754
52

ఆమె నాకు కనిపించింది

754

వీరభద్రపురం అనే ఊరిలో నరేష్ అనే నూనె వ్యాపారి   నివసిస్తూ ఉండేవాడు. అతనికి ఊరిలో మంచి పేరు  ఉంది నరేష్ కి ఆదాయం తక్కువ వచ్చినప్పటికీ, తన కుటుంబ సభ్యులకు ఎటువంటి లోటు లేకుండా  చూసుకుంటూ ఉండేవాడు. వీరభద్రపురం లో నివసించే చాలామంది ప్రజలు కూలి పనికి ప్రక్కనే ఉన్న పట్టణం కు వలస వెళుతూ  వస్తూ ఉండేవారు.పట్టణము కు వెళ్లాలంటే ఎటువంటి రోడ్డు మార్గము లేదు. దారి మధ్యలో ఉన్న వీరభద్రపురం అడవులు దాటుకుని వెళ్లాలి. వీరభద్రపురం ప్రజలు అడవి గురించి కథలు కథలుగా చెప్తుంటారు. అందులో క్రూరమృగాలు ఉన్నాయని  అవి రాత్రి వేళ ఎవరు కనబడిన వెతికి వెతికి  చంపుతా యని చెబుతుండేవారు. మరి కొంత  మంది అక్కడ భయంకరమైన దెయ్యాలు ఉన్నాయని అవి మనుషులు ఎవరైనా కనిపిస్తే దారుణంగా రక్తం పీల్చి చంపేస్తాయి అని అక్కడి వాళ్లకు బాగా తెలుసు.  అందుకే అక్కడ కూలి పనికి వెళ్ళిన వాళ్ళు పొద్దు పోక ముందే వీరభద్రపురం తిరిగి వచ్చేస్తారు.  ఆ అడవి ఉదయంపూట చూడటానికి  చాలా అందంగా కనిపిస్తుంది  కానీ చీకటి అవుతున్నకొద్దీ  అతి భయంకరంగా మారుతుంది.  ఇది ఇలా ఉండగా వీరభద్రపురం లో ఉండే నరేష్ కు ఆరోగ్యం క్షీణించింది.  అక్కడే ఉన్న గ్రామ వైద్యుడికి చూపించారు.  ఆ విషయం తెలుసుకున్న  నరేష్ తమ్ముడు రవి వీరభద్రపురం బయల్దేరాడు.  రవి వేరే పట్టణం  పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తున్నాడు.  రవి, వీరభద్రపురం పక్కనే ఉన్న పట్టణం కు  ఉన్న బస్సు ఎక్కాడు.  బస్సు రవి ఉన్న పట్టణం నుంచి బయలుదేరింది.  

బస్సు ఆ పట్టణం కు చాలా ఆలస్యంగా చేరింది. అప్పటికే చీకటి పడటంతో రవి బస్సు దిగి వీరభద్రపురం వైపు నడవసాగాడు. రవికి అడవి గురించి ఎటువంటి విషయం కూడా తెలియదు. అది పున్నమి రాత్రి, చంద్రుడు వెలుగులోనే ముందుకు వెళ్తున్న రవి అడివి లోనికి ప్రవేశించాడు. అడివి చూడటానికి భయంకరంగా ఉంది. రవి నడిచిన కొద్దిసేపటికే పెద్దగా గాలి మొదలైంది, అంతలో చుట్టుపక్కల నుంచి వింత శబ్దాలు  వినిపించాయి, ఆకాశంలో నల్లని మబ్బులు తెల్లని చంద్రుని కమ్మేశాయి, దాంతో అది మరింత చీకటిగా మారింది. ఇదంతా చూసిన రవికి కాస్త భయం మొదలైంది. అతని దగ్గర ఎటువంటి  టార్చ్ లేకపోయేసరికి తనకి ఏమీ కనిపించుటలేదు. అతను తన దగ్గర ఉన్న లైటర్ వెలిగించాడు. ఆ  లైటర్ సహాయంతో కింద పడి ఉన్న కర్ర పుల్లలతో దివిటీ లాంటిది తయారు  చేసుకోవాలని అనుకున్నాడు. దానితో వెంటనే కింద పడి ఉన్న ఎండు కర్రలను  సేకరించడం మొదలుపెట్టాడు. అంత లో వర్షం మొదలైంది. రవికి కంగారు మొదలైంది. ఆయన కంగారు పడినట్టు గానే వర్షం మరింత పెద్దదయింది. దాంతో దివిటి కి సేకరించిన కర్ర పుల్లలు మొత్తం తడిచిపోయాయి. కానీ రవికి తెలియని విషయం ఏమిటంటే అతను కర్ర పుల్లలు సేకరిస్తూ దారి తప్పి పోయాడు అని. 

