికి సిద్ధమయ్యాడు,ఈ విషయం జైలు మొత్తం ప్రాకింది, కానీ అతడు వెళ్తే జైలు లోపల పరిస్తితులు చెయ్యిదాటిపోతాయి అని అనుమానంతో తరువాత నేను బయటకు వెల్లడానియకి నిర్ణయించుకున్నాను ఈ విషయం ఖైదీల్లో ఎవరికీ తెలీదు కేవలం నాకు,కృష్ణయ్యన్ కి తప్ప. అనుకునట్టుగానే తలాతోకా లేని ఒక విషయం కారణంగా చూపి ఒక పెద్ద ఘర్షణకుదిగాం.నేను గాయపడ్డాను,అధికారులు మెము అనుకునట్టుగానే నన్ను ఆసుపత్రికి తరలించారు.

బయట నాకున్న జర్నలిస్ట్ పరిచయాలతో విషయం పూర్తిగా ప్రజాలకు తెలిసేలా పాములు కదిపి గుట్టు చప్పుడు కాకుండా పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా తిరిగి జైలుకి చేరుకున్నాను. అంతా అనుకున్నట్టుగానే జరిగింది అని కృష్ణయ్యన్ కి తెలిపేందుకు ఎంతో ఆనందంగా నా గదిలోకి వెళ్ళాను.ఆ క్షణం గదిలో దృశ్యాలు చూసి నేను మాతికోల్పోయాను,అక్కడ కృష్ణయ్యన్ కోన ఊపిరితో పడి ఉన్నాడు,ఎవరో అతడి గొంతు కోసి అతడిని చంపే ప్రయత్నం చేశారు.కోన ఊపిరితో ఉన్న కృష్ణయ్యన్ ని ఎం జరిగింది అని అడుగగా అతడు మాట్లాడే స్థితిలోలేడు,చివరిగా కన్ను మూసే ముందు ‘పటేల్ పటేల్ పటేల్’ అని కలవరిస్తూ నా ఒడిలోనే కన్నుమూసాడు.ఒకవైపు ఆక్రోశం మరోవైపు సోకంతో నేను కుమిలిపోయాను.

కృష్ణయ్యన్ కన్నుమూసిన కొన్ని వారాలకే ఉద్యమం మా చ్చెయ్యి జారింది.పోలీసులు మా ఉద్యమానికి కక్షసాదిస్తూ విర్రవీగారు.అలా కొన్ని వారాలు గడిచాక ఒక రోజు నేను నా తోటపనీలో ఉండగా నా పక్కనే ఉన్న జైలర్ల రాబోయే ఆగస్ట్ 15న జైలులో జండా వందన కార్యక్రమానికి ఎవరో ప్రముఖ వ్యక్తి వస్తూన్నారు అని మాట్లాడుకుంటుండగా విన్నాను.ఆగస్ట్ 15 రానే వచ్చింది,జైలులో జండా వందనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.దేశ రాజ్యాంగ హక్కులని ఏమాత్రం గౌరవించని ఆ జైలులో జాతీయ జండాకు వందనాలు చెయ్యడం నాకు ఇష్టం లేక నేను ఆ రోజు నా గదిలోనే ఉంది పోయాను.అతిధిగా రావాల్సిన వ్యక్తి రానే వచ్చారు,జండా వందనం జరిగింది,జైలు అధికారులు అందరి మాటలు అయ్యిపోయాక.’ఇప్పుడు మన అతిధిగా విచ్చేసిన పటేల్ గారు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు’ అని మైక్ లో ఎవరో చెప్పడం నాకు వినిపించింది.చాలా సేపు నాకేమి తట్టలేదు,కానీ ఒక్కసారిగా కృష్ణయ్యన్ చనిపోయే ముందు చెప్పిన ఆ పటేల్ అనే మాట నాకు గుర్తొచ్చింది.వెంటనే నా గది నుంచి పరుగులు తీస్తూ అక్కడికి వెళ్ళాను.పటేల్ అంటే ఎవరో తెలుసుకుందాం అని వెళ్లిన నాకు ఓక నమ్మలేను దృశ్యం ఎదురయింది.

పట్టాభిరామయ్య అలియాస్ పటేల్ ఎవరో కాదు ‘ఇంటలిజెన్స్ లో పనిచేస్తూ నాకు కేంద్రం గురించి అత్యంత ముఖ్యమైన సమాచారం ఫోన్ లో అందించిన నా పాత స్నేహితుడు పట్టాభి’.అప్పుడే తెలుసుకున్నా ఆరోజు పటేల్ చంపాలనుకున్నది కృష్ణయ్యన్ ని కాదు నన్ను అని.ఇద్దరం వేరుగా ఉన్న సమయం చూసి నన్ను మట్టుపెట్టాలి అనుకున్నారు కానీ ఆఖరి నిమిషంలో బయటకు వెళ్లకుండా లోపల ఉన్నది నెనే అనుకోని కృష్ణయ్యన్ గొంతుకోసారు.

అసలు నాకు సమాచారం ఇచ్చిన నా పాత స్నేహితుడే నన్ను ఎందుకు చంపాలనుకున్నాడు?
ఖైదీల్లో పటేల్ కు పనిచేస్తున్న మనుషులెవరు?
నేను రాసిన ఆ ఒక్క హెడ్లైన్ ఖరీదు నా ప్రాణమా?

part-3

Leave a Reply

Your email address will not be published.