రవి కి ఏం చేయాలో అర్థం కాక  తన లైటర్ సహాయంతోనే ముందుకు సాగాడు. కొద్దిసేపటికి తనకు ఎటు వెళ్లాలో అర్థం కాక  తను దారి తప్పానని అర్థమైంది రవికి. తన దగ్గరున్న లైటర్ కూడా ఆగిపోయింది. లైటర్ ఆగిన కొద్ది సేపటికే గాలి వెయ్యటం ఆగిపోయింది, వింత శబ్దాలు ఆగిపోయాయి. అంతా నిశ్శబ్దం. రవి ని ఎవరో గమనిస్తున్నట్టు అనిపించింది, వెనుకకు తిరిగి చూశాడు. అక్కడ ఏమీ లేదు. ఈసారి తన వెనకాల ఎవరు నడుస్తున్నట్టు అనిపించింది, మళ్లీ వెనక్కి తిరిగి చూస్తే ఏమీ లేదు. మళ్లీ అనుమానం వచ్చి వెనుకకు భయంతో చూస్తే అక్కడ ఎవరూ లేరు. సరే కదా అని ముందుకు తిరగ్గా రవి ముందు రెండు కాళ్లు వేలాడుతూ కనబడ్డాయి. రవి భయంతో ఆ కాళ్లు ఎవరివి అని పైకి చూడగా, అక్కడ ఒకరు చెట్టుకు ఉరివేసుకుని ఉన్నారు. ఆ చెట్టుకు ఉరివేసుకుని ఉన్న శవం మొహం చూసిన రవి భయంతో అక్కడనుండి పరుగుతీశాడు. రవి గట్టిగా అరుస్తూ చాలా దూరం పరిగెత్తాడు. ఇంతకూ రవి చూసిన శవం మొహం ఎవరిది……..?

Leave a Reply

Your email address will not be published.

52 thoughts on “ఆమె నాకు కనిపించింది

  1. Very interesting!!
    Waiting for the next part…
    Super writing skill..
    All the very best for your journey…

  2. Chala baga rasaru ee kadha nu👏🙌..Shivam Madhu nu chala mechukovali..
    Part 2 kosam waiting

  3. Nice story waiting for part 2

  4. · October 4, 2020 at 9:05 pm

    Great work ra Shivam… Chala interesting ga undi. 2nd part kuda ilane interesting ga untundi ani anukuntunna..
    All the best ra…👍👍👍

  5. Nyc story waiting for part 2

  6. Interesting story…I am very excited to read!!But what the bull shit is part2 coming soon🤦

  7. Good job Shivam👍👍..keep doing like this u will definitely get a good results all the best yar💕….. I’m eagerly waiting for the part-2🤩🤩

  8. Very interesting

  9. Nycc shivam Anna nycc story writing good job waiting for second part🔥🔥🔥

  10. Very intresting and nice horror thriller ra macha……. Very nice…

  11. Nice story

  12. Good story…and very interesting…

  13. Intresting spooky nail biting story man
    Waiting for the second part

  14. Nice intresting spooky story ra shivam
    Keep going waiting for 2nd part

  15. Super script
    Waiting for part 2

  16. Manchi start ra
    Part 2 suspense break interesting ga cheyyu👻

  17. · October 5, 2020 at 12:58 pm

    Exlent ra keep it up….we r waiting for next part

  18. Nice story….we r waiting for next part

  19. Nice intresting spooky story ra shivam
    Keep going waiting for 2nd part

  20. Nice one spooky and intresting

  21. Manchi start ra Shivam
    Interesting suspense break kaavali👻

  22. Well done ra congrats for this

  23. Eagerly waiting for part2 and it is very interesting thriller story but I enjoyed a lot I think that dead face is belongs to naresh

  24. Interesting story ra shivam
    Waiting for part 2
    All the best ra

  25. Superrrr Storyy, waiting for the next part

  26. Nice Interesting Story…
    waiting for Part-2

  27. Story super ga vundi Naku nachindi a savam mokham vala annaya naresh dena?

  28. Awesome bro. Keep creating…
    Nice work.

  29. Nice story writing ra shivam
    Very interesting

  30. Omg… Asalu Ni nunchi ilanti output asalu expect cheyle… Very very nice attempt shivam… You’re story telling was good…chinna chinna corrections unnai, avi ganaka correct cheskunte… Thop inka… Very impressive.

  31. Awesome story
    Perfect delivery
    Eagerly waiting for the next part

  32. · October 6, 2020 at 5:54 am

    Super ra Shivam. Neeku instant ga story cheppagaligey talent undi.
    We story kuda chaala bagundi and you have great scope in future

  33. Aa shavam baahubali di😂😂 just joking but story was very interesting…waiting for the conclusion❤❤

  34. Nee story lu maku thelusura last dhobbatuthav 😂😂😂

  35. Am creativity ra… Keka story

    Part2 eagerly waiting

  36. What a story macha very intresting story …👌👌👌 Ravi etu parigettado telsunte bagunnu…..😂😂

  37. Waiting for the part 2

  38. Waiting for the part 2 🙄

  39. Nice story 😊 I think a Shavam face Ravi dhi anukutha🙄

  40. Good starting,to the story is very well explained and we will wait for 2nd part.

  41. Emanna story raa asala 🔥

  42. Interesting story asalaaa🔥

  43. Super Story 👌👌👌

  44. Osm writings keep it up all the best